ఈ సమస్యలు ఉన్నవారు సోంపును అసలు తినకూడదట..! ఎందుకంటే..
అయితే, సోంపు గింజలు కేవలం రుచికి మాత్రమే కాదు ఆరోగ్యానికి కూడా చాలా మంచివి. విటమిన్ సి, ఐరన్, మెగ్నీషియం, కాల్షియం, పొటాషియం వంటి అనేక ముఖ్యమైన పోషకాలు ఉంటాయి. భోజనం తర్వాత సోంపు తీసుకోవడం వల్ల జీర్ణక్రియ మెరుగుపడుతుంది. ఇది అజీర్తి, గ్యాస్ వంటి సమస్యలను తగ్గిస్తుంది. సోంపు చాలా ఆరోగ్యకరమైన మసాలా ద్రవ్యం అయినప్పటికీ కొంతమందికి ఇది సరిపడకపోవచ్చు అంటున్నారు నిపుణులు.
సోంపు…ప్రతి ఒక్కరికీ తెలిసిందే.. ఎందుకంటే.. చాలా మందికి భోజనం తర్వాత సోంపు తినే అలవాటు ఉంటుంది. అలాగే, హోటల్స్, రెస్టారెంట్స్‌కి వెళ్లినప్పుడు అక్కడ భోజనం తర్వాత తప్పనిసరిగా సోంపు ఇస్తారు.. అయితే, ఈ సోంపు తినటం వల్ల ఒకటి లేదా రెండు కాదు ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలను కలిగిస్తుందని మనందరికీ తెలిసిందే..అయితే, సోంపు గింజలు కేవలం రుచికి మాత్రమే కాదు ఆరోగ్యానికి కూడా చాలా మంచివి. విటమిన్ సి, ఐరన్, మెగ్నీషియం, కాల్షియం, పొటాషియం వంటి అనేక ముఖ్యమైన పోషకాలు ఉంటాయి. భోజనం తర్వాత సోంపు తీసుకోవడం వల్ల జీర్ణక్రియ మెరుగుపడుతుంది. ఇది అజీర్తి, గ్యాస్ వంటి సమస్యలను తగ్గిస్తుంది. సోంపు చాలా ఆరోగ్యకరమైన మసాలా ద్రవ్యం అయినప్పటికీ కొంతమందికి ఇది సరిపడకపోవచ్చు అంటున్నారు నిపుణులు.
సోంపును తినడం వల్ల కొన్ని సమస్యలు తలెత్తే అవకాణం ఉంది. సోంపు గర్భాశయ సంకోచాలను ప్రేరేపించే అవకాశం ఉంది. కాబట్టి గర్భవతులు సోపును తీసుకోవడం మంచిది కాదు. సోంపు పాల ఉత్పత్తిని తగ్గించే అవకాశం ఉంది. కాబట్టి పాలిచ్చే తల్లులు సోంపును తీసుకోవడం మంచిది కాదు.
శస్త్రచికిత్సకు ముందు కొన్ని రోజుల పాటు సోంపును తీసుకోవడం మంచిది కాదు. రక్తం గడ్డకట్టే అవకాశం ఉంది. సోంపు కడుపులోని ఆమ్లాన్ని పెంచే అవకాశం ఉంది. కడుపులో పుండ్లు ఉన్నవారు సోంపును తీసుకోవడం మంచిది కాదు అంటున్నారు. సోంపుతో తుమ్ములు, అలర్జీలను మరింత తీవ్రతరం చేసే అవకాశం ఉందంటున్నారు.
(NOTE: ఇంటర్నెట్‌లో సేకరించిన సమాచారం ఆధారంగా ఈ వివరాలు మీకు అందించటం జరిగింది. ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. తదుపరి జరిగే ఎలాంటి పరిణామాలకు TV9 Telugu.com బాధ్యత వహించదు.)
మరిన్ని లైఫ్ స్టైల్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..