పెరుగుతున్న ఊబకాయం రొమ్ము క్యాన్సర్‌కు కారణమవుతుందా? 

19 August 2024

TV9 Telugu

భారతదేశంలో ప్రతి సంవత్సరం రొమ్ము క్యాన్సర్ కేసులు పెరుగుతున్నాయి. ఇది మహిళల్లో అత్యంత సాధారణ క్యాన్సర్ గా మారడమే కాదు దీని కేసులు ప్రతి ఏడాది పెరుగుతున్నాయి.

 రొమ్ము క్యాన్సర్

ఇప్పుడు వయసుతో సంబంధం లేకుండా చిన్న వయసులోనే బ్రెస్ట్ క్యాన్సర్ వస్తోంది. 28 నుండి 35 సంవత్సరాల వయస్సులో ఈ వ్యాధి బారిన పడుతున్నారు. చాలా కేసులు చివరి దశలో బయటపడుతున్నాయి. 

చిన్న వయస్సులో కూడా 

తప్పుడు ఆహారపు అలవాట్లు. చెడిపోయిన జీవనశైలి, ఆలస్యంగా వివాహం రొమ్ము క్యాన్సర్‌కు ప్రధాన కారణాలు. ఒకొక్కసారి జన్యుపరంగా కూడా ఈ వ్యాధి రావచ్చు.

 రొమ్ము క్యాన్సర్ ఎందుకు వస్తుంది?

 స్థూలకాయం పెరగడం వల్ల క్యాన్సర్ ముప్పు పెరుగుతుందని నిపుణులు చెబుతున్నారు. ఊబకాయం ఉన్న అమ్మాయిల్లో బ్రెస్ట్ క్యాన్సర్ వచ్చే ప్రమాదం ఎక్కువగా ఉందా? 

 ఊబకాయం వల్ల ప్రమాదమా

 ఊబకాయం పెరగడం వల్ల క్యాన్సర్ వచ్చే ప్రమాదం ఉందని క్యాన్సర్ సర్జన్ డాక్టర్ అన్షుమన్ కుమార్ చెబుతున్నారు. అయితే ఊబకాయం వల్ల బ్రెస్ట్ క్యాన్సర్ వస్తుందని స్పష్టంగా చెప్పలేమని అన్నారు.

క్యాన్సర్

తల్లి రొమ్ము క్యాన్సర్‌తో బాధ పడితే.. అప్పుడు వారసత్వంగా వారి పిల్లలకు బెస్ట్ క్యాన్సర్ వచ్చే ప్రమాదం ఎక్కువగా ఉంటుంది. చెడు జీవనశైలి ఉన్న స్త్రీలు కూడా ఈ క్యాన్సర్ బారిన పడవచ్చు

 ఎవరికి ఎక్కువ ప్రమాదం అంటే 

 రొమ్ము క్యాన్సర్‌ను నివారించడానికి 30 ఏళ్ల తర్వాత క్యాన్సర్ స్క్రీనింగ్ చేయించుకోవడం చాలా ముఖ్యం. తినే ఆహారం విషయంలో జాగ్రత్తలు తీసుకోవాలి. జీవనశైలిని సరిగ్గా ఉంచుకోవాలి.

ఎలా రక్షించుకోవాలంటే