ప్రపంచంలో గూడు కట్టుకునే ఏకైక పాము..అంతేకాదు.. ఈ షాకింగ్ నిజాలు తెలిస్తే..
ఈ పాము విషం ఒక న్యూరోటాక్సిక్ ఇది మానవ కేంద్ర నాడీ వ్యవస్థపై తీవ్ర ప్రభావాన్ని చూపుతుంది. ఒకవేళ కింగ్ కోబ్రా కాటు వేస్తే తీవ్రమైన నొప్పి వేధిస్తుంది. పక్షవాతం, కోమాలోకి కూడా వెళ్తారు. సకాలంలో చికిత్స అందకపోతే ప్రాణాలు పోవడం ఖాయం. ఇలాంటి పాములు ఎక్కువగా భారతదేశం, చైనా, ఇండోనేషియా, మలేషియా, ఫిలిప్పీన్స్ వంటి ప్రాంతాల్లో కనిపిస్తాయి. చెరువులు, నదులు, దట్టమైన అడవుల్లో ఎక్కువగా నివసిస్తుంటాయి.
ప్రపంచ వ్యాప్తంగా ఎన్నో రకరకాల పాములు ఉన్నాయి. ఒక్కో దేశంలో, ఒక్కో ప్రాంతంలో ఒక్కో రకమైన పాములు కనిపిస్తుంటాయి. వాటిల్లో కొన్ని విషపూరితమైనవి కాగా, మరికొన్ని విషరహితమైనవి కూడా ఉంటాయి. మరికొన్ని గాల్లోకి ఎగిరే పాములు కూడా ఉంటాయి. ఇలా అరుదైన, అందమైన, చిత్ర విచిత్రమైన పాములకు సంబంధించిన వీడియోలు అనేకం సోషల్ మీడియాలో విస్తృతంగా కనిపిస్తుంటాయి. అయితే, మీరేప్పుడైన కింగ్ ఆఫ్ స్నేక్స్ గా పిలిచే పాము ఒకటి ఉందని విన్నారా..? అదేంటి అడవికి రాజు సింహం అని తెలుసు కానీ, ఇలాంటి పాము గురించి ఎప్పుడూ వినలేదని అంటున్నారు చాలా మంది. ఈ పాము కేవలం విషపూరితమైనది మాత్రమే కాదు, చాలా తెలివైనది కూడా. ఈ పాము ఎంత మందిలో ఉన్నప్పటికీ తన సంరక్షకుడిని ఇట్టే గుర్తు పడుతుంది. ఇంతకీ ఆ పాము మరెదో కాదు కింగ్ కోబ్రా. పూర్తి వివరాల్లోకి వెళితే..
కింగ్ కోబ్రా ప్రపంచంలోని అత్యంత విషపూరితమైన పాములలో ఒకటి. అలాగే ఈ పామును ఇతర పాముల కంటే తెలివైందిగా చెబుతారు. ఈ పాము వేటాడే పద్ధతులు కూడా చాలా విభిన్నంగా ఉంటాయట. ఇతర పాముల్లో లేని ఎన్నో ప్రత్యేక గుణాలు ఈ పాములో ఉంటాయని నిపుణులు చెబుతున్నారు. వేటాడే సమయంలో చాలా యాక్టివ్ గా ఉంటాయి. అలాగే తన సంరక్షకుడు ఎంత మందిలో ఉండని ఇట్టే గుర్తిస్తుంది. ఇక మగ కింగ్ కోబ్రాలు అడవిలో తమ ప్రాంతాన్ని మరింత బాగా గుర్తు పెట్టుకుంటాయట.. తమ సరిహద్దుల్లోకి ఇతర పాములను అస్సలు రానివ్వవని చెబుతున్నారు.
ఇకపోతే, ఆడ కింగ్ కోబ్రాల విషయానికి వస్తే.. ఇవి గుడ్లు పెట్టడానికి గూడు కట్టుకుంటాయని జంతు పరిశోధకులు చెబుతున్నారు.. ఆకులు, కొమ్మలు, ఇతర వస్తువులను సేకరించి గూడును తయారు చేసుకుంటుందట. ప్రపంచంలో గూడు నిర్మించుకునే ఏకైక పాము ఇదే అంటున్నారు నిపుణులు. అంతేకాదు.. కింగ్ కోబ్రా మరో ప్రత్యేకత కూడా ఉంది.. ఇది ఏకంగా 18 అడుగుల పొడవు వరకు పెరుగుతుంది. అలాగే ఈ పాము జీవిత కాలం 20 ఏళ్లు ఉంటుంది. కింగ్ కోబ్రా చాలా ప్రమాదకరమైందిగా చెబుతారు.
ఈ పాము విషం ఒక న్యూరోటాక్సిక్ ఇది మానవ కేంద్ర నాడీ వ్యవస్థపై తీవ్ర ప్రభావాన్ని చూపుతుంది. ఒకవేళ కింగ్ కోబ్రా కాటు వేస్తే తీవ్రమైన నొప్పి వేధిస్తుంది. పక్షవాతం, కోమాలోకి కూడా వెళ్తారు. సకాలంలో చికిత్స అందకపోతే ప్రాణాలు పోవడం ఖాయం. కింగ్ కోబ్రాలు ఎక్కువగా భారతదేశం, చైనా, ఇండోనేషియా, మలేషియా, ఫిలిప్పీన్స్ వంటి ప్రాంతాల్లో కనిపిస్తాయి. చెరువులు, నదులు, దట్టమైన అడవుల్లో ఎక్కువగా నివసిస్తుంటాయి.
మరిన్ని ట్రెండింగ్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..