AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Telangana: ఎలుక కాటుకు, చర్మవ్యాధులకు ఈ బావి నీళ్లే దివ్యౌషధం.. పోటెత్తుతున్న జనం..!

రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ, కోరుట్ల పట్టణలను కలిపే మార్గం మధ్యలో వేములవాడ నుండి 18 కి.మీ. దూరంలో చందుర్తి మండలం మల్యాల గ్రామం అనగానే సుదూర ప్రాంతాల వారికి, చుట్టు ప్రక్కల గ్రామ ప్రజలకు గుర్తుకు వచ్చేది చుందేలుక బావి.

Telangana: ఎలుక కాటుకు, చర్మవ్యాధులకు ఈ బావి నీళ్లే దివ్యౌషధం.. పోటెత్తుతున్న జనం..!
Well Water
G Sampath Kumar
| Edited By: Balaraju Goud|

Updated on: Aug 20, 2024 | 12:50 PM

Share

ఈ విశ్వంలో ప్రతిజీవి మనుగడకు నీళ్లు, గాలి  తరువాత ముఖ్యమై నది నీరు ఈ బావి ప్రత్యేకతలు చూస్తే ఆశ్చర్య పోవాల్సిందే. ప్రధాన రహదారి నుండి గ్రామాల్లోకి వెళుతున్న దారి పక్కన బావి ఉంటుంది. అయితే అక్కడి బావి నీళ్లు తాగితే సర్వరోగాలు నయమవుతాయట. దీంతో బాధితులు క్యూకడుతున్నారు.

రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ, కోరుట్ల పట్టణలను కలిపే మార్గం మధ్యలో వేములవాడ నుండి 18 కి.మీ. దూరంలో చందుర్తి మండలం మల్యాల గ్రామం అనగానే సుదూర ప్రాంతాల వారికి, చుట్టు ప్రక్కల గ్రామ ప్రజలకు గుర్తుకు వచ్చేది చుండేలుక బావి.

చుందెలుక కరచి చర్మ వ్యాధులు, మంటలు, దురద వంటి రోగాలకు ఈ చుందెలుక బావి నీళ్ళు దివ్యౌషధంగా మారింది. మనుష్యులకే కాకుండా. సాదు జంతువులకు కూడా ఈ నీళ్లు ఔషధం లాగా పనిచేస్తాయి. ఆదివారం, గురువారం ఏడు వారాలు ఈ బాని నీళ్లతొ స్నానం చేయడం (ఎడమ చేత్తో స్నానం చేసుకోవడం, ఎడమ చేత్తో ఏడు బుక్కల నీళ్లు తాగడం) వంట కూడా ఈ నీళ్లతోనే చేసుకోవడం వల్ల చాలా వరకు చాలా మందికి చర్మ వ్యాధులు తగ్గాయని గ్రామస్తులు తెలిపారు. ఎలుక కరిచిన తర్వాత ట్రీట్మెంట్ కోసం డాక్టర్ల చుట్టు తిరిగినా, ఎన్ని మందులు వాడిన తగ్గని చర్మ వ్యాధులు ఈ బావి నీళ్ల తాగితే నయం అవుతాయంటున్నారు.

ఇలా నయం అయిన వారు ఆ నోటా, ఈ నోటా ప్రజలలో ప్రచారం కావడంతో చుట్టూ ప్రక్కల ప్రాంతాలవారే కాకుండా, హైదరాబాద్, నిజామాబాద్, ఆదిలాబాద్ జిల్లాలతోపాటు మహారాష్ట్ర నుండి కూడా అనేక మంది వ్యాధిగ్రస్తులు వస్తున్నారు. బావి నీటితో వంట చేసుకుని వ్యాధి తగ్గేవరకు ఇక్కడే ఉంటున్నారు.

బావి ఎలా వెలసిందని తెలుసుకోగా, గ్రామ పెద్దలు చెప్పిన ప్రకారం వేల సంవత్సరాల క్రితం ఒక సన్యాసి స్వామీజీ వచ్చి గ్రామంలో భిక్షాటన చేసుకుంటూ ఊరికి కాస్త దూరంగా నివాసం ఏర్పరుచుకున్నారు. ఇదే గ్రామంలోని కొందరు చుందెలుక కరచి చర్మం వుండలుగా తయారై దురదతో ఇబ్బంది పడటం చూసి వారిని తన నివాస స్థలానికి రమ్మని పిలిపించుకున్నారు. అతను వచ్చాక చూసి సన్యాసి నివాసం ఉండే ప్రక్కన తన చేతులతో ఒక నీటి గుంట తవ్వి అందులో పంచ లోహాలు, రాగి పత్రాన్ని ఆ గుంటలో పెట్టీ గుంటలో ఊరిన నీళ్ళతో  ఏడు వారాలు స్నానం చెయ్యమని ప్రతి గురు, ఆదివారం స్నానం ఆచరించాలని చెప్పాడని బావి చరిత్ర తెలిసిన గ్రామపెద్దలు తెలిపారు. తమ చర్మ రోగం పూర్తిగా తగ్గడంతో కాల క్రమంలో కుంటను బావిగా తవ్వి చుట్టూ గాజులు పోసి ఆ బావిని ఇప్పటికి రక్షిస్తున్నారు గ్రామస్తులు. రాను రాను ఆ బావి పేరు చుందేలుక బావి అని పిలుస్తున్నారు..

మరిన్ని హ్యుమన్ ఇంట్రెస్ట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.. 

ఉదయం పూట ఈ వ్యక్తులు టీ తాగితే బాడీ షెడ్డుకే.. అసలు విషయం..
ఉదయం పూట ఈ వ్యక్తులు టీ తాగితే బాడీ షెడ్డుకే.. అసలు విషయం..
2026లో మారుతి సుజుకి బిగ్ బ్యాంగ్..కొత్త అప్‌డేట్స్‌తో 4 కార్లు!
2026లో మారుతి సుజుకి బిగ్ బ్యాంగ్..కొత్త అప్‌డేట్స్‌తో 4 కార్లు!
శీతాకాలంలో మాత్రమే లభించే టర్నిప్ కూరగాయ గురించి తెలుసా? లాభాలు
శీతాకాలంలో మాత్రమే లభించే టర్నిప్ కూరగాయ గురించి తెలుసా? లాభాలు
కొత్త జీతం ఎలా నిర్ణయిస్తారు..? 8వ వేతన సంఘం సిఫార్సుల ప్రకారం..
కొత్త జీతం ఎలా నిర్ణయిస్తారు..? 8వ వేతన సంఘం సిఫార్సుల ప్రకారం..
మరోవారంలో MAT 2025 రాత పరీక్ష.. దరఖాస్తుకు మరికొన్ని గంటలే ఛాన్స్
మరోవారంలో MAT 2025 రాత పరీక్ష.. దరఖాస్తుకు మరికొన్ని గంటలే ఛాన్స్
SBIలో తక్కువ వడ్డీకే లోన్లు.. నేటి నుంచే ప్రారంభం!
SBIలో తక్కువ వడ్డీకే లోన్లు.. నేటి నుంచే ప్రారంభం!
తెలుగు రాష్ట్రాల్లో భగ్గుమంటున్న బంగారం ధరలు.. వెండి రికార్డ్
తెలుగు రాష్ట్రాల్లో భగ్గుమంటున్న బంగారం ధరలు.. వెండి రికార్డ్
RBI సమ్మర్ ఇంటర్న్‌షిప్‌కు 2026 దరఖాస్తు చేశారా? చివరి ఛాన్స్ ఇదే
RBI సమ్మర్ ఇంటర్న్‌షిప్‌కు 2026 దరఖాస్తు చేశారా? చివరి ఛాన్స్ ఇదే
గూగుల్‌ సరికొత్త ఫీచర్‌ తీసుకొచ్చిన! 70 భాషలు మీకు వచ్చేసినట్టే..
గూగుల్‌ సరికొత్త ఫీచర్‌ తీసుకొచ్చిన! 70 భాషలు మీకు వచ్చేసినట్టే..
JEE Advanced 2026 పరీక్ష సిలబస్‌ విడుదల.. డౌన్‌లోడ్‌ లింక్‌ ఇదిగో
JEE Advanced 2026 పరీక్ష సిలబస్‌ విడుదల.. డౌన్‌లోడ్‌ లింక్‌ ఇదిగో