Viral Video: పాకిస్తాన్ కి చెందిన దేశీ జుగాడ్ వీడియో వైరల్.. ఈ పిల్లల తల్లిదండ్రులను జైలులో పెట్టాలని నెటిజన్స్ ఫైర్

ఇంటర్నెట్‌లో ప్రత్యక్షమైన దేశీ జుగాద్ వీడియో చూసిన జనాలు షాక్ అవ్వడమే కాకుండా ఆగ్రహం కూడా వ్యక్తం చేస్తున్నారు. 20 సెకన్ల క్లిప్‌లో ముగ్గురు పిల్లలు కారు వెనుక జుగాద్‌తో ప్రయాణిస్తున్నట్లు చూపిస్తోంది. నెటిజన్లు ఇది చాలా ప్రమాదకరమంటున్నారు. పిల్లలు ఏమి చేస్తున్నా పట్టించుకుండా ఉండే తల్లిదండ్రులను నేరుగా జైలుకు పంపాలని ప్రజలు అంటున్నారు.

Viral Video: పాకిస్తాన్ కి చెందిన దేశీ జుగాడ్ వీడియో వైరల్.. ఈ పిల్లల తల్లిదండ్రులను జైలులో పెట్టాలని నెటిజన్స్ ఫైర్
Viral Video
Follow us
Surya Kala

|

Updated on: Aug 07, 2024 | 11:37 AM

దేశీ జుగాద్ కు సంబంధించిన వీడియోలు నెటిజన్లకు నచ్చుతున్నాయి. అందుకే వీటిని బాగా సోషల్ మీడియాలో షేర్ చేస్తున్నారు. వీటిని చాలా మంది దీనిని కూడా ప్రయత్నిస్తారు. అయితే ఇంటర్నెట్‌లో ప్రత్యక్షమైన దేశీ జుగాద్ వీడియో చూసిన జనాలు షాక్ అవ్వడమే కాకుండా ఆగ్రహం కూడా వ్యక్తం చేస్తున్నారు. 20 సెకన్ల క్లిప్‌లో ముగ్గురు పిల్లలు కారు వెనుక జుగాద్‌తో ప్రయాణిస్తున్నట్లు చూపిస్తోంది. నెటిజన్లు ఇది చాలా ప్రమాదకరమంటున్నారు. పిల్లలు ఏమి చేస్తున్నా పట్టించుకుండా ఉండే తల్లిదండ్రులను నేరుగా జైలుకు పంపాలని ప్రజలు అంటున్నారు.

వైరల్ అవుతున్న వీడియోలో ఎక్కువ మంది వ్యక్తులు కూర్చునే విధంగా కారును సవరించినట్లు చూపబడింది. కుటుంబం కారు డిక్కీని కట్ చేసి దానికి నెట్‌ను అమర్చారు, అందులో ముగ్గురు పిల్లలు కూర్చున్నట్లు మీరు చూడవచ్చు. దూరం నుంచి చూస్తే పిల్లలను బోనులో బంధించినట్లు అనిపిస్తుంది. వాహనం వెనుక వెళ్తున్న మరో వ్యక్తి ఈ వీడియోను రికార్డ్ చేశాడు. వీడియో చిత్రీకరిస్తున్న వ్యక్తి కరాచీ ఎంత పురోగతి సాధించిందో చెప్పడం వినవచ్చు. అంటే పొరుగు దేశం పాకిస్థాన్ కి సంబంధించిన ఈ వీడియో వైరల్‌గా మారింది.

ఇవి కూడా చదవండి

ఇక్కడ వీడియో చూడండి

అయితే టీవీ9 ఈ వీడియోను చిత్రీకరించిన లొకేషన్ క్లెయిమ్‌ను నిర్ధారించలేదు. అయితే చిన్న పిల్లలు కారు వెనుక కూర్చొని ప్రయాణిస్తున్న తీరు చూసి నెటిజన్లు తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. @cctvidiots హ్యాండిల్‌తో వీడియోను షేర్ చేసి పిల్లలను ఎలా ప్రమాదకరమైన రీతిలో తీసుకువెళుతున్నారో చూడండి అనే క్యాప్షన్ జత చేశారు.

ఒక వినియోగదారు వ్యాఖ్యానించారు, ఓహ్ మై గాడ్! ట్రాఫిక్ పోలీసులు ఏం చేస్తున్నారు? అదే సమయంలో, తమ పిల్లల ప్రాణాలను ప్రమాదంలో పడేసే తల్లిదండ్రులకు జైలు శిక్ష విధించాలని మరొక వినియోగదారు తీవ్రంగా నిరనస వ్యక్తం చేస్తున్నారు. ఇది తల్లిదండ్రుల మూర్ఖత్వానికి నిదర్శనం అంటూ మరొక వినియోగదారు వ్యాఖ్యానించారు.

మరిన్ని ట్రెండింగ్ వీడియో వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..