Lifestyle: ఈ నాలుగు అలవాట్లతో వందేళ్లు బతకాడం ఖాయం.. అవేంటంటే..

ప్రపంచవ్యాప్తంగా వందేళ్లకు పైగా జీవిస్తున్న వారికి సంబంధించి అధ్యయనం చేపట్టిన పరిశోధకులు ఆ వివరాలను.. జిరో సైన్స్‌ అనే జర్నల్‌లో ప్రచురించారు. మంచి ఆహారంతో పాటు, బరువు నియంత్రణలో ఉంచుకోవడం వల్ల వృద్ధాప్యాన్ని జయించవచ్చని పరిశోధనలు చెబుతున్నాయి. జన్యుపరమైన కారకాలు ఆయుష్షుపై ప్రభావం చూపుతాయని నిపుణులు గుర్తించారు....

Lifestyle: ఈ నాలుగు అలవాట్లతో వందేళ్లు బతకాడం ఖాయం.. అవేంటంటే..
Lifestyle
Follow us

|

Updated on: Aug 20, 2024 | 8:25 AM

‘వందేళ్లు సంతోషంగా జీవించు’.. ఆశీర్వాదం తీసుకునే సమయంలో పెద్దలు సాధారణంగా ఇచ్చే ఆశీర్వాదం ఇదే. అయితే వందేళ్లు జీవించడం అనేది అంత సులభమైన విషయం కాదు. వెయ్యి మందిలో ఒక్కరు కూడా వందేళ్లు జీవించని పరిస్థితి ఉంది. మారుతోన్న జీవన విధానం, తీసుకుంటున్న ఆహారంలో మార్పుల కారణంగా వందేళ్లు బతకడం అనేది ఇప్పుడు ఒక వింతగా మారింది. అయితే జీవన విధానంలో చేసుకునే కొన్ని మార్పుల ద్వారా వందేళ్లు బతకడం పెద్ద కష్టమేమి కాదని నిపుణులు చెబుతున్నారు.

ప్రపంచవ్యాప్తంగా వందేళ్లకు పైగా జీవిస్తున్న వారికి సంబంధించి అధ్యయనం చేపట్టిన పరిశోధకులు ఆ వివరాలను.. జిరో సైన్స్‌ అనే జర్నల్‌లో ప్రచురించారు. మంచి ఆహారంతో పాటు, బరువు నియంత్రణలో ఉంచుకోవడం వల్ల వృద్ధాప్యాన్ని జయించవచ్చని పరిశోధనలు చెబుతున్నాయి. జన్యుపరమైన కారకాలు ఆయుష్షుపై ప్రభావం చూపుతాయని నిపుణులు గుర్తించారు. ఎక్కువ కాలం జీవించిన వారిలో కామన్‌గా కనిపించే నాలుగు అలవాట్ల గురించి పరిశోధకులు వివరించారు. ఆ నాలుగు అలవాట్లు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం..

* మంచి ఆరోగ్యంలో తీసుకునే ఆహారం కీలక పాత్ర పోషిస్తుందని ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఉప్పు తక్కువగా తీసుకోవడం వల్ల జీవన నాణ్యత పెరుగుతుందని చెబుతున్నారు. త్వరగా వృద్ధాప్యం రావడానికి ప్రధాన కారణాల్లో ఉప్పు ఎక్కువగా తీసుకోవడం కూడా ఒక కారణమని నిపుణులు చెబుతున్నారు. ఇక స్మోకింగ్ అకాల మరణానికి ఒక కారణమని నిపుణులు అంటున్నారు.

* ఎక్కువ కాలం జీవించాలనుకునే వారు నిద్రలేమి సమస్య నుంచి బయటపడాలని నిపుణులు చెబుతున్నారు. నిద్రలేమి సమస్యతో బాధపడేవారిలో త్వరగా వృద్ధాప్య ఛాయలు వచ్చే అవకాశం ఉంటుందని నిపుణులు చెబుతున్నారు. రోజులో కనీసం 8 నుంచి 9 గంటల నాణ్యమైన నిద్ర ఉంటేనే ఆరోగ్యంగా ఉంటారని చెబుతున్నారు.

* ఒంటి నొప్పులకు, జలుబుకు ఇలా ఏ చిన్న సమస్య వచ్చినా వెంటనే మందులు వేసుకునే వారిలో కూడా వృద్ధాప్య లక్షణాలు త్వరగా వచ్చే అవకాశం ఉంటుందని అంటున్నారు. వీలైనంత వరకు తక్కువ మందులు తీసుకోవాలని నిఉపణులు చెబుతున్నారు. మందుల వాడకం తగ్గిస్తే శరీరంలో సహజంగా రోగ నిరోధక శక్తి పెరుగుతుంది. ఇది ఎక్కువ కాలం జీవించడానికి దోహదపడుతుంది.

* పట్టణ ప్రాంతాల్లో జీవన విధానంతో పోల్చితే, గ్రామీణ జీవనశైలి ఎక్కువ కాలం జీవించడానికి ఉపయోగపడుతుందని నిపుణులు చెబుతున్నారు. గ్రామీణ జీవన విధానం దీర్ఘాయువుకు గణనీయంగా దోహదపడుతుందని పరిశోధనల్లో తేలింది. వాకింగ్ చేయడం, ఎక్కువ సమయం ప్రకృతిలో గడపడం వల్ల కూడా ఆయుష్షు పెరిగే అవకాశాలు ఎక్కువగా ఉంటాయని పరిశోధనల్లో తేలింది.

మరిన్ని లైఫ్ స్టైల్ వార్తల కోసం క్లిక్ చేయండి..