20 August 2024
TV9 Telugu
Pic credit - Pexels
కాకరకాయ ఆరోగ్యానికి నిధి. దీన్ని తింటే ఆరోగ్యానికి ఎంతో మేలు జరుగుతుంది. కాకరకాయ చేదుగా ఉన్నప్పటికీ.. ఇది ఔషధంలా పనిచేస్తుంది.
కాకరకాయను తినడం వల్ల మలబద్ధకం, అజీర్ణం, ఎసిడిటీ సమస్యలు రావు. మధుమేహ వ్యాధిగ్రస్తులకు కూడా ఇది చాలా ఉపయోగకరంగా ఉంటుంది.
అయితే ఆరోగ్యాన్ని ఇచ్చే కాకర కాయను తిన్న తర్వాత పొరపాటున కూడా కొన్ని పదార్థాలు తినకూడదని మీకు తెలుసా..
కాకర కాయను తిన్న తర్వాత ఎప్పుడూ పాలు తాగకూడదు. దీని కారణంగా కడుపు ఆరోగ్యం క్షీణించవచ్చు. మలబద్ధకం, నొప్పి, కడుపులో మంట వంటి సమస్యలు ఏర్పడవచ్చు.
పెరుగు, మజ్జిగలో లాక్టిక్ యాసిడ్ బ్యాక్టీరియా ఉంటుంది. కనుక కాకర కాయను తిన్న తర్వాత కాకర కాయను తింటే చర్మంపై దద్దుర్లు, దురదలు రావచ్చు.
ముల్లంగిని కాకర కాయ ఆహారంతో కలిపి తినడం కూడా హానికరం. రెండింటి విభిన్న స్వభావం కారణంగా కడుపులో ప్రతిచర్య జరగవచ్చు.
కాకర కాయను తిన్న తర్వాత పొరపాటున కూడా మిడికాయ తినకూడదు. దీని వల్ల వాంతులు, మంట, వికారం, ఎసిడిటీ వంటివి ఇబ్బందులను ఎదుర్కోవాల్సి ఉంటుంది.