Chicken: చికెన్‌ స్కిన్‌తో తింటే మంచిదా, కాదా.? నిపుణులు ఏమంటున్నారంటే..

సహజంగా నాటు కోడ్లను కచ్చితంగా స్కిన్‌తోనే తింటుంటారు. వీటిలో స్కిన్‌ను తొలగిస్తే రుచి తగ్గిపోతుందనే భావన ఉంటుంది. అయితే ఫారమ్‌ కోళ్లను స్కిన్‌తో తీసుకుంటే మంచిదా.? కాదా అనే విషయాన్ని ఇప్పుడు తెలుసుకుందాం. చికెన్‌ను స్కిన్‌తో తీసుకోవడం ఏమాత్రం మంచిది కాదని నిపుణులు చెబుతున్నారు. స్కిన్‌ కూర రుచిని...

Chicken: చికెన్‌ స్కిన్‌తో తింటే మంచిదా, కాదా.? నిపుణులు ఏమంటున్నారంటే..
Chicken
Follow us

|

Updated on: Aug 20, 2024 | 7:24 AM

ఆదివారం వచ్చిందంటే చాలు.. ఇంట్లో కచ్చితంగా చికెన్‌ కర్రీ ఉండాల్సిందే. ఆ మాటకొస్తే ఆదివారంతో పనిలేకుండా చికెన్‌ను లాగించేసే వారు చాలా మంది ఉన్నారు. కేఎఫ్‌సీ పేరుతో, చికెన్‌ 65 ఇలా రకరకాలుగా చికెన్‌ను తీసుకుంటుంటారు. కేవలం రుచికి మాత్రమే పరిమితం కాకుండా, ఆరోగ్యానికి మేలు చేసే గుణాలు ఎన్నో చికెన్‌లో ఉండడంతో వైద్యులు సైతం కొంత మోతాదులో చికెన్‌ను తీసుకోవాలని సూచిస్తుంటారు. అయితే చికెన్‌ను స్కిన్‌తో తినాలా.? వద్దా అనే సందేహం మనలో చాలా మందికి ఉంటుంది.

సహజంగా నాటు కోడ్లను కచ్చితంగా స్కిన్‌తోనే తింటుంటారు. వీటిలో స్కిన్‌ను తొలగిస్తే రుచి తగ్గిపోతుందనే భావన ఉంటుంది. అయితే ఫారమ్‌ కోళ్లను స్కిన్‌తో తీసుకుంటే మంచిదా.? కాదా అనే విషయాన్ని ఇప్పుడు తెలుసుకుందాం. చికెన్‌ను స్కిన్‌తో తీసుకోవడం ఏమాత్రం మంచిది కాదని నిపుణులు చెబుతున్నారు. స్కిన్‌ కూర రుచిని పెంచుతుందనడంలో నిజం ఉన్నా.. ఆరోగ్యంపై మాత్రం ప్రతికూల ప్రభావాన్ని చూపుతుందని వైద్యులు చెబుతున్నారు.

కోడి స్కిన్‌లో హానికరమైన కొవ్వులు అధికంగా ఉంటాయి. అంతేకాకుండా ఇందులో పెద్దగా పోషక విలువలు కూడా ఉండవు. కోళ్లు చూడ్డానికి ఆకర్షణీయంగా కనిపించేందుకు దుకాణదారులు కోడి స్కిన్‌పై రసాయనాలు చల్లుతుంటారు. ఇది కూడా ఆరోగ్యంపై ప్రతికూల ప్రభావం చూపుతుందని నిపునులు అంటున్నారు. చికెన్‌ను స్కిన్‌తో తీసుకోవడం వల్ల శరీరంలో అనారోగ్యకరమైన కొవ్వులు పెరిగే అవకాశం ఉంటుంది. దీంతో బరువు పెరిగే అవకాశం ఉంటుంది. స్కిన్‌తో చికెన్‌ను తీసుకోవడం వల్ల రక్తపోటు, మధుమేహం, గుండె జబ్బులు వంటి సమస్యలు వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది.

అందుకే గుండె సంబంధిత సమస్యలతో బాధపడేవారిని చికెన్ తక్కువగా తినాలని, స్కిన్‌ను అసలే తీసుకోవద్దని చెబుతుంటారు. పలు పరిశోధనల్లో కూడా చికెన్‌ స్కిన్‌ మంచిది కాదని తేలింది. అయితే చికెన్‌ స్కిన్‌తో తినాలని కోరిక ఉన్న వారు మాత్రం కొన్ని జాగ్రత్తలు తీసుకుంటే నష్టం ఉండదని నిపుణులు చెబుతున్నారు. ముఖ్యంగా చికెన్‌ వండడం కంటే ముందు ఉప్పు, పసుపు వేసి రెండు మూడు సార్లు కడిగిన తర్వాత వండుకోవడం బెటర్‌. అయితే హృదయ సంబంధిత సమస్యలతో బాధపడేవారు స్కిన్‌ను దూరంగా ఉండడమే బెటర్‌.

ఏది మంచిది.?

మనలో చాలా మంది లెగ్‌ పీస్‌లను ఇష్టంగా తీసుకుంటారు. అయితే చికెన్‌లో బ్రెస్ట్‌ మీట్‌ ఆరోగ్యానికి మంచిదని నిపుణులు చెబుతున్నారు. ఇందులో కొవ్వు తక్కువగా, ప్రోటీన్స్‌ ఎక్కువగా ఉంటాయి. బరువును నియంత్రించడంలో కూడా సహాయపడుతుంది. కండరాల బలోపేతానికి బ్రెస్ట్ మీట్ ఉపయోగపడుతుంది. లెగ్‌ పీస్‌లలో కొవ్వు ఎక్కువగా ఉంటుంది. చికెన్‌ వింగ్స్‌లో కూడా కొవ్వు ఎక్కువగా ఉంటుందని నిపుణులు చెబుతున్నారు.

మరిన్ని లైఫ్ స్టైల్ వార్తల కోసం క్లిక్ చేయండి…

చికెన్‌ స్కిన్‌తో తింటే మంచిదా, కాదా.? నిపుణులు ఏమంటున్నారంటే..
చికెన్‌ స్కిన్‌తో తింటే మంచిదా, కాదా.? నిపుణులు ఏమంటున్నారంటే..
ప్రశాంతంగా ముగిసిన అమర్‌నాథ్ యాత్ర.. 5లక్షలకు పైగా భక్తులు హాజరు
ప్రశాంతంగా ముగిసిన అమర్‌నాథ్ యాత్ర.. 5లక్షలకు పైగా భక్తులు హాజరు
చరిత్ర మరవని ఘటన ఆధారంగా వెబ్‌ సిరీస్‌.. ఆక్టట్టుకుంటోన్న ట్రైలర్
చరిత్ర మరవని ఘటన ఆధారంగా వెబ్‌ సిరీస్‌.. ఆక్టట్టుకుంటోన్న ట్రైలర్
సీఎం స్టాలిన్‌ లేఖపై మంత్రి అశ్విని వైష్ణవ్ దిమ్మతిరిగే రియాక్షన్
సీఎం స్టాలిన్‌ లేఖపై మంత్రి అశ్విని వైష్ణవ్ దిమ్మతిరిగే రియాక్షన్
సీఎం రేవంత్‌రెడ్డికి ప్రభాస్ పెద్దమ్మ సర్‌ప్రైజ్ గిఫ్ట్‌..
సీఎం రేవంత్‌రెడ్డికి ప్రభాస్ పెద్దమ్మ సర్‌ప్రైజ్ గిఫ్ట్‌..
హైదరాబాద్ సహా రాష్ట్రంలో పలు ప్రాంతాల్లో దంచి కొడుతున్న వానలు..
హైదరాబాద్ సహా రాష్ట్రంలో పలు ప్రాంతాల్లో దంచి కొడుతున్న వానలు..
నెలల చిన్నారిని చిదిమేసిన నిర్లక్ష్యం.. ప్రమాదమని నాటకాలు
నెలల చిన్నారిని చిదిమేసిన నిర్లక్ష్యం.. ప్రమాదమని నాటకాలు
బంగారం కొనే ప్లాన్‌లో ఉన్నారా.? తులం గోల్డ్‌ ఎంతుందో తెలుసా.?
బంగారం కొనే ప్లాన్‌లో ఉన్నారా.? తులం గోల్డ్‌ ఎంతుందో తెలుసా.?
Horoscope Today: ఆ రాశుల వారికి ఆకస్మిక ధన లాభానికి అవకాశం..
Horoscope Today: ఆ రాశుల వారికి ఆకస్మిక ధన లాభానికి అవకాశం..
ఆ శుభలేఖను చూసి ఆశ్చర్యపోతున్న బంధుమిత్రులు.. అంత స్పెషల్ ఏంటంటే.
ఆ శుభలేఖను చూసి ఆశ్చర్యపోతున్న బంధుమిత్రులు.. అంత స్పెషల్ ఏంటంటే.