కొబ్బరినూనెలో ఈ పొడిని మిక్స్ చేసి రాస్తే తెల్లజుట్టు నేచురల్‌గా నల్లబడుతుంది..! ట్రై చేసి చూడండి..

తెల్ల వెంట్రుకలను నల్లగా మార్చేందుకు కొబ్బరినూనె ఉత్తమ ఔషధంగా నిపుణులు చెబుతుంటారు. ఎందుకంటే కొబ్బరినూనెలో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. చుండ్రును పోగొట్టి తెల్లజుట్టును నల్లగా మార్చే అద్భుత ఔషధంగా పని చేస్తుంది. నల్ల జీలకర్రను కొబ్బరినూనెలో కలిపి రాసుకుంటే వెంట్రుకలు నల్లగా మారుతాయి. నల్ల జీలకర్రను తక్కువ మంటపై వేయించి ఒక కప్పు కొబ్బరి నూనె వేసి తక్కువ మంట మీద వేడి చేయాలి.

కొబ్బరినూనెలో ఈ పొడిని మిక్స్ చేసి రాస్తే తెల్లజుట్టు నేచురల్‌గా నల్లబడుతుంది..! ట్రై చేసి చూడండి..
White Hair
Follow us
Jyothi Gadda

|

Updated on: Jan 14, 2025 | 2:49 PM

నేటి ఆధునిక కాలంలో అభివృద్ధితో పాటుగా ప్రజల ఆరోగ్యం కూడా ప్రభావితం అవుతోంది. నేటి బిజీ లైఫ్‌ కారణంగా ప్రజలు చిన్న వయసులోనే అనేక ఆరోగ్య సమస్యలను ఎదుర్కొంటున్నారు. వాటిలో అతి ముఖ్యమైనది జుట్టు రాలిపోవటం, బట్టతల, చిన్న వయసులోనే జుట్టు తెల్లబడటం వంటివి ఎక్కువ మంది వేధిస్తున్న సమస్యలు. అయితే, జుట్టు పెరగడానికి మార్కెట్లో అనేక రకాలు నూనెలు ఉన్నాయి. వాటిలో కొన్ని కృత్రిమ పదార్థాలు ఉంటాయి. దీని వల్ల జుట్టుతో పాటు డబ్బు కూడా లాస్ అవుతుంది. కాబట్టి, దీనికి పరిష్కారంగా కొన్ని వంటింటి చిట్కాలు అద్భుతంగా పనిచేస్తాయి. అందులో ఒకటి కొబ్బరి నూనె..

కొబ్బరినూనె మన జుట్టు ఒత్తుగా పెరిగేలా ప్రేరేపిస్తుంది. తెల్ల వెంట్రుకలను నల్లగా మార్చేందుకు కొబ్బరినూనె ఉత్తమ ఔషధంగా నిపుణులు చెబుతుంటారు. ఎందుకంటే కొబ్బరినూనెలో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. చుండ్రును పోగొట్టి తెల్లజుట్టును నల్లగా మార్చే అద్భుత ఔషధంగా పని చేస్తుంది. నల్ల జీలకర్రను కొబ్బరినూనెలో కలిపి రాసుకుంటే వెంట్రుకలు నల్లగా మారుతాయి. నల్ల జీలకర్రను తక్కువ మంటపై వేయించి ఒక కప్పు కొబ్బరి నూనె వేసి తక్కువ మంట మీద వేడి చేయాలి.

కొబ్బరి నూనెను రాత్రి పడుకునే ముందు మీ జుట్టుకు పట్టించి మసాజ్ చేయండి. ఈ నూనెను రెగ్యులర్ గా జుట్టుకు రాసుకుంటే జుట్టు సహజంగా నల్లబడుతుంది. నల్ల జీలకర్ర నూనె మిశ్రమాన్ని మీ తలకు రాసుకుని బాగా నానబెట్టి మరుసటి రోజు ఉదయం తలస్నానం చేయాలి.

ఇవి కూడా చదవండి

(NOTE: ఇంటర్నెట్‌లో సేకరించిన సమాచారం ఆధారంగా ఈ వివరాలు మీకు అందించటం జరిగింది. ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. తదుపరి జరిగే ఎలాంటి పరిణామాలకు TV9 Telugu.com బాధ్యత వహించదు.)

మరిన్ని లైఫ్‌ స్టైల్‌ న్యూస్ కోసం క్లిక్‌ చేయండి..