Sweater: చలికాలం స్వెటర్లు వేసుకుని పడుకుంటున్నారా..? ఈ సమస్యలు తప్పవు..
కొంతమందికి శీతాకాలంలో ఎక్కువ చలిగా అనిపిస్తుంది. ఈ తీవ్రమైన చలి కారణంగా ఎక్కువ మంది పగలు, రాత్రి నిద్రపోతున్నప్పుడు కూడా స్వెటర్లు ధరిస్తారు. కానీ, రాత్రిపూట స్వెటర్ ధరించి పడుకుంటే ఏం జరుగుతుందో మీకు తెలుసా? ఇలా రాత్రి పూట వెచ్చని బట్టలు ధరించి పడుకోవటం సరైనదేనా..? అంటే.. అస్సలు కాదని అంటున్నారు ఆరోగ్య నిపుణులు. రాత్రిపూట స్వెటర్ ధరించి పడుకోవడం వల్ల శరీరంపై తీవ్రమైన ప్రభావం చూపుతుందని హెచ్చరిస్తున్నారు. ? ఆరోగ్య నిపుణులు ఏం చెబుతున్నారో వివరంగా తెలుసుకుందాం..

ఆరోగ్య నిపుణుల అభిప్రాయం ప్రకారం, రాత్రిపూట స్వెటర్ ధరించి పడుకోవడం వల్ల శరీర ఉష్ణోగ్రత పెరుగుతుంది. ఇది విశ్రాంతి లేకపోవడం, చర్మంపై దద్దుర్లు, దురద, రక్త ప్రసరణలో సమస్యలు వంటి అనేక ఇతర ఆరోగ్య సంబంధిత సమస్యలను కలిగిస్తుందని చెబుతున్నారు. రాత్రిపూట స్వెటర్ లేదా ఇతర వెచ్చని దుస్తులతో నిద్రపోవడం శరీరంపై వివిధ ప్రభావాలను చూపుతుంది. వెచ్చని దుస్తులలో పడుకోవడం వల్ల శరీరం వేడెక్కడం జరుగుతుంది. నిద్ర నాణ్యతను మెరుగుపరచడానికి శరీరం సహజంగా నిద్రలో ఉష్ణోగ్రతను తగ్గిస్తుంది. కానీ వెచ్చని దుస్తులను ధరించడం వల్ల ఈ ప్రక్రియకు అంతరాయం కలుగుతుంది. ఇది అసౌకర్యానికి దారితీస్తుంది.
నిద్ర భంగం:
శరీర నిద్రకు అనువైన ఉష్ణోగ్రతను 18°C నుండి 21°C వరకు నిర్వహించడం ముఖ్యం. శరీరం ఎక్కువ వేడెక్కడం వల్ల మీరు అర్ధరాత్రి మేల్కొనడం, తల తిరగడం లేదా చెమటలు పట్టడం వంటివి జరగవచ్చు. ఇది నిద్ర నాణ్యతను దెబ్బతీస్తుంది.
చెమట, నిర్జలీకరణం:
వెచ్చని దుస్తులలో నిద్రపోవడం వల్ల మీకు వేడిగా అనిపించవచ్చు. మీకు వేడిగా అనిపించినప్పుడు, మీ శరీరం చెమటలు పట్టడం ద్వారా తనను తాను చల్లబరచుకోవడానికి ప్రయత్నిస్తుంది. దీని వలన డీహైడ్రేషన్, రాత్రిపూట తరచుగా దాహం వేస్తుంది.
చర్మ సమస్యలు:
రాత్రిపూట స్వెటర్ ధరించి పడుకోవడం వల్ల చెమటలు పట్టవచ్చు. కొంతమందికి చెమట కారణంగా చర్మంపై దద్దుర్లు, దురద లేదా ముడతలు వచ్చే అవకాశం ఉంటుంది.
మరిన్ని లైఫ్‌స్టైల్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.








