AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Bajaj Electric Scooter: స్పెషల్ ఎడిషన్‌తో షేక్ చేసిన బజాజ్.. అమెజాన్లోనే కొనేయొచ్చు..

బజాజ్ చేతక్ 3201 స్పెషల్ ఎడిషన్ ఆగస్టు ఐదో తేదీ నుంచి ప్రముఖ ఈ-కామర్స్ ప్లాట్ ఫారం అమెజాన్ లో వినియోగదారులకు అందుబాటులో ఉంచింది. రూ. 1.23లక్షల ప్రారంభ ధర ఉంది. ఈ స్పెషల్ ఎడిషన్ ఇప్పటికే అందుబాటులో ఉన్న బజాజ్ చేతక్ టాప్ స్పెక్ ప్రీమియం వేరియంట్ ఆధారంగా రూపొందించారు.

Bajaj Electric Scooter: స్పెషల్ ఎడిషన్‌తో షేక్ చేసిన బజాజ్.. అమెజాన్లోనే కొనేయొచ్చు..
Bajaj Chetak Limited Edition
Madhu
|

Updated on: Aug 06, 2024 | 3:57 PM

Share

భారతీయ ఆటో మార్కెట్ విద్యుత్ శ్రేణి ద్విచక్ర వాహనాలకు అడ్డాగా మారుతోంది. క్రమంగా సంప్రదాయ పెట్రోల్ ఇంజిన్ల స్థానంలో ఎలక్ట్రిక్ వేరియంట్లు మార్కెట్లో తన స్థానాన్ని సుస్థిరం చేసుకునే దిశగా అడుగులు వేస్తున్నాయి. పెద్ద ఎత్తున కొత్త ఉత్పత్తులను లాంచ్ చేస్తున్నాయి. పూర్తి పర్యావరణ హితం కావడం, మెయింటెనెన్స్ పెద్దగా లేకపోవడంతో అందరూ వీటిని కొనుగోలు చేస్తున్నారు. ముఖ్యంగా సిటీ పరిధిలో అవసరాలకు, ట్రాఫిక్ లో ప్రయాణానికి చాలా బాగా ఉపకరిస్తుండటంతో ప్రజలు వీటి వైపు మొగ్గుచూపుతున్నారు. ముఖ్యంగా ఓలా, ఏథర్, టీవీఎస్, బజాబ్ వంటి కంపెనీలు అనేక రకాల మోడళ్లు, విభిన్న వేరియంట్లను లాంచ్ చేస్తున్నాయి. అత్యాధునిక సాంకేతికతను వీటిలో ఉంచుతున్నాయి. ఒక కంపెనీతో ఒకటి పోటీ పడి ఉత్పత్తులను లాంచ్ చేస్తున్నాయి. ఈ క్రమంలో బజాజ్ ఆటో మరో కొత్త స్కూటర్ ను లిమిటెడ్ ఎడిషన్ గా భారతీయ మార్కెట్లోకి తీసుకొచ్చింది. బజాజ్ చేతక్ 3201 స్పెషల్ ఎడిషన్ పేరిట రూ. 1.30లక్షలు(ఎక్స్ షోరూం) ప్రారంభ ధరతో విడుదల చేసింది. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు ఇప్పుడు చూద్దాం..

బజాజ్ చేతక్ స్పెషల్ ఎడిషన్..

బజాజ్ చేతక్ 3201 స్పెషల్ ఎడిషన్ ఆగస్టు ఐదో తేదీ నుంచి ప్రముఖ ఈ-కామర్స్ ప్లాట్ ఫారం అమెజాన్ లో వినియోగదారులకు అందుబాటులో ఉంచింది. రూ. 1.23లక్షల ప్రారంభ ధర ఉంది. ఈ స్పెషల్ ఎడిషన్ ఇప్పటికే అందుబాటులో ఉన్న బజాజ్ చేతక్ టాప్ స్పెక్ ప్రీమియం వేరియంట్ ఆధారంగా రూపొందించారు. ఇది బ్రూక్లిన్ బ్లాక్‌లో సైడ్ ప్యానెల్‌లపై ‘చేతక్’ డీకాల్స్‌తో పూర్తి చేసి ఉంది. 2-టోన్ క్విల్టెడ్ సీటును కలిగి ఉంది.

బజాజ్ చేతక్ స్పెషల్ ఎడిషన్ ఫీచర్లు..

ఇక ఈ స్పెషల్ ఎడిషన్ స్కూటర్ ఫీచర్ల చూస్తే.. టర్న్-బై-టర్న్ నావిగేషన్, మ్యూజిక్ కంట్రోల్స్, కాల్ అలర్ట్‌లతో కలర్ టీఎఫ్టీ ఇన్స్ట్రుమెంట్ కన్సోల్‌ను కలిగి ఉంటుంది. ఇ-స్కూటర్‌లో ‘స్పోర్ట్’ రైడింగ్ మోడ్ కూడా ఉంది. హిల్ హోల్డ్ కంట్రోల్‌తో వస్తుంది.

బజాజ్ చేతక్ స్పెషల్ ఎడిషన్ స్పెసిఫికేషన్స్..

చేతక్ 3201 స్పెషల్ ఎడిషన్ స్కూటర్లో ప్రామాణిక మోడల్ వలె అదే 3.2 కేడబ్ల్యూహెచ్ బ్యాటరీ ప్యాక్ ఉంటుంది. ఇది ఒక సారి ఛార్జ్ చేస్తే 127 కిమీల రేంజ్ ఇస్తుంది. ఇది అరై(ARAI) ధ్రువీకరించిన పరిధి. ఈ స్కూటర్ గరిష్టంగా గంటకు 73 కిలోమీటర్ల వేగంతో ప్రయాణించగలుగుతుంది.

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..