AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Arjun Tendulkar: 12 రోజుల్లో జీరో ని హీరో చేశా! క్రికెట్ గాడ్ కొడుకుపై యోగరాజ్ కామెంట్స్

మాజీ క్రికెటర్ యోగరాజ్ సింగ్, అర్జున్ టెండూల్కర్ గురించి పాడ్‌క్యాస్ట్‌లో సంచలన వ్యాఖ్యలు చేశారు. అర్జున్ తన శిక్షణను నిలిపివేయడంలో పేరుతో ఉన్న ఒత్తిడి కారణమని తెలిపారు. గోవా తరపున అరంగేట్రంలో సెంచరీ చేసిన అర్జున్, ఐపీఎల్‌లో తన స్థానం సురక్షితం చేసుకున్నాడు. యోగరాజ్ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు క్రికెట్ లో కొత్త చర్చలకు దారితీశాయి.

Arjun Tendulkar: 12 రోజుల్లో జీరో ని హీరో చేశా! క్రికెట్ గాడ్ కొడుకుపై యోగరాజ్ కామెంట్స్
Arjun Tendulkar
Narsimha
|

Updated on: Jan 15, 2025 | 9:38 AM

Share

భారత మాజీ క్రికెటర్, కోచ్ యోగరాజ్ సింగ్ మరోసారి తన వ్యాఖ్యలతో సంచలనం రేపారు. సచిన్ టెండూల్కర్ కుమారుడు అర్జున్ టెండూల్కర్‌కు 2022లో కేవలం 12 రోజుల పాటు శిక్షణ ఇచ్చిన యోగరాజ్, ఆ అనుభవం గురించి పాడ్‌క్యాస్ట్‌లో ఆసక్తికర విషయాలు వెల్లడించారు. ఆ కాలంలోనే అర్జున్ గోవా తరపున ఫస్ట్‌క్లాస్ క్రికెట్‌లో అరంగేట్రం చేసి సెంచరీ సాధించడమే కాకుండా, ముంబై ఇండియన్స్‌తో ఐపీఎల్ కాంట్రాక్టును పొందడం గమనార్హం.

అయితే, అర్జున్ తన శిక్షణను నిలిపివేయడానికి కారణం, యోగరాజ్ పేరుతో ముడిపడడం వల్ల అతనిపై వచ్చే ఒత్తిడి అని యోగరాజ్ అభిప్రాయపడ్డారు. “అతని పేరు నాకు జోడించి ప్రజలు భయపడ్డారు,” అని పేర్కొన్నారు. అంతేకాకుండా, “సచిన్ కో బోలో – అతన్ని నాతో సంవత్సరం పాటు వదిలిపెట్టండి, ఏమి జరిగుతుందో చూడండి” అంటూ ఆయన తనదైన శైలిలో మరో సంచలన వ్యాఖ్య చేశారు.

అర్జున్ తన క్రికెట్ కెరీర్‌లో ఇప్పటివరకు 17 ఫస్ట్‌క్లాస్ మ్యాచ్‌లు ఆడి 37 వికెట్లు తీసి 532 పరుగులు చేశాడు. ఐపీఎల్‌లో కూడా తన పాదం మోపిన అర్జున్, త్వరలో మరిన్ని విజయాలను సాధించే అవకాశం ఉందని అభిమానులు ఆశిస్తున్నారు.