సుగంధ పాల వేర్ల రహస్యం తెలిస్తే.. ఎక్కడున్నా వెతుక్కుంటూ ఇంటికి తెచ్చుకుంటారు.. ఆరోగ్య ప్రయోజనాలు పుష్కలం..!
సుగంధ పాల వేర్లు.. ఈ పేరు ఎప్పుడైనా విన్నారా..? వీటి ఉపయోగాల గురించి తెలిస్తే మాత్రం ఆశ్చర్యపోవాల్సిందే. అనేక రకాల అనారోగ్య సమస్యలను నయం చేయడంలో సుగంధి పాల మొక్క అద్భుతం చేస్తుంది. శరీరానికి చలువ చేయడంతో పాటు సుగంధ పాల వేర్లు అనేక ఇతర ఔషధ గుణాలను కలిగి ఉంటాయి.

సుగంధ పాల వేర్లు.. ఈ పేరు ఎప్పుడైనా విన్నారా..? వీటి ఉపయోగాల గురించి తెలిస్తే మాత్రం ఆశ్చర్యపోవాల్సిందే. అనేక రకాల అనారోగ్య సమస్యలను నయం చేయడంలో సుగంధి పాల మొక్క అద్భుతం చేస్తుంది. శరీరానికి చలువ చేయడంతో పాటు సుగంధ పాల వేర్లు అనేక ఇతర ఔషధ గుణాలను కలిగి ఉంటాయి. దీనిలో యాంటీ బ్యాక్టీరియల్, యాంటీ వైరల్ గుణాలు పుష్కలంగా ఉంటాయి. సుగంధి పాల మొక్క వేరు చక్కని సువాసనను కలిగి ఉంటుంది. ఈ వేరును శుభ్రంగా కడిగి నీటిలో వేసి మరిగించగా ఎర్రని కషాయం తయారవుతుంది. ఈ కషాయాన్ని తాగడం వల్ల శరీరానికి బలం చేకూరుతుంది.
ఈ సుగంధి పాల వేర్లు మనకు ఆయుర్వేద షాపుల్లో అమ్ముతుంటారు. ఇది అనేక రకాలుగా లభిస్తుంది. ఒకటి నల్ల సుగంధి, ఎర్ర సుగంధి, దేశీయ సుగంధి ఇలా అనేక రకాలు ఉంటాయి. ఈ సుగంధి వేర్లతో కషాయాన్ని తయారు చేసి తీసుకోవడం వల్ల ఆరోగ్యానికి అనేక ప్రయోజనాలు కలుగుతాయి. శరీరంలో ఉండే వేడి అంతా పోయి చలువ చేస్తుంది. అధిక వేడితో బాధపడేవారు ఈ కషాయాన్ని తాగడం వల్ల మంచి ఫలితం ఉంటుంది. అధిక వేడి వల్ల కలిగే అనారోగ్య సమస్యల బారిన పడకుండా చేస్తుంది. సుగంధి పాల మొక్క వేరు కషాయాన్ని తాగడం వల్ల శరీరంలో రోగ నిరోధక శక్తి పెరిగి రోగాల బారిన పడకుండా ఉంటాం. సుగంధి పాల వేర్ల కషాయాన్ని తాగడం వల్ల ఆకలి పెరుగుతుంది. జ్వరం వచ్చినప్పుడు ఈ కషాయాన్ని తాగడం వల్ల జ్వరం త్వరగా తగ్గుతుంది.
ఈ సుగంధి పాల మొక్క వేరును కడిగి నేరుగా నోట్లో పెట్టుకుని నమిలి రసాన్ని మింగవచ్చు. సుగంధి పాల మొక్క వేరు కషాయాన్ని తాగడం వల్ల కీళ్ల నొప్పులు కూడా తగ్గుతాయి. శరీరంలో ఉండే మలినాలు తొలగిపోతాయి. చర్మం ఆరోగ్యంగా ఉండడంతోపాటు కాంతివంతంగా కూడా తయారవుతంది. శరీరంలో రక్త ప్రసరణ సాఫీగా జరుగుతుంది. సుగంధి వేర్లతో తయారు చేసిన కషాయాన్ని తీసుకోవడం వల్ల మనం ఇన్పెక్షన్ ల బారిన పడకుండా ఉంటాము. సుంగధ వేర్లతో చేసిన కషాయాన్ని తీసుకోవడం వల్ల రక్తం శుభ్రపడుతుంది. శరీరంలో వేడి తగ్గుతుంది. జీర్ణశక్తి మెరుగుపడుతుంది. మలబద్దకం సమస్య తగ్గుతుంది. ఈ కషాయాన్ని తాగడం వల్ల మూత్రాశయ ఇన్పెక్షన్ లు కూడా మన దరి చేరకుండా ఉంటాయి. ఈవిధంగా సుగంధ వేర్లు మన ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయని వీటిని వాడడం వల్ల మనకు ఎంతో మేలు కలుగుతుందని ఆయుర్వేద నిపుణులు చెబుతున్నారు.
సుగంధ వేర్లతో కషాయాన్ని ఎలా తయారు చేసుకోవాలి.. కషాయం తయారీకి కావల్సిన పదార్థాలు ఏమిటి… ఈ కషాయాన్ని తాగడం వల్ల మనక కలిగే ఆరోగ్య ప్రయోజనాలు ఏమిటి.. అన్న వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం. సుగంధ వేర్లతో కషాయాన్ని తయారు చేసుకోవడానికి గానూ మనం 4 లేదా 5 గ్రాముల సుగంధ వేర్ల బెరడు పొడి, 4 మిరియాలను, 2 యాలకులను, ఒక చిన్న అల్లం ముక్కను, 10 పుదీనా ఆకులను ఉపయోగించాల్సి ఉంటుంది.
ముందుగా ఒక గిన్నెలో రెండు కప్పుల నీళ్లు పోసిఅందులో సుగంధ వేర్ల పొడి, అల్లం, మిరియాలు, యాలకులు వేసి నీటిని బాగా మరిగించాలి. నీళ్లు మరిగిన తరువాత వడకట్టి అందులో పుదీనా ఆకులు, తేనె వేసి కలిపి తాగాలి. ఇలా రోజుకు రెండు లేదా మూడు సార్లు తీసుకోవడం వల్ల మనం చక్కటి ఆరోగ్యాన్ని సొంతం చేసుకోవచ్చు. ఈ కషాయాన్ని తాగడం వల్ల మన శరీరంలో రోగనిరోధక శక్తి పెరుగుతుంది.
(NOTE: ఇంటర్నెట్‌లో సేకరించిన సమాచారం ఆధారంగా ఈ వివరాలు మీకు అందించటం జరిగింది… ప్రయత్నించేముందు సంబంధిత నిపుణుల సలహాలను పాటించవలసిందిగా మనవి. ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. తదుపరి జరిగే ఎలాంటి పరిణామాలకు TV9 Telugu.com బాధ్యత వహించదు.)
మరిన్ని లైఫ్ స్టైల్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..




