AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

గుంటూరు పెద్దాసుపత్రిలో ఆకస్మిక తనిఖీలు.. కనిపించిన సీన్ చూసి సూపరింటెండెంట్ షాక్!

ట్రైనీ వైద్యురాలిపై అత్యాచారం, ఆపై హత్యతో దేశ వ్యాప్తంగా నిరసనలు మిన్నంటాయి. పనివేళల్లో వైద్యులకు రక్షణ లేకుండా పోయిందని పెద్ద ఎత్తున విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఈ క్రమంలోనే గుంటూరు జనరల్ ఆసుపత్రిలో అర్దరాత్రి సమయంలో ఏం జరుగుతుందో తెలుసుకునేందుకు సూపరింటెండెంట్ ఆకస్మీక తనిఖీలు చేపట్టారు.

గుంటూరు పెద్దాసుపత్రిలో ఆకస్మిక తనిఖీలు.. కనిపించిన సీన్ చూసి సూపరింటెండెంట్ షాక్!
Ggh Superintendent Kiran
T Nagaraju
| Edited By: |

Updated on: Aug 20, 2024 | 1:10 PM

Share

ట్రైనీ వైద్యురాలిపై అత్యాచారం, ఆపై హత్యతో దేశ వ్యాప్తంగా నిరసనలు మిన్నంటాయి. పనివేళల్లో వైద్యులకు రక్షణ లేకుండా పోయిందని పెద్ద ఎత్తున విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఈ క్రమంలోనే గుంటూరు జనరల్ ఆసుపత్రిలో అర్దరాత్రి సమయంలో ఏం జరుగుతుందో తెలుసుకునేందుకు సూపరింటెండెంట్ ఆకస్మీక తనిఖీలు చేపట్టారు. ఈ తనిఖీల్లో విస్తుపోయే నిజాలు వెలుగు చూశాయి.

రోగులకు సంబంధం లేని వ్యక్తులు ఆసుపత్రి ప్రాంగణంలో అనేకమంది ఉన్నట్లు గుర్తించారు. వీరు పూర్తిగా మద్యం మత్తులో ఉన్నట్లు కనుగొన్నారు. అసలు రోగులతో సంబంధం లేని వ్యక్తులు హాస్పిటల్‌లోకి ఎందుకు వచ్చారో ఆరా తీయాలంటూ సెక్యూరిటీ సిబ్బందిని ఆదేశించారు. జీజీహెచ్ పక్కనే గుంటూరు రైల్వే స్టేషన్ ఉండటంతో ఆక్కడ సంచరించే బిచ్చగాళ్లు, అనాథలు కూడా రాత్రి వేళల్లో మద్యం సేవించి జీజీహెచ్ ప్రాంగణంలోకి వస్తున్నట్లు తెలిసింది. దీంతో సూపరింటెండెంట్ సెక్యూరిటీ సిబ్బందికి తక్షణమే వారందరిని బటయకు పంపాలంటూ ఆదేశాలు జారీ చేశారు.

రోగులకు సంబంధించి ఒకరిద్దరూ మించి సహాయకులు ఉన్నట్లుగా సూపరింటెండెంట్ తనిఖీల్లో బయటపడింది. దీంతో వారందరికీ అవగాహన కల్పించి అక్కడ నుండి పంపించి వేశారు. రోగి సహాయకులు ఎక్కువ మంది ఉండటంతో వైద్యుల సేవలకు అంతరాయం కలుగుతున్న విషయాన్ని వారికి తెలిసేలా చెప్పాలంటూ సూపరింటెండెంట్ కిరణ్ సిబ్బందికి చెప్పారు. వైద్యులకు తగిన విధంగా రక్షణ కల్పించాల్సిన బాధ్యత ఉందని దీంతో రాత్రి వేళలో ఏం జరుగుతుందో తెలుసుకునేందుకు ఆకస్మిక తనిఖీలు చేసినట్లు ఆయన తెలిపారు.

ఈ క్రమంలో మందుబాబులకు జీజీహెచ్ అనుమతి లేదంటూ తేల్చి చెప్పారు. మద్యం సేవించినట్లు అనుమానం వెంటనే వెంటనే వారిని ఆసుపత్రి నుండి బయటకు పంపించేయాలంటూ సెక్యూరిటీ సిబ్బందిని ఆదేశించారు. ఇక ముందు పగటి సమయాల్లో కూడా మద్యం సేవించి వచ్చే వారికి కౌన్సిలింగ్ ఇచ్చి అక్కడ నుండి పంపించి వేయాలన్నారు.

మొత్తం మీద రాత్రి సమయాల్లో విధుల్లో ఉన్న వైద్యులకు రక్షణ కల్పించేందుకు ఆసుపత్రి సూపరింటెండెంట్‌కు పూర్తి సహకారం అందిస్తామని ఎస్పీ సతీష్ కుమార్ కూడా తెలిపారు. దీంతో ఇక ముందు జీజీహెచ్‌లో మందుబాబులకు నో ఎంట్రీ అంటూ సిబ్బంది చెబుతున్నారు.

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.. 

Follow Us
అటు అందం.. ఇటు ఆరోగ్యం.. కోడి కాళ్లలో అద్భుతమైన రహస్యం ఇదే
అటు అందం.. ఇటు ఆరోగ్యం.. కోడి కాళ్లలో అద్భుతమైన రహస్యం ఇదే
కర్రీలో కారం ఎక్కువైందా?.. ఈ చిన్న చిట్కాతో క్షణాల్లో తగ్గించండి
కర్రీలో కారం ఎక్కువైందా?.. ఈ చిన్న చిట్కాతో క్షణాల్లో తగ్గించండి
సరిహద్దులు దాటిన అభిమానం.. బుడ్డోడి పై ప్రశంసల వర్షం
సరిహద్దులు దాటిన అభిమానం.. బుడ్డోడి పై ప్రశంసల వర్షం
ఆధార్ యాప్‌లో కొత్త ఫీచర్.. క్యూఆర్ కోడ్ ద్వారానే..
ఆధార్ యాప్‌లో కొత్త ఫీచర్.. క్యూఆర్ కోడ్ ద్వారానే..
నాలుగు గ్రహాల అనుకూలత.. ప్రేమ, పెళ్లి ప్రయత్నాలకు గోల్డెన్ టైమ్..
నాలుగు గ్రహాల అనుకూలత.. ప్రేమ, పెళ్లి ప్రయత్నాలకు గోల్డెన్ టైమ్..
మీ ఇంట్లో మనీ ప్లాంట్ ఉందా..? ఈ తప్పులు చేయొద్దు..
మీ ఇంట్లో మనీ ప్లాంట్ ఉందా..? ఈ తప్పులు చేయొద్దు..
ప్రయాణికులకు గుడ్‌న్యూస్..ఇకపై రెగ్యులర్ సేవల్లోకి స్పెషల్ ట్రైన్
ప్రయాణికులకు గుడ్‌న్యూస్..ఇకపై రెగ్యులర్ సేవల్లోకి స్పెషల్ ట్రైన్
1925లో పుట్టి, 1925లోనే చనిపోయాడు.. కానీ 70ఏళ్లు బతికాడు! ఎలా..?
1925లో పుట్టి, 1925లోనే చనిపోయాడు.. కానీ 70ఏళ్లు బతికాడు! ఎలా..?
వైభవ్‎తో పాటు బ్లూ జెర్సీ వేసుకోబోయే నలుగురు ఐపీఎల్ హీరోలు వీళ్లే
వైభవ్‎తో పాటు బ్లూ జెర్సీ వేసుకోబోయే నలుగురు ఐపీఎల్ హీరోలు వీళ్లే
ఉసిరికాయ తొక్కు.. రోజుకొక స్పూన్ తింటే లో బీపీ, నీరసం పరార్
ఉసిరికాయ తొక్కు.. రోజుకొక స్పూన్ తింటే లో బీపీ, నీరసం పరార్