Watch: విమానం కూలిన ఘటనలో ఊహించని మిరాకిల్.. తృటిలో తప్పించుకున్న వ్యక్తి.. షాకింగ్ వీడియో వైరల్
ఘటన జరిగిన ప్రాంతానికి సమీపంలో ఓ వ్యక్తి నడుచుకుంటూ వెళ్తున్నాడు. విమానం ల్యాండింగ్ ప్రదేశం వేరే చోట ఉండి ఉంటే, ఆ వ్యక్తి ప్రాణాలు కోల్పోయే అవకాశం ఉంది. భూమిపై పడిన తర్వాత విమానం గోడను ఢీకొట్టి అక్కడే ఆగిపోయినట్లు బయటకు వచ్చిన వీడియోలో చూడవచ్చు. ఏదైనా నివాస ప్రాంతంలో పడి ఉంటే పెను ప్రమాదం జరిగి ఉండేది.
గోల్ఫ్ కోర్స్‌లో విమానం దిగిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. గోల్ఫ్ కోర్స్‌లో విమానం ఒక్కసారిగా పడిపోయినట్లు ఈ వీడియోలో చూడవచ్చు. విమానం కూలిన ప్రదేశంలో అప్పటికే ఓ వ్యక్తి నిలబడి ఉన్నాడు. ఈ ఘటన అమెరికాలోని కాలిఫోర్నియాలోని హాగిన్ ఓక్స్ గోల్ఫ్ కాంప్లెక్స్‌లో చోటుచేసుకుంది. ఈ ఘటన మొత్తం సీసీటీవీ కెమెరాల్లో రికార్డైంది. అయితే, ఇది ఒక చిన్న విమానం అని తెలిసింది. దీనిని సింగిల్-ఇంజిన్ పైపర్ PA28 అని పిలుస్తారు. పైలట్ తెలిపిన వివరాల ప్రకారం, విమానంలో తలెత్తిన సాంకేతిక లోపం కారణంగా పైలట్ దానిపై నియంత్రణ కోల్పోయాడు. 400 అడుగుల ఎత్తులో ప్రమాదాన్ని పసిగట్టిన పైలట్ గోల్ఫ్ కోర్స్ ఫెయిర్‌వేలో దిగాలని నిర్ణయించుకున్నాడు. ఈ క్రమంలోనే విమానం ల్యాండ్ అయిన చోట ఓ వ్యక్తి నిలబడి ఉన్నాడు. ఆ తర్వాత ఏం జరిగిందో వైరల్ వీడియోలో కనిపించింది.
గోల్ఫ్ కోర్స్ ఓపెన్, సురక్షితమైన ప్రదేశం కాబట్టి పైలట్ విమానాన్ని ల్యాండ్ చేసాడు. ఈ ఘటనలో పైలట్‌కు స్వల్ప గాయాలైనట్లు సమాచారం. అనంతరం ఆస్పత్రికి తరలించగా ప్రాణాపాయం నుంచి బయటపడ్డాడు. ప్రమాదం జరిగిన తర్వాత విమానం నుంచి ఇంధనం లీకైనప్పటికీ మంటలు చెలరేగకపోవడం విశేషం.
The golfer got a second life!
A small plane crash-landed on a golf course in Sacramento, California, narrowly missing a golfer. The pilot, who had taken off from McClellan Air Force Base, experienced complete mechanical failure at around 400 feet (120m), according to the… pic.twitter.com/8nZb3E8m3W
— WhiteHouse (@WhiteHouseIce) August 5, 2024
అయితే, ఈ ఘటన జరిగిన ప్రాంతానికి సమీపంలో ఓ వ్యక్తి నడుచుకుంటూ వెళ్తున్నాడు. విమానం ల్యాండింగ్ ప్రదేశం కాస్త ముందుకు జరిగి ఉంటే..ఆ వ్యక్తి ప్రాణాలు గాల్లో కలిసిపోయేవి. నేలపై కూలిన తరువాత ఆ విమానం గోడను ఢీకొట్టి అక్కడే ఆగిపోయినట్లు బయటకు వచ్చిన వీడియోలో కనిపించింది. ఏదైనా నివాస ప్రాంతంలో పడి ఉంటే పెను ప్రమాదం జరిగి ఉండేది.
ఈ సంఘటన జరిగిన తర్వాత గోల్ఫ్‌కోర్స్‌లో పెద్ద శబ్ధం వినబడిందని, కానీ, అది ఏమిటో మాకు అర్థం కాలేదని గోల్ఫ్ కోర్స్ ఉద్యోగి చెప్పారు. ఇంతకు ముందు ఇలాంటి ప్రమాదం చూడలేదన్నారు. కాగా, ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
మరిన్ని ట్రెండింగ్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..