భారత్‌లో ప్రతీ ఏటా రొమ్ము క్యాన్సర్ బాధితుల సంఖ్య క్రమంగా పెరుగుతోంది. దీంతో ఇప్పుడీ అంశం తీవ్ర ఆందోళనకు దారి తీస్తోంది.
ఒకప్పుడు 50 ఏళ్లు పైబడిన వారిలో మాత్రమే కనిపించే ఈ సమస్య ఇప్పుడు తక్కువ వయసులో ఉన్నవారిని కూడా వేధిస్తుంది. ముఖ్యంగా 28 నుంచి 35 ఏళ్ల మధ్య వారిలో బ్రెస్ట్ క్యాన్సర్ కేసులు పెరుగుతున్నాయి.
తీసుకునే ఆహారంలో మార్పులు, అస్తవ్యస్తమైన జీవన శైలి కారణంగా చాలా మంది బ్రెస్ట్ క్యాన్సర్ ప్రమాదం పెరుగుతోందని నిపుణులు చెబుతున్నారు. పన్యూపరమైన కారణాలు కూడా బ్రెస్ట్ క్యాన్సర్‌కు దారి తీస్తున్నాయని అంటున్నారు.
అయితే తాజాగా నిర్వహించి పరిశోధనల్లో పలు ఆసక్తికరమైన విషయాలు వెలుగులోకి వచ్చాయి. ఊబకాయంతో బాధపడే మహిళల్లో బ్రెస్ట్ క్యాన్సర్ వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నట్లు తేలింది.
ప్రముఖ క్యాన్సర్ సర్జన్ డాక్టర్ అన్షుమన్ కుమార్ ఈ విషయమై మాట్లాడుతూ.. ఊబకాయం పెరగడం వల్ల క్యాన్సర్ వచ్చే ప్రమాదం ఉంటుందని చెబుతున్నారు
ఇక 30 ఏళ్లు తర్వాత ప్రతీ మహిళ క్యాన్సర్ స్క్రీన్ చేయించుకోవడం మంచిదని నిపుణులు సూచిస్తున్నారు. దీనివల్ల క్యాన్సర్‌ను ముందుగానే గుర్గించే అవకాశం లభిస్తుందని చెబుతున్నారు.
బరువును అదుపులో పెట్టుకోవడం ఫైబర్ కంటెంట్ ఎక్కువగా ఉండే ఆహారాన్ని తీసుకోవాలని నిపుణులు చెబుతున్నారు. అలాగే వాకింగ్, వర్కవుట్స్ వంటివి కచ్చితంగా అలవాటు చేసుకోవాలి.
పైన తెలిపిన విషయాలు కేవలం ప్రాథమిక సమాచారం మేరకు మాత్రమే. ఆరోగ్యానికి సంబంధించి వైద్యుల సూచనలు పాటించడమే ఉత్తమం.