Lifestyle: బాత్‌రూమ్‌లో తడి టవల్‌ పెడుతున్నారా.? ఏమవుతుందో తెలుసా..

ఇటీవల చాలా మంది బాత్‌రూమ్‌లోకి కూడా స్మార్ట్‌ ఫోన్‌లను తీసుకెళ్తున్నారు. దీంతో అవసరం లేకపోయినా గంటల తరబడి బాత్‌రూమ్‌లో కూర్చుంటున్నారు. అయితే ఎక్కువ సమయం టాయిలెట్‌లో ఉంటే బ్యాక్టీరియా ఇన్ఫెక్షన్ బారిన పడే అవకాశం ఉంటుందని నిపుణులు చెబుతున్నారు. ఫోన్‌పై చేరే బ్యాక్టీరియా కారణంగా ఆరోగ్యంపై తీవ ప్రభావం...

Lifestyle: బాత్‌రూమ్‌లో తడి టవల్‌ పెడుతున్నారా.? ఏమవుతుందో తెలుసా..
Bath Room
Follow us

|

Updated on: Aug 20, 2024 | 9:51 AM

ఆరోగ్యంగా ఉండాలంటే.. మంచి జీవన శైలి, తీసుకునే ఆహారం బాగుండాలని మనందరికీ తెలిసిందే. అయితే బాత్‌రూమ్‌ విషయంలో మనం తెలిసో తెలియకో చేసే కొన్ని తప్పులు సమస్యలను తెచ్చి పెడుతుంటాయి. ఆరోగ్యంపై ప్రతికూల ప్రభావం పడుతుంటాయి. నిజానికి ఇవి పెద్ద తప్పుల్లా అనిపించకపోయినా, వాటి వల్ల జరిగే నష్టం మాత్రం ఎక్కువగా ఉంటుందని నిపుణులు చెబుతున్నారు. ఇంతకీ బాత్‌రూమ్‌ విషయంలో ఎలాంటి తప్పులు చేయకూడదో ఇప్పుడు తెలుసుకుందాం..

ఇటీవల చాలా మంది బాత్‌రూమ్‌లోకి కూడా స్మార్ట్‌ ఫోన్‌లను తీసుకెళ్తున్నారు. దీంతో అవసరం లేకపోయినా గంటల తరబడి బాత్‌రూమ్‌లో కూర్చుంటున్నారు. అయితే ఎక్కువ సమయం టాయిలెట్‌లో ఉంటే బ్యాక్టీరియా ఇన్ఫెక్షన్ బారిన పడే అవకాశం ఉంటుందని నిపుణులు చెబుతున్నారు. ఫోన్‌పై చేరే బ్యాక్టీరియా కారణంగా ఆరోగ్యంపై తీవ ప్రభావం పడుతుంది. ‘జర్నల్ అన్నల్స్ ఆఫ్ క్లినికల్ మైక్రోబయాలజీ అండ్ యాంటీమైక్రోబయాల్స్’లో ప్రచురించిన నివేదిక ప్రకారం, 95 శాతం ఇన్ఫెక్షన్‌లకు కారణమయ్యే బ్యాక్టీరియా సాల్మొనెల్లా, ఈ-కోలి మరియు సి. డిఫిసిల్ వంటి బాత్‌రూమ్‌లో ఉంటాయి.

ఇక మనలో చాలా మంది బ్రష్‌ చేసిన తర్వాత.. బ్రష్‌ను బాత్‌రూమ్‌లో పడుతుంటారు. మరీ ముఖ్యంగా టాయిలెట్‌ సీటుకు సమీపంలో బ్రష్‌ పెట్టడం వల్ల ఎన్నో అనారోగ్య సమస్యలకు దారి తీస్తుందని నిపుణులు అంటున్నారు. ప్రమాదకరమైన బ్యాక్టీరియా బ్రష్‌పై పేరుకుపోయే ప్రమాదం ఉంటుంది. ఇక మనలో చాలా మంది చేసే మరో ప్రధాన సమస్య.. వెస్ట్రన్‌ టాయిలెట్‌పైన ఉండే మూతను తెరిచి ఉంచడం. దీనివల్ల బాత్‌రూమ్‌లో ప్రమాదకరమైన బ్యాక్టీరియా పెరిగే అవకాశం ఉంటుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు.

అలాగే బాత్‌రూమ్‌లోకి వెళ్లే సమయంలో కచ్చితంగా చెప్పులు ధరించాలని నిపుణులు చెబుతున్నారు. లేకపోతే ఫంగల్ ఇన్ఫెక్షన్, అథ్లెట్స్ ఫుట్, అరికాళ్ళపై మొటిమలు, స్టెఫిలోకాకల్ ఇన్ఫెక్షన్ వంటి సమస్యలు ఏర్పడే అవకాశం ఉంటుంది. ఇక మనలో చాలా మంది చేసే తప్పుల్లో మరొకటి తడి టవల్‌ను బాత్‌రూమ్‌ లోపల ఉంచడం. ఇలా చేయడం వల్ల టవల్‌పై త్వరగా బ్యాక్టీరియా పేరుకు పోతుంది. ముఖ్యంగా శిలీంధ్రాలు లాంటి సూక్ష్మ జీవులు పెరుగుతాయి. ఇలాంటి టవల్‌ను ఉపయోగిస్తే శరీరంపై దురద, ఇన్ఫెక్షన్‌ వంటి చర్మ సంబంధిత వ్యాధులు వచ్చే అవకాశం పెరుగుతుంది. కాబట్టి టవల్‌ను బాత్‌రూమ్‌లో ఉంచకూడదు. అలాగే.. కనీసం రెండు రోజులకు ఒకసారైనా టవల్‌ను శుభ్రంగా ఉతుక్కొని, ఎండలో ఆరబెట్టాలి.

నోట్: పైన తెలిపిన విషయాలు కేవలం ప్రాథమిక సమాచారం మేరకు మాత్రమే. ఆరోగ్యానికి సంబంధించి వైద్యుల సూచనలు పాటించడమే ఉత్తమం.

మరిన్ని లైఫ్‌ స్టైల్ వార్తల కోసం క్లిక్‌ చేయండి..

బాత్‌రూమ్‌లో తడి టవల్‌ పెడుతున్నారా.? ఏమవుతుందో తెలుసా..
బాత్‌రూమ్‌లో తడి టవల్‌ పెడుతున్నారా.? ఏమవుతుందో తెలుసా..
కృష్ణుడు ఏలిన ద్వారకలో జన్మాష్టమి వేడుకలు వెరీ వెరీ స్పెషల్..
కృష్ణుడు ఏలిన ద్వారకలో జన్మాష్టమి వేడుకలు వెరీ వెరీ స్పెషల్..
పెంపుడు కుక్కకు రాఖీ కట్టిన చిన్నారి.. వీడియో
పెంపుడు కుక్కకు రాఖీ కట్టిన చిన్నారి.. వీడియో
సోషల్ మీడియా పాపులారిటీ కోసం ఇదంతా దారుణమా!
సోషల్ మీడియా పాపులారిటీ కోసం ఇదంతా దారుణమా!
తగ్గేదేలే.. మూడు ముంగిసలతో ఏకకాలంలో పాము పోరాటం.. వీడియో వైరల్
తగ్గేదేలే.. మూడు ముంగిసలతో ఏకకాలంలో పాము పోరాటం.. వీడియో వైరల్
రాఖీ వేళ కిక్కిరిస బస్సులు.. రికార్డు స్థాయిలో ప్రయాణికులు..
రాఖీ వేళ కిక్కిరిస బస్సులు.. రికార్డు స్థాయిలో ప్రయాణికులు..
భయానక వీడియో.. వైద్య పరీక్షలు చేస్తుండగానే ముంచుకొచ్చిన మృత్యువు
భయానక వీడియో.. వైద్య పరీక్షలు చేస్తుండగానే ముంచుకొచ్చిన మృత్యువు
నీట మునిగిన చైతన్యపురి పోలీస్ స్టేషన్
నీట మునిగిన చైతన్యపురి పోలీస్ స్టేషన్
టోపీలో వజ్రం, ముత్యాలు లేవు కొట్లలో అమ్మకం దీని ప్రత్యేక ఏమిటంటే
టోపీలో వజ్రం, ముత్యాలు లేవు కొట్లలో అమ్మకం దీని ప్రత్యేక ఏమిటంటే
మలయాళ సినిమా ఇండస్ట్రీలో ఇంత జరుగుతోందా? వెలుగులోకి సంచలన విషయాలు
మలయాళ సినిమా ఇండస్ట్రీలో ఇంత జరుగుతోందా? వెలుగులోకి సంచలన విషయాలు