AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Tollywood: ‘కడుపులోనే బిడ్డ కన్నుమూసింది’.. అబార్షన్‌తో కన్నీరు మున్నీరైన టాలీవుడ్ యాంకర్.. వీడియో

మాతృత్వంతోనే మహిళల జీవితానికి పరిపూర్ణత వస్తుందంటారు. అందుకే పెళ్లైన ప్రతి అమ్మాయి అమ్మగా మారాలనుకుంటోంది. మాతృత్వాన్ని మనసారా ఆస్వాదించాలనుకుంటుంది. కానీ ఆనందం మధ్యలోనే ఆవిరైతే.. అంతకన్నా బాధ మరొకటి ఉండదు. ప్రస్తుతం ఓ టాలీవుడ్ యాంకర్ ది కూడా ఇదే పరిస్థితి.

Tollywood: 'కడుపులోనే బిడ్డ కన్నుమూసింది'.. అబార్షన్‌తో  కన్నీరు మున్నీరైన టాలీవుడ్ యాంకర్.. వీడియో
Tollywood Anchor
Basha Shek
|

Updated on: Jan 15, 2025 | 9:44 AM

Share

ప్రముఖ బుల్లితెర నటి, యాంకర్ సమీరా గురించి తెలుగు ఆడియెన్స్ కు ప్రత్యేక పరిచయం అక్కర్లేదు. ఆడపిల్ల అనే సీరియల్‌తో బాగా క్రేజ్ తెచ్చుకుందీ అందాల తార. ఆ తర్వాత అభిషేకం, ముద్దు బిడ్డ, భార్యామణి, మూడు ముళ్ల బంధం.. ఇలా పలు సూపర్ హిట్ సీరియల్స్ లో నటించి మెప్పించింది. అదిరింది వంటి టీవీ ప్రోగ్సామ్స్ లకు యాంకర్ గా కూడా వ్యవహరించింది. అయితే గత కొద్ది కాలంగా బుల్లితెరకు దూరంగా ఉంటోందీ అందాల తార. 2019లో అన్వర్‌ జాన్‌ అనే వ్యక్తిని చేసుకుంది సమీరా. వీరికి 2021లో అర్హాన్‌ అనే బాబు పుట్టాడు. అయితే 2023 నవంబర్‌లో మళ్లీ గర్భం ధరించిందీ అందాల తార. దీంతో మళ్లీ అమ్మ కానున్నాంటూ తెగ సంబరపడిపోయింది. కానీ ఈ ఆనందం మధ్యలోనే ఆవిరైపోయింది. తనకు అబార్షన్ అయినట్లు సోషల్ మీడియా వేదికగా వెల్లడించింది సమీరా. దీంతో బుల్లితెర ప్రముఖులు, అభిమానులు, నెటిజన్లు సమీరాకు ధైర్యం చెబుతున్నారు.

‘2023 నవంబర్‌లో నేను మళ్లీ గర్భం ధరించాను. దీంతో ఇంట్లో అందరూ సంతోషంలో మునిగిపోయారు. అర్హాన్ (కుమారుడు)‌ అయితే నా కడుపులో బిడ్డతో మాట్లాడేవాడు. రెగ్యులర్ టెస్టుల్లో భాగగా రెండుసార్లు స్కానింగ్‌కు వెళ్లినప్పుడు బేబీ బాగానే ఉందన్నారు. పన్నెండోవారంలో మరోసారి స్కానింగ్‌కు వెళ్లాను. అయితే ఎనిమిదో వారంలోనే బిడ్డ ఎదుగుదల ఆగిపోయిందన్నారు డాక్టర్లు. తన గుండె కొట్టుకోవడం లేదన్నారు. అంటే ప్రాణం లేని బిడ్డను నాలుగువారాల పాటు కడుపులో మోశానన్నమాట. తను నన్ను వదిలి వెళ్లాలనుకోవడం లేదు. నా కలలన్నీ కుప్పకూలిపోయినట్లనిపించింది. ఎంతగానో ఏడ్చాం. ఆ తర్వాత కొన్ని రోజులకు టాబ్లెట్స్‌ ద్వారా గర్భంలోని శిశువును తీసేశాం’ అని ఎమోషనల్ అయ్యింది సమీరా.

ఇవి కూడా చదవండి

భర్తతో సమీరా..

కాగా సమీరాకు గర్భ స్రావం అవ్వడం ఇది మొదటి సారి కాదు. 2020లో మొదటి సారి గర్భం ధరించినప్పుడు కూడా ఇలాగే అబార్షన్ అయ్యింది. ఈ విషయాన్ని ఆమెనే పలు సందర్భాల్లో చెప్పుకొచ్చింది.  సమీరా తన యూట్యూబ్ ఛానల్ లో షేర్ చేసిన వీడియో ప్రస్తుతం నెట్టింట వైరల్ గా మారింది. పలువురు బుల్లితెర నటీనటులు, అభిమానులు ఆమెకు ధైర్యం చెబుతున్నారు.

కుమారుడి బర్త్ డే వేడుకల్లో యాంకర్ సమీరా..

View this post on Instagram

A post shared by Syed Anwar (@syedd_annwar)

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Follow Us
ముంబైపై ఘన విజయం.. ప్లేఆఫ్ రేస్‌లోకి కేకేఆర్ ఎంట్రీ..!
ముంబైపై ఘన విజయం.. ప్లేఆఫ్ రేస్‌లోకి కేకేఆర్ ఎంట్రీ..!
భానుడి భగభగలు..! ఎండల్లో ఎలాంటి డ్రింక్స్ తాగాలి? వేటికి దూరంగా..
భానుడి భగభగలు..! ఎండల్లో ఎలాంటి డ్రింక్స్ తాగాలి? వేటికి దూరంగా..
సోషల్ మీడియా స్టార్ కుర్చీతాత హఠాన్మరణం.. ఏం జరిగిందంటే?
సోషల్ మీడియా స్టార్ కుర్చీతాత హఠాన్మరణం.. ఏం జరిగిందంటే?
2026లో కెరీర్ గ్రోత్ కోసం హైదరాబాద్ టాప్ 10 కంపెనీలు ఇవే..
2026లో కెరీర్ గ్రోత్ కోసం హైదరాబాద్ టాప్ 10 కంపెనీలు ఇవే..
పిడుగురాళ్లలో 47.6, నిర్మల్‌లో 46.5 డిగ్రీలు.. సూరీడుతో జాగ్రత్త
పిడుగురాళ్లలో 47.6, నిర్మల్‌లో 46.5 డిగ్రీలు.. సూరీడుతో జాగ్రత్త
ఊరు పెరిగింది.. జనాభా పెరిగింది.. ట్రాఫికర్ మాత్రం షేమ్‌టుసేమ్
ఊరు పెరిగింది.. జనాభా పెరిగింది.. ట్రాఫికర్ మాత్రం షేమ్‌టుసేమ్
ఒకే FDలో మొత్తం డబ్బు పెట్టేస్తున్నారా? తప్పు చేస్తున్నట్లే!
ఒకే FDలో మొత్తం డబ్బు పెట్టేస్తున్నారా? తప్పు చేస్తున్నట్లే!
పెరుగు బాగా పులిసిపోయిందా? పారేయకండి.. ఈ 4 వంటకాలతో పాటు మీ ఇళ్లు
పెరుగు బాగా పులిసిపోయిందా? పారేయకండి.. ఈ 4 వంటకాలతో పాటు మీ ఇళ్లు
సమ్మర్‌ స్పెషల్ హెల్తీ బ్రేక్‌ఫాస్ట్‌..ఈ గులాబీ రంగు ఇడ్లీలు ట్రై
సమ్మర్‌ స్పెషల్ హెల్తీ బ్రేక్‌ఫాస్ట్‌..ఈ గులాబీ రంగు ఇడ్లీలు ట్రై
రోజుకు 2 అరటిపండ్లు తింటే ఏం జరుగుతుంది..? పెద్ద కథే ఇది..
రోజుకు 2 అరటిపండ్లు తింటే ఏం జరుగుతుంది..? పెద్ద కథే ఇది..