Telangana High Court: తెలంగాణ హైకోర్టుకు నలుగురు కొత్త జడ్జీలు.. ఎవరెవరు ఉన్నారంటే..
తెలంగాణ హైకోర్టుకు నలుగురు కొత్త న్యాయమూర్తులను నియమిస్తూ రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము ఉత్తర్వులు జారీ చేశారు. ఈ మేరకు రాష్ట్రపతి కార్యాలయం బుధవారం ప్రకటన విడుదలచేసింది.. సీనియర్ న్యాయవాదులైన జస్టిస్ రేణుక యర, జస్టిస్ నర్సింగ్ రావు నందికొండ, జస్టిస్ తిరుమల దేవి, జస్టిస్ మధుసూదన్ రావును రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము నియమించారు..
తెలంగాణ హైకోర్టుకు నలుగురు కొత్త న్యాయమూర్తులను నియమిస్తూ రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము ఉత్తర్వులు జారీ చేశారు. ఈ మేరకు రాష్ట్రపతి కార్యాలయం బుధవారం ప్రకటన విడుదలచేసింది.. సీనియర్ న్యాయవాదులైన జస్టిస్ రేణుక యర, జస్టిస్ నర్సింగ్ రావు నందికొండ, జస్టిస్ తిరుమల దేవి, జస్టిస్ మధుసూదన్ రావును రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము నియమించారు.. జస్టిస్ రేణుక యర, జస్టిస్ నర్సింగ్ రావు నందికొండ, జస్టిస్ తిరుమల దేవి, జస్టిస్ మధుసూదన్ రావు పేర్లను ఇటీవల సుప్రీంకోర్టు కొలిజియం సిఫార్సు చేయగా.. రాష్ట్రపతి ఆమోద ముద్రవేశారు.
తెలంగాణ హైకోర్టుకు కొత్త జడ్జిల నియమించేందుకు సుప్రీంకోర్టు కొలీజియం జనవరి 11న సమావేశంలో ఈ నలుగురి పేర్లను ఫైనల్ చేసింది.. అనంతరం కొలీజియం రాష్ట్రపతి సిఫార్సు చేసినట్లు ప్రకటనలో తెలిపింది..
తెలంగాణ హైకోర్టు కొత్త న్యాయమూర్తులుగా జస్టిస్ రేణుక యర, జస్టిస్ నర్సింగ్ రావు నందికొండ, జస్టిస్ తిరుమల దేవి, జస్టిస్ మధుసూదన్ రావు నియామకం పట్ల.. పలువురు కొత్తగా నియామకం అయిన జడ్జీలకు శుభాకాంక్షలు తెలిపారు.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..