Viral Video: పెంపుడు కుక్కే సోదరుడైన వేళ… పెట్ డాగ్‌కు రాఖీ కట్టిన చిన్నారి

రాఖీ పర్వదినాన్ని పురస్కరించుకొని తమ పెంపుడు కుక్కే సోదరుడిగా... భావించిన ఓ చిన్నారి రాఖీ కట్టి దానిపై అభిమానాన్ని చాటుకుంది. ఖమ్మం జిల్లా ఖమ్మం రూరల్ మండలంలోని వరంగల్ క్రాస్ రోడ్డుకు చెందిన పేర్ల శ్రీను (ఆనంద్) రెండు సంవత్సరాల క్రితం... డాబర్మాన్ జాతికి చెందిన ఓ మొగ కుక్క పిల్లను హైదరాబాదులో కొనుక్కొన్నాడు. అనంతరం దానిని తన ఇంటికి తెచ్చుకున్నాడు...

Follow us

| Edited By: Srilakshmi C

Updated on: Aug 20, 2024 | 9:42 AM

ఖమ్మం, ఆగస్టు 20: రాఖీ పర్వదినాన్ని పురస్కరించుకొని తమ పెంపుడు కుక్కే సోదరుడిగా… భావించిన ఓ చిన్నారి రాఖీ కట్టి దానిపై అభిమానాన్ని చాటుకుంది. ఖమ్మం జిల్లా ఖమ్మం రూరల్ మండలంలోని వరంగల్ క్రాస్ రోడ్డుకు చెందిన పేర్ల శ్రీను (ఆనంద్) రెండు సంవత్సరాల క్రితం… డాబర్మాన్ జాతికి చెందిన ఓ మొగ కుక్క పిల్లను హైదరాబాదులో కొనుక్కొన్నాడు. అనంతరం దానిని తన ఇంటికి తెచ్చుకున్నాడు. ఆ కుక్కకు రాఖీ అనే పేరు పెట్టుకుని, ఇంట్లో సభ్యురాలిగా ఎంతో ప్రేమగా పెంచసాగారు. శ్రీను ఇద్దరు పిల్లలతో సమానంగా రాఖీని కూడా ఎంతో అల్లారు ముద్దుగా పెంచుకుంటున్నాడు. ప్రతి పండగకి తన ఇద్దరు పిల్లలతో పాటు రాఖి (కుక్క )కూడా కొత్త బట్టలు కొనేవాడు. కుటుంబ సభ్యులతోపాటు దానికి కూడా బట్టలు తీసుకొని వాటిని ప్రత్యేకంగా కుట్టించి.. కుక్కకు తొడిగించి జంతు ప్రేమను చాటుకునేవాడు

అయితే సోమవారం రాఖీ పండగ కావడంతో.. శ్రీను తన కుమార్తెతో తన కుమారులతో పాటు రాఖి కుక్కకు కూడా రాఖీ కట్టి కుక్కపై తమకున్న అభిమానాన్ని మరోమారు చాటిచెప్పాడు. ఆ కుక్క సైతం వారి కుటుంబ సభ్యుడిగా కలిసిపోతూ అందరినీ ఆశ్చర్యానికి గురిచేస్తుండటం విశేషం.

ఇవి కూడా చదవండి

మరిన్ని తెలంగాణ వార్తల కోసం క్లిక్‌ చేయండి.