పంట పొలాల్లో పరుగులు తీసిన చేపలు.. పట్టుకునేందుకు ఎగబడ్డ జనం!
సాధారణంగా వర్షాలు వచ్చాయంటే చెరువులు కుంటలు నిండుతాయి. కొత్త నీరు రావడంతో చెరువులు, కుంటల్లోని చేపలు ఎదురు వెళ్తుంటాయి. రెండు మూడు రోజులుగా కురుస్తున్న వర్షాలకు.. ఎదురు వస్తున్న చెరువులోని చేపలను జనం ఎగబడి పట్టుకుంటున్నారు.
సాధారణంగా వర్షాలు వచ్చాయంటే చెరువులు కుంటలు నిండుతాయి. కొత్త నీరు రావడంతో చెరువులు, కుంటల్లోని చేపలు ఎదురు వెళ్తుంటాయి. రెండు మూడు రోజులుగా కురుస్తున్న వర్షాలకు.. ఎదురు వస్తున్న చెరువులోని చేపలను జనం ఎగబడి పట్టుకుంటున్నారు. అటుగా వెళ్లే వాహనదారులతోపాటు సమీప గ్రామాల ప్రజలు కూడా వరదకు కొట్టుకు వస్తున్న చేపలను పట్టుకుని ఇంటికి తీసుకెళ్తున్నారు. దీంతో పరిసర ప్రాంతాల వద్ద మత్స్యకారుల హడావిడి కనబడుతుంది.
రెండు రోజులుగా కురుస్తున్న వర్షాలకు యాదాద్రి జిల్లాలో చెరువులు, కుంటలు, వాగులు, వంకలు పొంగిపొర్లుతున్నాయి. దీంతో ఏ రోడ్డు చూసినా వరద కనబడుతుంది. వరద ప్రవాహనికి చేపలు కొట్టుకు వస్తున్నాయి. భువనగిరి మండలం మసుకుంట వద్ద మత్స్య కార్మికులు సందడి చేస్తున్నారు. గ్రామ సమీపంలోని వాగు నుంచి వస్తున్న వరదకు భారీ సైజులోని చేపలు కొట్టుకొస్తున్నాయి. వలల ద్వారా చేపలు పడుతున్నారు. చేపలను తీసుకెళ్లడానికి ప్రత్యేకంగా ఆటోలను తెచ్చుకున్నారు. అటుగా వెళుతున్న వాహనదారులు కూడా ఆగి ఎగబడుతున్న జనాన్ని చూసి.. వాళ్లు కూడా చేపలు తీసుకొని వెళ్తున్నారు.
వీడియో చూడండి…
ఈ చేపల్లో రవ్వు, బొచ్చ, జెల్లలు, బంగారు, తీగ వివిధ రకాల చేపలను మత్స్య కార్మికులు పట్టారు. చేపలు పట్టడం చూడటానికి చుట్టుపక్కల ప్రజలు భారీగా తరలి వచ్చారు. భారీ చేపలు, చేప పిల్లలను చేతిలో పట్టుకొని చాలామంది సెల్ఫీలు దిగారు. ఈ వరదలో కొట్టుకు వచ్చిన చేపల్ని తీసుకెళ్లడానికి వ్యాపారస్తులు నేరుగా చేపలు పట్టే ప్రాంతానికి వెళ్తున్నారు. ఇక ఇప్పుడు ప్రతి ఇంట్లో చేపల రుచిని ఎంజాయ్ చేయనున్నారు. దీంతో భువనగిరి సమీప ప్రాంతాల్లో భారీ వర్షానికి వరద ప్రవాహంతో పాటు చేపల ప్రవాహం కనబడుతోంది.
మరిన్ని హ్యుమన్ ఇంట్రెస్ట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..