Bike Stunts: సోషల్ మీడియాలో హైప్ కోసం యువత దిగజారుడు.. బురఖా ధరించి బైక్ స్టంట్..!

హైదరాబాద్ పాతబస్తీ సౌత్ ఈస్ట్ జోన్ పోలీస్ స్టేషన్ల పరిధిలో కొందరు యువత ఆగడాలు మితిమిరిపోతున్నాయి. తాజాగా పలువురు యువత సోషల్ మీడియాలో లైక్‌లు, ఫాలోయర్స్ పెంచుకోవడానికి వింత వేశాలు వేస్తున్నారు.

Bike Stunts: సోషల్ మీడియాలో హైప్ కోసం యువత దిగజారుడు.. బురఖా ధరించి బైక్ స్టంట్..!
Bike Stunt
Follow us
Noor Mohammed Shaik

| Edited By: Balaraju Goud

Updated on: Aug 20, 2024 | 9:38 AM

హైదరాబాద్ పాతబస్తీ సౌత్ ఈస్ట్ జోన్ పోలీస్ స్టేషన్ల పరిధిలో కొందరు యువత ఆగడాలు మితిమిరిపోతున్నాయి. తాజాగా పలువురు యువత సోషల్ మీడియాలో లైక్‌లు, ఫాలోయర్స్ పెంచుకోవడానికి వింత వేశాలు వేస్తున్నారు. ఈ క్రమంలోనే ఓ గ్యాంగ్ బుర్ఖా ధరించి బైక్ స్టంట్స్ చేసి వీడియోలను సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. స్టంట్స్ చేస్తున్న వీడియోలు నెట్టింట వైరల్ అయ్యాయి.

ప్రమాదకర విన్యాసాలు చేస్తూ ప్రజలను భయభ్రాంతులకు గురిచేసిన వీడియోలు పోలీసులకు చేరాయి. వీడియోలో స్టంట్స్ చేసిన యువకులను అదుపులోకి తీసుకున్న ఐఎస్ సదన్ పోలీసులు అరెస్టు కేసు నమోదు చేస్తున్నారు. యువకుల బైక్స్ స్వాధీనం చేసుకున్నారు. ప్రజలకు ఇబ్బంది కలిగేలా ఎవరు ప్రవర్తించినా కఠినంగా వ్యవహరిస్తామని హెచ్చరించారు.

కంట్రోల్ యువర్‌సెల్ఫ్ కాదు.. కంట్రోల్ అవర్‌సెల్ఫ్. మన బుర్రల్ని మనం కడుక్కోవాల్సిన అవసరం కూడా ఉందిక్కడ. ఎవర్రా మీరంతా.. అని వాళ్లను నిలదియ్యడం కాదు.. వాళ్ల ట్రాప్‌లో పడి, వాళ్లిచ్చే కంటెంట్‌కి బానిసలుగా మారి, వాళ్లను లైకులతో సత్కరించే మనోళ్లది కూడా తప్పే. సో.. ఎవరికివాళ్లు ఆత్మపరిశీలన చేసుకుని, వ్యూస్‌తో ఎగదొయ్యడాలు ఆపితేనే సోషల్ మీడియా అరాచకం ఆగిపోయే ఛాన్సుంది. దీంతో పాటు.. కొత్తగా అమల్లోకొచ్చిన చట్టాల ఇలాంటి వారి భరితం పట్టేందుకు సిద్ధంగా ఉన్నాయి.

మరిన్ని హ్యుమన్ ఇంట్రెస్ట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..