Vastu Tips: చిన్న మార్పులే కానీ.. జీవితాన్నే మార్చేస్తాయి.. బెస్ట్ వాస్తు టిప్స్
భారతీయులు వాస్తును బాగా విశ్వసిస్తారు. విదేశాల్లో ఉన్నా సరే వాస్తుకు అనుగుణంగానే తమ ఇంటి నిర్మాణం చేసుకోవాలని భావిస్తారు. అంతేనా వాస్తు నిబంధలను తూచా తప్పకుండా పాటిస్ంటుఆరు. అయితే మనకు తెలిసో తెలియకో చేసే కొన్ని చిన్న చిన్న వాస్తు తప్పిదాలు భారీ మూల్యాన్ని చెల్లించేలా చేస్తాయి. కానీ చిన్న చిన్న వాస్తు నియమాలు...
భారతీయులు వాస్తును బాగా విశ్వసిస్తారు. విదేశాల్లో ఉన్నా సరే వాస్తుకు అనుగుణంగానే తమ ఇంటి నిర్మాణం చేసుకోవాలని భావిస్తారు. అంతేనా వాస్తు నిబంధలను తూచా తప్పకుండా పాటిస్ంటుఆరు. అయితే మనకు తెలిసో తెలియకో చేసే కొన్ని చిన్న చిన్న వాస్తు తప్పిదాలు భారీ మూల్యాన్ని చెల్లించేలా చేస్తాయి. కానీ చిన్న చిన్న వాస్తు నియమాలు జీవితాన్ని మారుస్తాయని నిపుణులు చెబుతున్నారు. అలాంటి కొన్ని వాస్తు చిట్కాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం..
* ఆగ్నేయ దిశలో వంటగది ఏర్పాటు చేసుకోవాని తెలిసిందే. అయితే వంటగదిలో నారింజ రంగు వేసుకుంటే మంచిదని నిపుణులు చెబుతున్నారు. ఇది మహిళలను మానసికంగా, శారీరకంగా స్థిరంగా ఉంచడంలో ఉపయోగపడుతుందని వాస్తు పండితులు సూచిస్తున్నారు.
* ఇక ఇంట్లో ఉండే వారి మానసిక పరిస్థితులు బాగుండాలన్నా, ఆలోచనలు స్థిరంగా ఉండాలన్నా మాస్టర్ బెడ్‌రూమ్ నైరుతి దిశలో ఉండాలని నిపుణులు చెబుతున్నారు. అలాగే బెడ్ రూమ్ పైన వాటర్ ట్యాంక్ లేకుండా చూసుకోవాలని సూచిస్తున్నారు.
* చిన్న పిలలు నిద్రించే గదిలో లైట్ బ్లూ లేదా బూడిద రంగు వేసుకోవాలి. దీనివల్ల చిన్నారుల మానసిక ఆరోగ్యం బాగుంటుంది. అలాగే స్టడీ రూమ్‌లో కూడా ఇలాంటి లైట్ కలర్స్ వేసుకోవడం మంచిది.
* ఇక బెడ్‌రూమ్‌లో కొందరు తరచూ చేసే తప్పుల్లో బెడ్‌ను గది మధ్యలో పెట్టుకోవడం. వాస్తు ప్రకారం ఇది కూడా మంచిది కాదు. వైవాహిక సమస్యలకు దారి తీసే అవకాశం ఉంటుందని వాస్తు పండితులు సూచిస్తున్నారు. బెడ్‌రూమ్‌లో మంచం నైరుతి దిశలోనే ఉండేలా చూసుకోవాలి. అలాగే బెడ్ రూమ్ ఎట్టి పరిస్థితుల్లో చదరపు లేదా దీర్ఘచతురస్రాకారంగా ఉండాలని గుర్తు పెట్టుకోవాలి.
* మంచం విషయంలో కూడా కొన్ని తప్పులు చేయకూడదు. ముఖ్యంగా ఎట్టి పరిస్థితుల్లో చెక్కతో చేసిన మంచాన్నే వాడాలి. అలా కాకుండా మెటల్‌తో చేసిన మంచాన్ని ఉపయోగిస్తే దంపతుల మధ్య గొడవలు వచ్చే అవకాశాలు ఉంటాయి.
* ఇంట్లో ఏ గది తీసుకున్నా ఈశాన్యం మూల విషయంలో పలు జాగ్రత్తగుతలు తీసుకోవాలి. ఈశాన్యంలో ఎట్టి పరిస్థితుల్లో చెత్తాచెదారం ఉండకుండా చూసుకోవాలి. అలాగే ఈశాన్యంలో బరువైన వస్తువులను ఏర్పాటు చేసుకోకూడదని వాస్తు పండితులు సూచిస్తున్నారు.
మరిన్ని ఇంట్రెస్టింగ్ కథనాల కోసం క్లిక్ చేయండి..