AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

కొవ్వును వెన్నలా కరిగించే మ్యాజిక్ డ్రింక్స్.. పడుకునేటప్పుడు తాగితే గుట్టలాంటి పొట్ట మాటష్.. కొన్ని రోజుల్లోనే..

నేటి కాలంలో చాలా మంది స్థూలకాయం సమస్యతో బాధపడుతున్నారు. అధిక బరువును దీన్ని వదిలించుకోవడానికి జిమ్‌లో గంటల తరబడి చెమటోడ్చడం.. డైటింగ్.. ఆహారంలో మార్పులు లాంటివి అవలంభిస్తున్నారు. ఇంకా.. బరువు తగ్గించే ఖరీదైన శస్త్రచికిత్సలు కూడా చేయించుకుంటున్నారు.

కొవ్వును వెన్నలా కరిగించే మ్యాజిక్ డ్రింక్స్.. పడుకునేటప్పుడు తాగితే గుట్టలాంటి పొట్ట మాటష్.. కొన్ని రోజుల్లోనే..
Weight Loss Tips
Shaik Madar Saheb
|

Updated on: Aug 19, 2024 | 7:16 PM

Share

నేటి కాలంలో చాలా మంది స్థూలకాయం సమస్యతో బాధపడుతున్నారు. అధిక బరువును దీన్ని వదిలించుకోవడానికి జిమ్‌లో గంటల తరబడి చెమటోడ్చడం.. డైటింగ్.. ఆహారంలో మార్పులు లాంటివి అవలంభిస్తున్నారు. ఇంకా.. బరువు తగ్గించే ఖరీదైన శస్త్రచికిత్సలు కూడా చేయించుకుంటున్నారు. అయితే, అధిక బరువు విషయంలో అంత టెన్షన్ పడాల్సిన అవసరం లేదని.. ఆయుర్వేద నిపుణులు చెబుతున్నారు. కొన్ని చిట్కాలను పాటించడం ద్వారా బరువును తగ్గించుకోవచ్చని చెబుతున్నారు. బరువు తగ్గడానికి మార్నింగ్ డ్రింక్ ఒక్కటే సరిపోదని.. మీరు తక్కువ సమయంలో బరువు తగ్గాలనుకుంటే, రాత్రి పడుకునే ముందు కొన్ని పానీయాలు తీసుకుంటే చాలా మంచిదని, వేగంగా బరువు తగ్గుతుందని చెబుతున్నారు. రాత్రి నిద్రించే ముందు తాగాల్సిన పానీయాలేంటో ఇప్పుడు తెలుసుకోండి..

నిద్రపోవడానికి ముందు తీసుకోవాల్సిన పానీయాలు..

గ్రీన్ టీ: గ్రీన్ టీలో యాంటీఆక్సిడెంట్లు, కాటెచిన్స్ పుష్కలంగా ఉన్నాయి. ఇవి జీవక్రియను పెంచుతాయి.. ఇంకా కొవ్వును కాల్చే ప్రక్రియను వేగవంతం చేస్తాయి. రాత్రిపూట గ్రీన్ టీ తాగడం వల్ల శరీరంలోని కొవ్వు తగ్గుతుంది.. నిద్ర కూడా మెరుగుపడుతుంది. ఈ పానీయం రాత్రిపూట శక్తిని నియంత్రించడంలో సహాయపడుతుంది.. ఇంకా అకాల ఆకలిని తగ్గిస్తుంది.

వాము నీరు: వాము నీరు కూడా బరువు తగ్గడానికి బాగా పనిచేస్తుంది.. వాము నీటిని తయారు చేయడానికి నీటిలో కొన్ని గంటలపాటు నానబెట్టి ఫిల్టర్ చేయాలి. వీలైతే.. కొంచెం వేడి చేసుకోని తాగండి..వాము నీరు పొట్ట సమస్యల నుంచి ఉపశమనం కలిగించడంతోపాటు జీవక్రియను పెంచుతుంది. రాత్రిపూట జీర్ణక్రియ ప్రక్రియను మెరుగుపర్చి బరువు తగ్గడానికి సహాయపడుతుంది.

వేడి నిమ్మ నీరు: నిమ్మకాయ రసాన్ని వేడి నీళ్లలో కలుపుకుని తాగడం వల్ల శరీరానికి ఎన్నో ప్రయోజనాలు చేకూరుతాయి.. ఇది బరువును తగ్గించడంలో ప్రభావవంతంగా ఉంటుంది. లెమన్ వాటర్‌లో విటమిన్ సి ఉంటుంది.. ఇది శరీరం నుండి విషపూరిత పదార్థాలను తొలగించడంలో సహాయపడుతుంది. ఈ పానీయం ఆర్ద్రీకరణను నిర్వహిస్తుంది.. ఇంకా బరువు తగ్గించే ప్రక్రియను వేగవంతం చేయడంలో సహాయపడుతుంది.

సెలెరీ జ్యూస్: సెలెరీ.. చూడటానికి కొత్తిమీరలా ఉంటుంది. కానీ, దీనిలో ఎన్నో పోషకాలు దాగున్నాయి.. ఇది రాత్రిపూట త్రాగడానికి సులభమైన, అత్యంత ప్రభావవంతమైన పానీయం. సెలెరీలో తక్కువ కేలరీలు, అధిక నీటి కంటెంట్ ఉంటుంది. ఇది శరీరాన్ని హైడ్రేట్ చేస్తుంది.. రాత్రిపూట అనవసరమైన ఆకలిని తగ్గిస్తుంది. ఇది కాకుండా, ఇది నిర్విషీకరణలో కూడా సహాయపడుతుంది.. ఇంకా బరువు తగ్గడానికి దోహదం చేస్తుంది.

(NOTE: ఇంటర్నెట్‌లో సేకరించిన సమాచారం ఆధారంగా ఈ వివరాలు మీకు అందించటం జరిగింది… ప్రయత్నించేముందు సంబంధిత నిపుణుల సలహాలను పాటించవలసిందిగా మనవి..)

మరిన్ని లైఫ్ స్టైల్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..