Kishan Reddy: సోదరుడు మిట్టపల్లి పోస్ట్ బాధ కలిగిస్తుంది.. కేంద్రమంత్రి కిషన్ రెడ్డి కీలక ట్వీట్..

ప్రధానమంత్రి నరేంద్ర మోదీని సాంప్రదాయ డప్పు నృత్యాలతో కేంద్రమంత్రి కిషన్ రెడ్డి, మెగాస్టార్ చిరంజీవి ఆహ్వానించారు. ఈ సమయంలో ప్రధాని మోదీ.. డప్పు కొడుతున్న వ్యక్తిని ఆప్యాయంగా పలకరించి.. అతని చేతిని పట్టుకుని నుదిటికి తాకారు.. అయితే.. దీనికి సంబంధించిన వీడియో, ఫొటో నెట్టింట వైరల్ అయింది.. ఈ ఫొటోను తెలంగాణ గేయ రచయిత మిట్టపల్లి సురేందర్ షేర్ చేశారు.

Kishan Reddy: సోదరుడు మిట్టపల్లి పోస్ట్ బాధ కలిగిస్తుంది.. కేంద్రమంత్రి కిషన్ రెడ్డి కీలక ట్వీట్..
Kishan Reddy
Follow us
Shaik Madar Saheb

|

Updated on: Jan 15, 2025 | 5:07 PM

సంక్రాంతి పండగ సందర్భంగా కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి.. అందరినీ ఒక్కచోట చేర్చే ప్రయత్నం చేసి అందరినీ ఆకట్టుకున్నారు.. ఢిల్లీలోని తన నివాసంలో తెలుగు సంప్రదాయం ఉట్టిపడేలా సంక్రాంతి వేడుకలు నిర్వహించారు. ఈ వేడుకల్లో ప్రధాని మోదీతోపాటు.. మెగాస్టార్ చిరంజీవి, కేంద్ర మంత్రులు, బిజెపి అగ్రనేతలు, తెలుగు రాష్ట్రాల ఎంపీలతో పాటు ఢిల్లీలో ఉండే తెలుగు ఐఏఎస్, ఐపీఎస్‌ అధికారులు, అనేకమంది ప్రముఖులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా డప్పు నృత్యాలు, భోగిమంటలు, గంగిరెద్దుల విన్యాసాలు, హరిదాసుల కీర్తనలు, పతంగుల హంగులు.. సంప్రదాయక వంటకాలు, సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించారు.. ఇలా సంక్రాంతి పర్వదినాన.. ఆధ్యాత్మిక శోభ వెల్లివిరిసిలా ఆతిథ్య ఏర్పాట్లు చేశారు. ఈ క్రమంలోనే ఓ ఆసక్తికర పరిణామం చోటుచేసుకుంది.. ప్రధానమంత్రి నరేంద్ర మోదీని సాంప్రదాయ డప్పు నృత్యాలతో కేంద్రమంత్రి కిషన్ రెడ్డి, మెగాస్టార్ చిరంజీవి ఆహ్వానించారు. ఈ సమయంలో ప్రధాని మోదీ.. డప్పు కొడుతున్న వ్యక్తిని ఆప్యాయంగా పలకరించి.. అతని చేతిని పట్టుకుని నుదిటికి తాకారు..

అయితే.. దీనికి సంబంధించిన వీడియో, ఫొటో నెట్టింట వైరల్ అయింది.. ఈ ఫొటోను తెలంగాణ గేయ రచయిత మిట్టపల్లి సురేందర్ షేర్ చేసి.. ఇది ఎంత అద్భుతమైన దృశ్యం అంటూ పేర్కొన్నారు.. తమను అంటరాని వారిగా భావించే వారని.. ఎప్పుడైనా నాయకులు వారిని మనుషులుగా భావించారా? అంటూ రాసుకొచ్చారు.. ఈ దృశ్యం తన హృదయాన్ని కదిలించిందని.. ‘మోడీ గారు.. దయచేసి తెలంగాణకు రండి. మా గుండెలను డప్పు చేసి కొడతాం’.. అంటూ రాసుకొచ్చారు..

అయితే.. మిట్టపల్లి సురేందర్ చేసిన పోస్ట్ పై కేంద్రమంత్రి కిషన్ రెడ్డి స్పందించారు.. మిట్టపల్లి సురేందర్ పోస్ట్ ను ఫొటోగా మార్చి మళ్లీ ట్వీట్ చేసిన కిషన్ రెడ్డి.. సోదరుడు మిట్టపల్లి సురేందర్ పోస్ట్ బాధ కలిగిస్తుందన్నారు.. కొద్దిమంది రాజకీయ నేతల కపటత్వాన్ని బయటపడుతూనే మోడీ లక్షణాన్ని ఈ పోస్ట్ నిర్వచించిందంటూ కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి రాసుకొచ్చారు. ఇది మోదీ వ్యక్తిత్వాన్ని చూపిస్తుందని.. ఎంత ఎదిగినా అందరితో సమానమనే భావనను చూపిస్తుందంటూ కిషన్ రెడ్డి వివరించారు.

కిషన్ రెడ్డి ట్వీట్..

మిట్టపల్లి సురేందర్ పోస్ట్..

కాగా.. డప్పు అనేది సాధారణంగా తెలంగాణలోని సంప్రదాయ సంగీత వాయిద్యం.. గ్రామీణ ప్రాంతాల్లో ఎంతో ప్రాచుర్యం పొందింది.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి