AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ఒక్క 400 రూపాయలతో అన్నీ సెట్టు.. ఏపీ, తెలంగాణలో జియో కొత్త ప్లాన్‌ ప్రారంభం

నెలకు కేవలం రూ.400తో హై-స్పీడ్ వైఫై, 1,000కు పైగా లైవ్ టీవీ ఛానెల్స్, 12కు పైగా OTT యాప్‌లు అందించే కొత్త జియో హోమ్ ప్లాన్‌లు వచ్చేశాయి. టీవీ ఓన్లీ, వైఫై+టీవీ, వైఫై ఓన్లీ ప్లాన్‌ల ధరలు, ప్రయోజనాలు, ప్రీపెయిడ్ ఆఫర్లు ఏంటో ఈ వీడియోలో తెలుసుకోండి.

ఒక్క 400 రూపాయలతో అన్నీ సెట్టు.. ఏపీ, తెలంగాణలో జియో కొత్త ప్లాన్‌ ప్రారంభం
Jio News Offer
SN Pasha
|

Updated on: Aug 03, 2026 | 6:45 PM

Share

రిలయన్స్ జియో తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో కొత్త జియో హోమ్ బ్రాడ్‌బ్యాండ్, హోమ్ ఎంటర్‌టైన్‌మెంట్ ప్లాన్‌లను ప్రారంభించింది. నెలకు కేవలం రూ.400 ప్రారంభ ధరతో హై-స్పీడ్ వైఫై, 1,000కు పైగా లైవ్ టీవీ ఛానెల్‌లు, ప్రముఖ OTT ప్లాట్‌ఫారమ్‌లను ఒకే ప్యాకేజీలో అందుబాటులోకి తీసుకొచ్చింది. దీంతో వినియోగదారులు బ్రాడ్‌బ్యాండ్, టెలివిజన్, స్ట్రీమింగ్ సేవలను ఒకే కనెక్షన్‌తో ఉపయోగించుకునే అవకాశం కల్పించింది.

టీవీ, వైఫై, OTT అన్నీ ఒకే ప్యాకేజీలో

జియో ప్రకటించిన కొత్త ప్లాన్‌లు వివిధ అవసరాలకు అనుగుణంగా రూపొందించబడ్డాయి. ఎంచుకున్న ప్లాన్‌ను బట్టి వినియోగదారులు అన్‌లిమిటెడ్ హై-స్పీడ్ వైఫై, 1,000కు పైగా లైవ్ టీవీ ఛానెల్‌లు, 200కు పైగా HD ఛానెల్‌లు, అలాగే ఆహా, జియో హాట్‌స్టార్, జీ5, సోనీ లివ్ సహా 12కు పైగా ప్రముఖ OTT ప్లాట్‌ఫారమ్‌ల యాక్సెస్ పొందవచ్చు. అంతేకాకుండా టీవీలో యూట్యూబ్, లైవ్ టీవీని ప్లే, పాజ్, రివైండ్ చేసే సదుపాయాలు కూడా అందుబాటులో ఉంటాయి.

మూడు రకాల ప్లాన్‌లు

జియో మూడు విభాగాల్లో ప్లాన్‌లను అందిస్తోంది. టీవీ ఓన్లీ ప్యాక్ నెలకు రూ.400తో లభించనుండగా, ఇందులో 1,000కు పైగా లైవ్ టీవీ ఛానెల్‌లు, 12కు పైగా OTT యాప్‌లు ఉంటాయి. ఇప్పటికే బ్రాడ్‌బ్యాండ్ కనెక్షన్ ఉన్న వినియోగదారులకు ఇది అనువుగా ఉంటుంది. వైఫై + టీవీ + OTT ప్యాక్‌లలో 30 Mbps ప్లాన్ నెలకు రూ.555, 100 Mbps ప్లాన్ రూ.707గా నిర్ణయించింది. ఈ ప్లాన్‌లతో హై-స్పీడ్ ఇంటర్నెట్‌తో పాటు టీవీ, OTT సేవలు కూడా లభిస్తాయి. వైఫై ఓన్లీ ప్యాక్‌లలో 30 Mbps ప్లాన్ రూ.450, 100 Mbps ప్లాన్ రూ.600గా అందుబాటులోకి తీసుకొచ్చింది. ఇప్పటికే కేబుల్ లేదా DTH సేవలు ఉన్నవారు కేవలం బ్రాడ్‌బ్యాండ్ కోసం ఈ ప్లాన్‌లను ఎంచుకోవచ్చు.

ఫైబర్ నెట్‌వర్క్‌తో అంతరాయం లేని సేవలు

జియో తన ఫైబర్ నెట్‌వర్క్ ద్వారా టెలివిజన్ సేవలను అందిస్తున్నట్లు తెలిపింది. వర్షాలు లేదా ప్రతికూల వాతావరణ పరిస్థితుల్లో కూడా DTH సేవల మాదిరిగా అంతరాయం లేకుండా టీవీ వీక్షణ అనుభవం లభిస్తుందని కంపెనీ పేర్కొంది. ఉచిత ఇన్‌స్టాలేషన్, మెయింటెనెన్స్‌తో పాటు ప్రీపెయిడ్ వినియోగదారులకు ప్రత్యేక ఆఫర్లు కూడా ప్రకటించింది. ఈ కొత్త ప్లాన్‌లతో ఒకే బిల్లులో ఇంటర్నెట్, లైవ్ టీవీ, OTT సేవలను పొందాలనుకునే కుటుంబాలకు జియో మరింత ఆకర్షణీయమైన ఎంపికగా మారుతుందని మార్కెట్ వర్గాలు అభిప్రాయపడుతున్నాయి.

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Follow Us