AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

రైల్వే స్టేషన్‌లలో అనుమానాస్పదంగా తిరుగుతున్న ఇద్దరు వ్యక్తులు.. వారి బ్యాగులు చెక్ చేయగా ఒళ్లు గగుర్పొడిచే సీన్..

వారి బ్యాగులు, వారి ప్రవర్తన పట్ల భద్రతా దళాలకు అనుమానం వచ్చింది. ఇద్దరినీ విచారించగా, ఇద్దరూ మాట్లాడలేరు, వినలేరు, కేవలం సంకేతాల ద్వారా మాత్రమే మాట్లాడుతున్నారు. అనుమానంతో ఆర్పీఎఫ్‌ సిబ్బంది వారి బ్యాగ్‌ను తెరిచి చూడగా, అందులో కనిపించిన దృశ్యం అందరినీ భయబ్రాంతులకు గురి చేసింది. పోలీసులు సైతం అది చూసి కంగుతిన్నారు.  రైల్వే పోలీసులతో పాటు, స్టేషన్‌లోని ప్రయాణికులు అంతా నివ్వేరపోయారు.

రైల్వే స్టేషన్‌లలో అనుమానాస్పదంగా తిరుగుతున్న ఇద్దరు వ్యక్తులు.. వారి బ్యాగులు చెక్ చేయగా ఒళ్లు గగుర్పొడిచే సీన్..
Suspicious Trolly Bag on Dadar Railway Station
Jyothi Gadda
|

Updated on: Aug 06, 2024 | 3:07 PM

Share

ఇద్దరు యువకులు చేతిలో పెద్ద ట్రాలీ బ్యాగ్‌తో రైల్వే స్టేషన్‌కు చేరుకున్నారు. అతను టుటారి ఎక్స్‌ప్రెస్‌ పట్టుకోవలసి ఉంది. ఇద్దరూ ఒకరితో ఒకరు మాట్లాడుకోకుండా మౌనంగా నడుస్తున్నారు. అప్పుడు రైల్వే ప్రొటెక్షన్ ఫోర్స్ (RPF) వారిని గమనించింది. సెక్యూరిటీ ఫోర్స్ సిబ్బంది ఏం అడిగినా విచిత్రంగా సమాధానమిస్తున్నారు.. కేవలం సైగల ద్వారానే మాట్లాడటం కొనసాగించారు. వారి బ్యాగులు, వారి ప్రవర్తన పట్ల భద్రతా దళాలకు అనుమానం వచ్చింది. ఇద్దరినీ విచారించగా, ఇద్దరూ మాట్లాడలేరు, వినలేరు, కేవలం సంకేతాల ద్వారా మాత్రమే మాట్లాడుతున్నారు. అనుమానంతో ఆర్పీఎఫ్‌ సిబ్బంది వారి బ్యాగ్‌ను తెరిచి చూడగా, అందులో కనిపించిన దృశ్యం అందరినీ భయబ్రాంతులకు గురి చేసింది. పోలీసులు సైతం అది చూసి కంగుతిన్నారు.  రైల్వే పోలీసులతో పాటు, స్టేషన్‌లోని ప్రయాణికులు అంతా నివ్వేరపోయారు. మహరాష్ట్రలోని దాదర్ రైల్వే స్టేషన్‌లో జరిగిన ఈ సంఘటన ప్రతి ఒక్కరికీ గూస్‌బంప్స్‌ వచ్చేలా చేసింది. పూర్తి వివరాల్లోకి వెళితే…

మహారాష్ట్రలోని దాదర్ రైల్వే స్టేషన్‌లో ఆగస్టు 5 సోమవారం రోజున ఈ సంచలన సంఘటన వెలుగులోకి వచ్చింది. రైల్వే స్టేషన్‌లో బ్యాగ్‌లో ఉన్న మృతదేహాన్ని ఆర్పీఎఫ్ స్వాధీనం చేసుకుంది. రైల్వే ప్రొటెక్షన్ ఫోర్స్ (RPF) సిబ్బంది దాదర్ రైల్వే స్టేషన్‌లో పెట్రోలింగ్‌లో ఉండగా వారి కళ్ళు ఒక వ్యక్తి తీసుకువెళుతున్న ట్రావెల్ బ్యాగ్‌పై పడ్డాయి. ఆ వ్యక్తి చర్యలపై అనుమానం రావడంతో ఆర్పీఎఫ్ సిబ్బంది అతడిని ఆపి బ్యాగ్‌ని సోదా చేశారు. ట్రావెల్ బ్యాగ్ తెరవగానే.. ఆర్పీఎఫ్ జవాన్లు షాక్ తిన్నారు. సైనికులు బ్యాగ్‌ని తెరిచి చూడగా అందులో రక్తంతో తడిసిన మృతదేహం కనిపించింది. రైల్వే ప్రొటెక్షన్ ఫోర్స్ దర్యాప్తు చేయగా.. మృతదేహం అర్షద్ అలీ అనే వ్యక్తిది అని తేలింది.

పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం, ట్రావెల్ బ్యాగ్‌ని తీసుకువెళుతున్న వ్యక్తిని జై ప్రవీణ్ చావ్డా, అతని సహచరుడు శివజిత్ సురేంద్ర సింగ్‌గా గుర్తించారు. మృతుడు, నిందితులు ఇద్దరూ వినలేరు, మాట్లాడలేరు అని తెలిసింది. నిందితులిద్దరినీ అరెస్ట్ చేసిన పోలీసులు సంకేత భాషా నిపుణుడిని పిలిపించి.. అప్పుడే హత్యకు గల కారణం తెలిసింది.

ఇవి కూడా చదవండి

అసలు విషయం ఏమిటంటే..

పోలీసుల నుండి అందిన సమాచారం ప్రకారం, నిందితులిద్దరూ శాంతా క్రజ్‌లో నివసిస్తున్న అర్షద్ అలీ షేక్‌ను హత్య చేశారు. తరువాత వారు ఆ మృతదేహాన్ని పడేసేందుకు గానూ టుటారీ ఎక్స్‌ప్రెస్ రైలులో ప్రయాణించబోతున్నారు. అయితే అంతకు ముందే పోలీసులు వారిద్దరినీ అరెస్టు చేశారు. ప్రధాన నిందితుడు శివజిత్ సురేంద్ర సింగ్‌కు, మృతునికి మధ్య అతని స్నేహితురాలి విషయంలో గొడవ జరిగిందని పోలీసులు తెలిపారు.

ముంబయిలోని పిధుని ప్రాంతంలోని తమ ఇంటికి పార్టీ కోసం నిందితులు మృతుడు అర్షద్‌ అలీని ఆహ్వానించినట్లు సమాచారం. పార్టీ మధ్యలోనే ఆ అమ్మాయి విషయపై ఇద్దరి మధ్య వాగ్వాదం జరిగింది. కొద్దిసేపటికే వివాదం తీవ్ర స్థాయికి చేరుకోవడంతో నిందితులు అర్షద్ అలీని హత్య చేశారు. తరువాత మృతదేహాన్ని పడవేసేందుకు సూట్‌కేస్‌లో ప్యాక్ చేశారు. ఎవరికీ ఎలాంటి అనుమానం రాకుండా, రక్తం బయట పడకుండా ఉండేందుకు మృతదేహాన్ని ప్లాస్టిక్‌తో ప్యాక్‌ చేశారు. అయితే బ్యాగ్ చెకింగ్ ఆపరేషన్‌లో పోలీసులు వారిని పట్టుకున్నారు. హత్యకు ఉపయోగించిన ఆయుధాన్ని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. కేసు నమోదు చేశారు.

మరిన్ని జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి..

Follow Us
పసుపు రంగులోకి మారిన దిండ్లను ఇలా తెల్లగా మార్చండి!
పసుపు రంగులోకి మారిన దిండ్లను ఇలా తెల్లగా మార్చండి!
త్రిపురలో 500 ఏళ్ల దుర్గాపూజ సంప్రదాయం.. అమ్మవారి విగ్రహం...
త్రిపురలో 500 ఏళ్ల దుర్గాపూజ సంప్రదాయం.. అమ్మవారి విగ్రహం...
జొన్నగిరి వజ్రాల నేపథ్యంలో 'జో జో’.. వీడియో గ్లింప్స్ చూశారా?
జొన్నగిరి వజ్రాల నేపథ్యంలో 'జో జో’.. వీడియో గ్లింప్స్ చూశారా?
బాల్కనీ, కిటికీ దగ్గరే పాలకూర పెంచేయొచ్చు.. ఇలా చేయండి!
బాల్కనీ, కిటికీ దగ్గరే పాలకూర పెంచేయొచ్చు.. ఇలా చేయండి!
56 ఏళ్ల వయసులోనూ మెరిసే చర్మం.. ఖుష్బూ బ్యూటీ సీక్రెట్ ఇదే!
56 ఏళ్ల వయసులోనూ మెరిసే చర్మం.. ఖుష్బూ బ్యూటీ సీక్రెట్ ఇదే!
6వేల మంది భక్తులకు అన్నప్రసాదం అందించే కేంద్రం ప్రారంభం
6వేల మంది భక్తులకు అన్నప్రసాదం అందించే కేంద్రం ప్రారంభం
72 ఏళ్ల వయసులో కార్లు, ట్రక్కులు నడుపుతున్న బామ్మ..వీడియోలు వైరల్
72 ఏళ్ల వయసులో కార్లు, ట్రక్కులు నడుపుతున్న బామ్మ..వీడియోలు వైరల్
రూ.10 వేలతో బిజినెస్ స్టార్ట్ చేయండి..ఆదాయం ఇచ్చే 5 వ్యాపారాలు!
రూ.10 వేలతో బిజినెస్ స్టార్ట్ చేయండి..ఆదాయం ఇచ్చే 5 వ్యాపారాలు!
సూది దారం లేకుండానే ఆకులను కుట్టే పిట్ట..
సూది దారం లేకుండానే ఆకులను కుట్టే పిట్ట..
అప్పుడు ఆ హీరోయిన్‌ను చంపేయాలనిపించింది.. అనుపమ కామెంట్స్ వైరల్
అప్పుడు ఆ హీరోయిన్‌ను చంపేయాలనిపించింది.. అనుపమ కామెంట్స్ వైరల్