50వేల మంది ఉద్యోగులకు సెలవిచ్చిన ప్రపంచంలోనే అతిపెద్ద వజ్రాల కంపెనీ.. కారణం తెలిస్తే షాకే..

అందుకే వజ్రాల ఉత్పత్తిని నియంత్రించేందుకు పది రోజుల సెలవు ప్రకటించినట్టుగా కిరణ్ జెమ్స్ ఛైర్మన్ వల్లభాయ్ లఖానీ తెలిపారు. కంపెనీ చరిత్రలో ఇలాంటి నిర్ణయం తీసుకోవడం ఇదే తొలిసారిగా చెప్పారు. అంతర్జాతీయంగా బ్యాండెడ్ వజ్రాల ధరలు కూడా తగ్గుముఖం పట్టడంతో వజ్రాల కంపెనీలు నిలదొక్కుకోవడానికి ఇబ్బంది పడుతున్నాయని లఖానీ అన్నారు.

50వేల మంది ఉద్యోగులకు సెలవిచ్చిన ప్రపంచంలోనే అతిపెద్ద వజ్రాల కంపెనీ.. కారణం తెలిస్తే షాకే..
Surat Diamond Firm
Follow us
Jyothi Gadda

|

Updated on: Aug 06, 2024 | 4:04 PM

ప్రపంచంలోనే అతిపెద్ద సహజ వజ్రాల కంపెనీ కిరణ్ జెమ్స్ ఉత్పత్తిని నిలిపివేసింది. ఈ మేరకు ఆగస్టు 17 నుంచి 27 వరకు తమ ఉద్యోగులకు తప్పనిసరి సెలవు ప్రకటించింది. గుజరాత్‌లోని ఈ డైమండ్ సంస్థ 50,000 మంది సిబ్బందికి 10 రోజుల సెలవు ప్రకటించింది. కిరణ్ జేమ్స్ అనే డైమండ్ సంస్థ తన 50,000 మంది ఉద్యోగులకు సోమవారం 10 రోజుల సెలవులు ఇస్తున్నట్లు ప్రకటించింది. వజ్రాల ఉత్పత్తిని నియంత్రించేందుకు వీలుగా ఈ సెలవులు ఇచ్చినట్టుగా కంపెనీ ప్రకటించింది. వాస్తవానికి, ప్రపంచవ్యాప్తంగా డిమాండ్ తగ్గడంతో, దేశంలో వజ్రాల వ్యాపారుల స్టాక్ పెరిగింది. ప్రపంచంలోని అతిపెద్ద సహజ వజ్రాల తయారీదారుగా, పాలిష్ చేసిన వజ్రాల అతిపెద్ద ఎగుమతిదారుల్లో ఒకటైన కిరణ్ జెమ్స్ ఆగస్టు 17 నుంచి 27 వరకు తమ ఉద్యోగులకు సెలవు ప్రకటించింది.

రష్యా-ఉక్రెయిన్ యుద్ధం నేపథ్యంలో అమెరికా, జీ7 సభ్య దేశాలు రష్యా నుంచి వజ్రాలపై ఆంక్షలు విధించాయి. ఆ దేశాల ఈ నిర్ణయం భారత వజ్రాల పరిశ్రమపై పెను ప్రభావం చూపిందని అంటున్నారు. వజ్రాల పరిశ్రమకు ఇప్పుడు గడ్డు సమయంగా మారింది. ఎందుకంటే ప్రపంచవ్యాప్తంగా పాలిష్ చేసిన వజ్రాలకు డిమాండ్ లేదు. అందుకే వజ్రాల ఉత్పత్తిని నియంత్రించేందుకు పది రోజుల సెలవు ప్రకటించినట్టుగా కిరణ్ జెమ్స్ ఛైర్మన్ వల్లభాయ్ లఖానీ తెలిపారు. కంపెనీ చరిత్రలో ఇలాంటి నిర్ణయం తీసుకోవడం ఇదే తొలిసారిగా చెప్పారు. అంతర్జాతీయంగా బ్యాండెడ్ వజ్రాల ధరలు కూడా తగ్గుముఖం పట్టడంతో వజ్రాల కంపెనీలు నిలదొక్కుకోవడానికి ఇబ్బంది పడుతున్నాయని లఖానీ అన్నారు.

ప్రపంచవ్యాప్తంగా పాలిష్ చేసిన వజ్రాల ధర పడిపోయిందని, వజ్రాల తయారీదారులు తమ వ్యాపారాలను నిర్వహించడం కష్టంగా మారిందని ఆయన అన్నారు. సరఫరాను నియంత్రిస్తే డిమాండ్ పెరిగి పరిశ్రమకు ప్రయోజనం చేకూరుతుందని భావిస్తున్నట్టుగా చెప్పారు. సాధారణంగా దీపావళి సందర్భంగా డైమండ్ ఫ్యాక్టరీలకు సుదీర్ఘ సెలవులు ఉంటాయి. 17,000 కోట్ల వార్షిక టర్నోవర్‌తో కిరణ్ జెమ్స్, ప్రపంచంలోని ప్రముఖ వజ్రాల కంపెనీలలో ఒకటైన డి బీర్స్‌కు చెందిన సైట్ హోల్డర్‌లలో ఒకరు.

ఇవి కూడా చదవండి

మరిన్ని జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి..

టమాటా మసాలా కర్రీ.. ఎందులోకైనా అదుర్స్ అంతే..
టమాటా మసాలా కర్రీ.. ఎందులోకైనా అదుర్స్ అంతే..
ఉపేంద్ర UI బ్యూటీని శ్రీలీలతో పోలుస్తున్న నెటిజన్స్.. ఎందుకంటే..
ఉపేంద్ర UI బ్యూటీని శ్రీలీలతో పోలుస్తున్న నెటిజన్స్.. ఎందుకంటే..
ఇంట్లో పనిచేసే వారితో రామ్ చరణ్- ఉపాసన క్రిస్మస్ వేడుకలు.. ఫొటోస్
ఇంట్లో పనిచేసే వారితో రామ్ చరణ్- ఉపాసన క్రిస్మస్ వేడుకలు.. ఫొటోస్
ప్రఖ్యాత రచయిత వాసుదేవన్ నాయర్ కన్నుమూత
ప్రఖ్యాత రచయిత వాసుదేవన్ నాయర్ కన్నుమూత
నితీష్, నవీన్ పట్నాయక్‌కు భారతరత్న.. తెరమీదకు కొత్త డిమాండ్
నితీష్, నవీన్ పట్నాయక్‌కు భారతరత్న.. తెరమీదకు కొత్త డిమాండ్
శివన్న ఆరోగ్యంపై అప్డేట్ ఇచ్చిన కూతురు.. ఎమోషనల్ పోస్ట్
శివన్న ఆరోగ్యంపై అప్డేట్ ఇచ్చిన కూతురు.. ఎమోషనల్ పోస్ట్
మల్లారెడ్డా మజాకా.. జిమ్‌లో అదరగొట్టిన మాజీ మంత్రి
మల్లారెడ్డా మజాకా.. జిమ్‌లో అదరగొట్టిన మాజీ మంత్రి
స్మార్ట్ వాచ్‌లు పెట్టుకుంటున్నారా.. ఈ వ్యాధులు రావడం ఖాయం!
స్మార్ట్ వాచ్‌లు పెట్టుకుంటున్నారా.. ఈ వ్యాధులు రావడం ఖాయం!
ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలుకలిగిన క్యాబేజీ..వారానికి ఒక్కసారైనా తింటే
ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలుకలిగిన క్యాబేజీ..వారానికి ఒక్కసారైనా తింటే
శ్రీతేజ్‌ను పరామర్శించిన జానీ మాస్టర్.. బన్నీ గురించి ఏమన్నాడంటే?
శ్రీతేజ్‌ను పరామర్శించిన జానీ మాస్టర్.. బన్నీ గురించి ఏమన్నాడంటే?