భోజనం తర్వాత మజ్జిగ తాగితే బోలెడు లాభాలు..

Jyothi Gadda

19 August 2024

భోజనం తర్వాత మజ్జిగను తీసుకోవడం వల్ల జీర్ణక్రియలు సాఫీగా సాగడంతోపాటు, అసిడిటీని నివారిస్తుంది. మజ్జిగలో ప్రొబయాటిక్ పుష్కలంగా ఉంటుంది. ఇది మన పేగులకు ఎంతో మంచి చేస్తుంది. 

మజ్జిగలో మిరియాల పొడి, ధనియాల పొడి, ఎండబెట్టిన అల్లం పౌడర్ వేసుకుని తాగటం మరీ మంచిది. మజ్జిగ తీసుకోవడం వల్ల ప్రొటీన్, క్యాల్షియం, పొటాషియం, విటమిన్ బీ12, ప్రొబయాటిక్ అందుతాయి.

వీటితో వ్యాధి నిరోధక శక్తి బలపడుతుంది. బరువు తగ్గాలని అనుకునే వారికి మజ్జిగ మంచి ఔషధం అవుతుంది. బరువు తగ్గాలనుకునేవారు పెరుగుకు బదులు మజ్జిగ వాడుకోవాలి. 

ఆరోగ్యానికి మంచి చేసే బ్యాక్టీరియా, ల్యాక్టిక్ యాసిడ్ ఉండడంతో జీర్ణక్రియలకు మేలు జరుగుతుంది. ఇర్రిటబుల్ బవెల్ సిండ్రోమ్ తో బాధపడే వారికీ మజ్జిగతో మంచి ఫలితాలు ఉంటాయి

యాసిడ్ రిఫ్లక్స్ సమస్యతో బాధపడే వారికి మజ్జిగతో మంచి ఉపశమనం లభిస్తుంది. జీర్ణాశయంలోని గోడల లైనింగ్ ఇరిటేషన్ ను తగ్గిస్తుంది. దీంతో మలబద్ధకం సమస్య నుంచి ఉపశమనం లభిస్తుంది.

మజ్జిగ జీర్ణక్రియలో సహాయపడుతుంది, అందులోని యాసిడ్ కారణంగా అది మీ పొట్టను క్లియర్ చేస్తుంది. రెగ్యులర్‌గా తీసుకోవడం వల్ల ఇరిటబుల్ బవెల్ సిండ్రోమ్ వంటి జీర్ణ రుగ్మతలను తగ్గించవచ్చు.

మజ్జిగ తీసుకోవడం వల్ల శరీరంపై ప్రత్యేకించి జీర్ణవ్యవస్థపై శీతలీకరణ ప్రభావాన్ని అందిస్తుంది, యాసిడ్ రిఫ్లక్స్ కారణంగా కడుపు లైనింగ్‌లో ఏర్పడే చికాకును తగ్గిస్తుంది.

ఆరోగ్యకరమైన ప్రేగు బలమైన రోగనిరోధక శక్తికి పునాది. మజ్జిగ ఆరోగ్యకరమైన పేగుకు అవసరమయ్యే పోషణ అందిస్తుంది. ఇది జీర్ణక్రియ నుండి రోగనిరోధక శక్తి వరకు అన్నింటిని సెట్ చేస్తుంది.