AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Vakkaya: వాక్కాయ ప్రయోజనాలు తెలిస్తే అస్సలు వదలరు..

Vakkaya: వాక్కాయ ప్రయోజనాలు తెలిస్తే అస్సలు వదలరు..

Phani CH
|

Updated on: Aug 19, 2024 | 6:49 PM

Share

పాన్ షాపుల్లో స్వీట్​ పాన్‌కి టూత్ పిక్.. దానికి ఓ ఎర్రని పండును గుచ్చి ఉండడం మనం చూసే ఉంటాం. తియ్యని రుచి కలిగిన ఆ పండ్లు చెర్రీస్​ అని అనుకుంటారు చాలా మంది. కానీ అవి వాక్కాయలు అనే విషయం ఎవ్వరికీ తెలియదు. ఈ పండ్లను ఎండబెట్టి టూటీ ఫ్రూటీగా తయారు చేయడంతో పాటు కేకులు, సలాడ్ల అలంకరణలో ఉపయోగిస్తారు.

పాన్ షాపుల్లో స్వీట్​ పాన్‌కి టూత్ పిక్.. దానికి ఓ ఎర్రని పండును గుచ్చి ఉండడం మనం చూసే ఉంటాం. తియ్యని రుచి కలిగిన ఆ పండ్లు చెర్రీస్​ అని అనుకుంటారు చాలా మంది. కానీ అవి వాక్కాయలు అనే విషయం ఎవ్వరికీ తెలియదు. ఈ పండ్లను ఎండబెట్టి టూటీ ఫ్రూటీగా తయారు చేయడంతో పాటు కేకులు, సలాడ్ల అలంకరణలో ఉపయోగిస్తారు. పిల్లలు మొదలుకుని పెద్దల వరకూ ప్రతి ఒక్కరూ ఇష్టపడే ఈ పదార్థాలన్నింటినీ చేసేది సహజసిద్ధంగా దొరికే కలిమె పండ్లతోనే. వాక్కాయలనే కొన్ని ప్రాంతాల్లో కరిమె పండ్లు అని కూడా పిలుస్తారు. వాక్కాయలు విటమిన్‌ బి, సి, ఐరన్‌ రోగనిరోధకశక్తిని పెంచడంలో కీలకపాత్ర పోషిస్తాయి. పీచు పదార్థం కడుపు ఉబ్బరాన్ని అడ్డుకుని అజీర్తి సమస్యకు ఔషధంలా ఉపయోగపడుతుంది. ఈ పండ్లలోని పెక్టిన్‌ అనే కార్బోహైడ్రేట్‌ జీర్ణవ్యవస్థను మెరుగు పరిచి ఆకలిని పెంచుతుంది. విటమిన్స్‌తో పాటు ట్రిప్ట్టొఫాన్‌ అనే అమైనో యాసిడ్‌ సెరటోనిన్‌ను ఉత్పత్తి చేయడం వల్ల అవి ఒత్తిడిని తగ్గించి మెదడును చురుగ్గా ఉంచుతాయి. ఇంకా వీటిలోని పోషకాలు కాలేయాన్ని, రక్తాన్ని శుద్ధి చేయడంతో పాటు శరీరంలో కొవ్వు నిల్వలు పేరుకుపోకుండా సహకరిస్తాయి.

మరిన్ని  వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

గజం భూమి ధర రూ.10 లక్షలు !! హైదరాబాద్​లో భూమి ధర అక్కడే ఎక్కువ

రాజీవ్‌గాంధీ vs తెలంగాణ తల్లి.. రగులుతున్న విగ్రహ రాజకీయం

మళ్లీ చెడ్డీ గ్యాంగ్ వస్తోంది.. మీ ఇళ్లు జాగ్రత్త !!

Explainer: టాలివుడ్ చేసిన నేరమేంటి ?? అసలు ఎందుకు ఇలా జరిగిందంటే ??

iSmart News: రుణమాఫీ కాలేదని సెల్ టవరెక్కాడు !!