Tech Tips: ఫోన్‌ని సర్వీస్ సెంటర్‌లో ఇచ్చే ముందు ఈ 3 పనులు చేయండి.. లేకుంటే భారీ నష్టం

Tech Tips: ఈ రోజుల్లో చాలా మంది స్మార్ట్‌ ఫోన్లు వాడుతున్నారు. ఫోన్‌ కేవలం కాల్స్‌ చేయడానికి కాకుండా రకరకాల పనులు చేసుకుంటున్నాము. స్మార్ట్‌ ఫోన్‌లో బ్యాంకు లావాదేవీలు, ఇతర లావాదేవీలు చేస్తుంటాము. అలాగే వ్యక్తిగత ఫోటోలు, బ్యాంకింగ్ వివరాలు, అనేక ఇతర వ్యక్తిగత డేటా స్మార్ట్‌ఫోన్‌లో ఉంటాయి. ఫోన్‌ను సర్వీస్ సెంటర్‌లో ఇచ్చే సమయంలో కొన్ని విషయాలను గుర్తుంచుకోవాలని నిపుణులు చెబుతున్నారు..

Tech Tips: ఫోన్‌ని సర్వీస్ సెంటర్‌లో ఇచ్చే ముందు ఈ 3 పనులు చేయండి.. లేకుంటే భారీ నష్టం
Follow us
Subhash Goud

|

Updated on: Jan 15, 2025 | 5:17 PM

స్మార్ట్‌ఫోన్‌లు మన జీవితంలో చాలా ముఖ్యమైన భాగంగా మారాయి. ఎందుకంటే ఈ రోజుల్లో మన పనిలో సగానికి పైగా ఇంట్లో కూర్చొని మొబైల్ ఫోన్ల ద్వారానే అయిపోతుంది. కానీ కొన్నిసార్లు ఫోన్ చెడిపోయినప్పుడు లేదా ఫోన్‌లో ఏదైనా సమస్య ఏర్పడినప్పుడు ముందుగా చేసే పని మొబైల్‌ సర్వీస్‌ సెంటర్‌కు వెళ్లడం. కానీ చాలా సార్లు కొందరు తొందరపాటు కారణంగా కొన్ని తప్పులు చేస్తుంటారు. స్మార్ట్‌ఫోన్ అనేది కాల్‌లు చేయడానికి ఉపయోగించే గాడ్జెట్ మాత్రమే కాదు. బ్యాంకింగ్ లావాదేవీల నుంచి వివిధ రకాల దరఖాస్తుల వరకు అన్ని రకాల ఉపయోగపడుతుంటాయి. వ్యక్తిగత ఫోటోలు, బ్యాంకింగ్ వివరాలు, అనేక ఇతర వ్యక్తిగత డేటా స్మార్ట్‌ఫోన్‌లో ఉంటాయి. ఫోన్‌ను సర్వీస్ సెంటర్‌లో ఇచ్చే సమయంలో కొన్ని విషయాలను గుర్తుంచుకోవాలని నిపుణులు చెబుతున్నారు.

మీ మొబైల్‌లో ఏదైనా బ్యాంకింగ్ యాప్‌లు ఉంటే, ముందుగా వాటిని అన్‌ఇన్‌స్టాల్ చేయాలి. అప్లికేషన్‌లను తొలగించే ముందు పాస్‌వర్డ్, యూజర్‌ నేమ్‌లను ఒక పేపర్‌పై రాసి ఉంచుకోండి. స్మార్ట్‌ఫోన్ నోట్‌ప్యాడ్‌లో పాస్‌వర్డ్, వ్యక్తిగత వివరాలను రాసుకోవడం సాధారణం. అయితే ఎవరికైనా ఫోన్ ఇచ్చేటపుడు నోట్‌ప్యాడ్‌లోని ఉన్న వివరాలను కూడా డిలీట్‌ చేయడం మర్చిపోవద్దు.

ప్రస్తుతం సోషల్ మీడియాను ఉపయోగించని వారు ఉండరు. మీ సోషల్ మీడియా ఖాతాను దుర్వినియోగం చేయకుండా ఉండేందుకు, మీరు అన్ని ఖాతాల నుండి లాగ్ అవుట్ చేసిన తర్వాత మాత్రమే ఫోన్‌కు సర్వీస్‌ సెంటర్‌కు తీసుకెళ్లాలి. లాగ్ అవుట్ అయిన తర్వాతే ఫోన్ సర్వీస్ సెంటర్‌కి జీమెయిల్ అకౌంట్ ఇవ్వాలి. Gmail ఖాతాకు సంబంధించిన అన్ని వివరాలలో గోప్యతను నిర్వహించడం చాలా ముఖ్యం. ఫోన్ గ్యాలరీలో ఏవైనా వ్యక్తిగత ఫోటోలు ఉంటే, వాటిని తొలగించండి. మీకు ఫోటోలు కావాలంటే వాటిని మెమరీ కార్డ్ లేదా పెన్ డ్రైవ్‌కు బదిలీ చేయండి.

మీరు ఫోన్‌ను సర్వీస్ సెంటర్‌కి తీసుకెళ్తుంటే, మీ ఫోన్ ఆన్ ఉంటే అప్పుడు ముఖ్యమైన డేటాను బ్యాకప్ చేయాలి. కానీ చాలా సార్లు మన హడావిడిలో అవసరమైన సమాచారాన్ని సేవ్ చేయడం మర్చిపోతుంటాం. చాలా సార్లు ఫోన్ రిపేర్ అయినప్పుడు సర్వీస్ సెంటర్ లో ఇంతకు ముందు ఉన్న డేటా అంతా అలాగే ఉంటుందన్న గ్యారెంటీ లేదు. అటువంటి పరిస్థితిలో మీరు డ్రైవ్, డ్రాప్‌బాక్స్, గూగుల్ ఫోటోలకు ఫోటోలను బ్యాకప్ చేయవచ్చు.

మరిన్ని టెక్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి