ఓరి దేవుడో..! పళ్లు తోముకుంటూ టూత్‌బ్రష్‌ మింగేసింది..! ఆ తర్వాత ఏం జరిగిందంటే..

టూత్‌బ్రష్‌ మింగేశారంటే అక్కడి వైద్యులు మొదట నమ్మలేదు. ఆమెకు అల్ట్రాసౌండ్ నిర్వహించగా ఏమీ తెలియలేదట. ఆ రోజు వారు ఇంటికి తిరిగి వెళ్లిపోయారు. కానీ, మరుసటి రోజు ఆమె మళ్ళీ ఆసుపత్రికి వెళ్లి ఎండోస్కోపీ చేయించుకుంది. కడుపులో బ్రష్‌ ఉన్నటుగా తెలిసింది. కానీ, డాక్టర్ ఈ టూత్ బ్రష్ తీయలేకపోవడంతో అతను ఆమెను మరొక ఆసుపత్రికి రిఫర్‌ చేశాడట.

ఓరి దేవుడో..! పళ్లు తోముకుంటూ టూత్‌బ్రష్‌ మింగేసింది..! ఆ తర్వాత ఏం జరిగిందంటే..
Woman Swallow Toothbrush
Follow us
Jyothi Gadda

|

Updated on: Aug 06, 2024 | 5:23 PM

ఓ మహిళ పళ్లు తోముకుంటుండగా ఉన్నట్టుండి బ్రష్ ఆమె కడుపులోకి వెళ్లిపోయింది. వెంటనే వైద్యుడి వద్దకు వెళ్లగా అతను ఆ విషయాన్ని నమ్మలేకపోయాడు. చివరకు ఎంతో కష్టపడి వైద్యుల బృందం ఆమె కడుపులోంచి ఆ బ్రష్‌ను బయటకు తీశారు. ఈ ఘటన క్రొయేషియాకు చెందినదిగా తెలిసింది. గత నెల జూలై 27న జరిగింది. 38 ఏళ్ల అంబర్ హంట్ అనే మహిళ తన 41 ఏళ్ల భర్త అమీర్ డెర్విక్, వారి ఇద్దరు పిల్లలతో హాలీడేస్‌ కోసం తన అత్తమామల ఇంటికి వచ్చింది. వారితో పాటు ఇద్దరు పిల్లలు కూడా ఉన్నారు. ఒకరోజు అంబర్ నిద్రపోయే ముందు పళ్ళు తోముకోవడానికి వెళ్ళింది. బ్రష్ చేస్తుండగా సడెన్‌గా 20 సెం.మీ ఆ టూత్ బ్రష్ జారి ఆమె గొంతులోకి వెళ్ళిపోయింది. దీంతో భయపడిన అంబర్ టూత్ బ్రష్‌ను బయటకు తీసేందుకు ఎంత ప్రయత్నించినా ప్రయోజనం లేకపోయింది. ఈ విషయాన్ని అంబర్ తన భర్తకు చెప్పింది. వెంటనే ఆసుపత్రికి వెళ్లారు.

టూత్‌బ్రష్‌ మింగేశారంటే అక్కడి వైద్యులు మొదట నమ్మలేదు. ఆమెకు అల్ట్రాసౌండ్ నిర్వహించగా ఏమీ తెలియలేదట. ఆ రోజు వారు ఇంటికి తిరిగి వెళ్లిపోయారు. కానీ, మరుసటి రోజు ఆమె మళ్ళీ ఆసుపత్రికి వెళ్లి ఎండోస్కోపీ చేయించుకుంది. కడుపులో బ్రష్‌ ఉన్నటుగా తెలిసింది. కానీ, డాక్టర్ ఈ టూత్ బ్రష్ తీయలేకపోవడంతో అతను ఆమెను మరొక ఆసుపత్రికి రిఫర్‌ చేశాడట. అక్కడ సుమారు 45 నిమిషాల పాటు శ్రమించిన వైద్యులు ఎట్టకేలకు బ్రష్‌ను బయటకు తీశారు. ఆమె మెడలో అమర్చిన కెమెరాకు వైద్యులు వైర్‌ను కట్టి, దానిని ఉపయోగించి టూత్ బ్రష్‌ను బయటకు తీశారని చెప్పారు. ఈ సమయంలో, అంబర్ స్పృహలోనే ఉందట. ఇదంతా ఆమె చూస్తూనే ఉందట.

ఈ ఘటన తర్వాత తాను చాలా భయపడ్డానని, అయితే ప్రాణాలతో బయటపడినందుకు సంతోషంగా ఉందని అంబర్ చెప్పింది. మళ్లీ నా చేతుల్లోంచి బ్రష్ జారిపోతుందేమోనని భయంగా ఉంది. కానీ, చాలా జాగ్రత్తగా, నెమ్మదిగా బ్రష్ చేస్తున్నాను అని అంబర్‌ చెప్పింది.

ఇవి కూడా చదవండి

మరిన్ని ట్రెండింగ్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..

Horoscope Today: వారికి ఉద్యోగంలో పని భారం పెరిగే ఛాన్స్..
Horoscope Today: వారికి ఉద్యోగంలో పని భారం పెరిగే ఛాన్స్..
క్యాచ్ పట్టుకునే ప్రయత్నంలో ఢీకొన్న క్రికెటర్లు.. వీడియోలు వైరల్
క్యాచ్ పట్టుకునే ప్రయత్నంలో ఢీకొన్న క్రికెటర్లు.. వీడియోలు వైరల్
డిజిటల్ పర్సనల్ డేటా ప్రొటెక్షన్ యాక్ట్ ముసాయిదా రిలీజ్
డిజిటల్ పర్సనల్ డేటా ప్రొటెక్షన్ యాక్ట్ ముసాయిదా రిలీజ్
ఎంగేజ్‌మెంట్ చేసుకున్న అరుంధతి ఛైల్డ్ ఆర్టిస్ట్.. ఫొటోస్ వైరల్
ఎంగేజ్‌మెంట్ చేసుకున్న అరుంధతి ఛైల్డ్ ఆర్టిస్ట్.. ఫొటోస్ వైరల్
సల్మాన్ ఖాన్ తమ్ముడు విడాకులు..
సల్మాన్ ఖాన్ తమ్ముడు విడాకులు..
12 కిలోల బరువు పెరిగి.. ఆపై చైన్ స్మోకర్‏గా మారిన హీరోయిన్..
12 కిలోల బరువు పెరిగి.. ఆపై చైన్ స్మోకర్‏గా మారిన హీరోయిన్..
రోజుకు ఎన్ని లీటర్ల నీరు తాగాలో తెలుసా.. ఎక్కువైతే ఏమౌతుంది..?
రోజుకు ఎన్ని లీటర్ల నీరు తాగాలో తెలుసా.. ఎక్కువైతే ఏమౌతుంది..?
కొత్త ఏడాది పైనే ఫ్లాప్ హీరోయిన్ల ఆశలు.. ఇప్పుడైన కలిసొచ్చేన
కొత్త ఏడాది పైనే ఫ్లాప్ హీరోయిన్ల ఆశలు.. ఇప్పుడైన కలిసొచ్చేన
నీయవ్వ తగ్గేదేలే.. పుష్పరాజ్‌లా పోజులిచ్చిన స్టార్ హీరోయిన్ డాటర్
నీయవ్వ తగ్గేదేలే.. పుష్పరాజ్‌లా పోజులిచ్చిన స్టార్ హీరోయిన్ డాటర్
వీళ్లు బాదంపప్పును పొరపాటున కూడా తినకూడదు.. దూరంగా ఉంటేనే ఆరోగ్యం
వీళ్లు బాదంపప్పును పొరపాటున కూడా తినకూడదు.. దూరంగా ఉంటేనే ఆరోగ్యం