కొంపముంచిన మార్షల్ లా.. పదవి పోయి, జైలుపాలైన దక్షిణ కొరియా మాజీ అధ్యక్షులు..!

మార్షల్‌ లా ఉత్తర్వులు జారీ చేసి దేశాన్ని సంక్షోభంలోకి నెట్టినందుకు యోల్‌కు వ్యతిరేకంగా విపక్షాలు పార్లమెంట్‌లో అభిశంసన తీర్మానం ప్రవేశపెట్టాయి. తీర్మానానికి అనుకూలంగా 204 మంది ఓటేయగా.. 85 మంది మాత్రమే యోల్‌కు సపోర్ట్ చేశారు. దీంతో ఆయన అభిశంసనకు గురై అధ్యక్ష అధికారాలను కోల్పోయారు.

కొంపముంచిన మార్షల్ లా.. పదవి పోయి, జైలుపాలైన దక్షిణ కొరియా మాజీ అధ్యక్షులు..!
South Korean President Yoon Suk Yeol
Follow us
Balaraju Goud

|

Updated on: Jan 15, 2025 | 10:25 AM

చేసుకున్నవారికి చేసుకున్నంత మహదేవ అని ఊరికే అనలేదు. దేశంలో ఎమెర్జెన్సీ ప్రకటించి చెడ్డపేరు తెచ్చుకున్న దక్షిణ కొరియా మాజీ అధ్యక్షుడు యూన్‌ సుక్‌ యోల్‌ అరెస్ట్ అయ్యారు. దేశంలో మార్షల్‌ లా విధించి చట్టాన్ని ఉల్లంఘించినందుకు దక్షిణ కొరియా మాజీ అధ్యక్షుడు యూన్‌ సుక్‌ యోల్‌ను అరెస్ట్ చేశారు అధికారులు. బుధవారం(జనవరి 15) ఉదయం వందలాది మంది దర్యాప్తు అధికారులు, పోలీసులు దక్షిణ కొరియా అధ్యక్ష నివాసానికి వెళ్లారు. అధ్యక్ష భవనం భద్రతా దళాలు పోలీసులను అడ్డుకోవడంతో కాసేపు ఉద్రిక్త వాతావరణం ఏర్పడింది. తర్వాత దర్యాప్తు అధికారులు అధ్యక్ష నివాసం లోపలికి వెళ్లి యూన్‌ సుక్‌ యోల్‌ను అదుపులోకి తీసుకున్నారు. భారీ భద్రత నడుమ యోల్‌ను తరలించారు. గతంలో యోల్‌ను అరెస్టు చేసేందుకు ప్రయత్నించి విఫలమైన పోలీసులు.. ఈసారి 3 వేల 500 మంది ఫోర్స్‌తో వెళ్లి యూన్‌ సుక్‌ యోల్‌ను అరెస్ట్ చేశారు.

అటు యోల్ అరెస్టును నిరసిస్తూ ఆయన మద్దతుదారులు రోడ్డెక్కారు. పోలీసులను అడ్డుకున్నారు. తక్షణమే యోల్‌ను విడుదల చేయాలని డిమాండ్ చేశారు. విపక్షాలు దేశ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్నాయని ఆరోపిస్తూ.. డిసెంబరులో ఎమర్జెన్సీ మార్షల్‌ చట్టాన్ని విధించారు దక్షిణ కొరియా అధ్యక్షుడు. మార్షల్‌ లా’ అమలును వ్యతిరేకిస్తూ తీర్మానం తీసుకురాగా.. పార్లమెంట్‌ ఏకగ్రీవంగా ఆమోదించింది. కానీ మార్షల్‌ లా అమలు చట్టవిరుద్ధం అంటూ స్పీకర్‌ ప్రకటించారు. దీనిపై తీవ్ర వ్యతిరేకత రావడంతో యూన్‌ సుక్‌ తన ప్రకటనను విరమించుకున్నారు. అయినా సరే ఆయన పదవికి రాజీనామా చేయాలని ప్రతిపక్షాలు డిమాండ్‌ చేశాయి.

మార్షల్‌ లా ఉత్తర్వులు జారీ చేసి దేశాన్ని సంక్షోభంలోకి నెట్టినందుకు యోల్‌కు వ్యతిరేకంగా విపక్షాలు పార్లమెంట్‌లో అభిశంసన తీర్మానం ప్రవేశపెట్టాయి. తీర్మానానికి అనుకూలంగా 204 మంది ఓటేయగా.. 85 మంది మాత్రమే యోల్‌కు సపోర్ట్ చేశారు. దీంతో ఆయన అభిశంసనకు గురై అధ్యక్ష అధికారాలను కోల్పోయారు. అత్యవసర పరిస్థితి విధించడంపై విచారించేందుకు దర్యాప్తు అధికారులు యోల్‌కు సమన్లు జారీ చేశారు. సమన్లకు యోల్ స్పందించకపోవడంతో కోర్టును ఆశ్రయించగా.. అరెస్టు వారెంట్‌ జారీ చేసింది కోర్టు. దీంతో నేడు యోల్‌ను అరెస్ట్ చేశారు పోలీసులు.

మరిన్ని అంతర్జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.. 

హిజాబ్‌లో దర్శనమిచ్చిన ప్రముఖ హీరోయిన్.. షాక్‌లో ఫ్యాన్స్..వీడియో
హిజాబ్‌లో దర్శనమిచ్చిన ప్రముఖ హీరోయిన్.. షాక్‌లో ఫ్యాన్స్..వీడియో
అత్యవసర పరిస్థితి విధించినందుకు అరెస్ట్..!
అత్యవసర పరిస్థితి విధించినందుకు అరెస్ట్..!
రణ్‌బీర్‌తో ఉన్న ఈ చిన్నారి ఇప్పుడు క్రేజీ హీరోయినా.?
రణ్‌బీర్‌తో ఉన్న ఈ చిన్నారి ఇప్పుడు క్రేజీ హీరోయినా.?
ఎండుద్రాక్షను పాలలో నానబెట్టి తింటే అద్భుత ప్రయోజనాలు.. తెలిస్తే
ఎండుద్రాక్షను పాలలో నానబెట్టి తింటే అద్భుత ప్రయోజనాలు.. తెలిస్తే
"సచిన్ కో బోలో": యోగరాజ్ వ్యాఖ్యలతో క్రికెట్ లో కొత్త చర్చలు
అబార్షన్‌తో కన్నీరు మున్నీరైన టాలీవుడ్ యాంకర్.. వీడియో
అబార్షన్‌తో కన్నీరు మున్నీరైన టాలీవుడ్ యాంకర్.. వీడియో
భారత క్రికెట్ జట్టులో మంటలు: గంభీర్ ధోరణి పై చర్చలు
భారత క్రికెట్ జట్టులో మంటలు: గంభీర్ ధోరణి పై చర్చలు
ముఖానికి అలోవెరా జెల్ రాసుకుని నిద్రపోతున్నారా..?ఏమవుతుందో తెలుసా
ముఖానికి అలోవెరా జెల్ రాసుకుని నిద్రపోతున్నారా..?ఏమవుతుందో తెలుసా
రికార్డ్ స్థాయిలో అమృత స్నానం ఆచరించిన భక్తులు
రికార్డ్ స్థాయిలో అమృత స్నానం ఆచరించిన భక్తులు
"కౌన్ హైన్?".. కపిల్ అంత మాట అంటాడని ఎవరు ఊహించలేదు..!