మెదడు ఆరోగ్యాన్ని కాపాడే డ్రింక్స్‌

Narender Vaitla

19 Aug 2024

మెదడు ఆరోగ్యాన్ని సంరక్షించడంలో దానిమ్మ రసం క్రీయాశీలకంగా ఉపయోగపడుతుంది. ఇది ఎర్ర రక్త కణాల పరిమానాన్ని పెంచి, మెదడు ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది.

ఆరెంజ్‌ కూడా మెదడుకు మేలు చేస్తుందని నిపుణులు చెబుతున్నారు. ఆరెంజ్‌ జ్యస్‌లోని మెదడులోని న్యూరోట్రాన్స్మిటర్ ఉత్పత్తిని పెంచడానికి సహాయపడుతుంది. 

బీట్‌ రూట్ రసం మెదడుకు రక్త ప్రసరణకు పెంచడానికి సహాయపడుతుంది. ఇది మెదడు కణాలకు పోషకాలు, ఆక్సిజన్‌ను అందిస్తుంది. మెదడు పనితీరును మెరుగుపరుస్తుంది.

ద్రాక్ష రసంలో శక్తివంతమైన యాంటీఆక్సిడెంట్లు ఉంటాయి. ఇవి మెదడు పనితీరు, జ్ఞాపకశక్తిని మెరుగుపరచడంలో సహాయపడతాయి. ఇది న్యూరోడెజెనరేటివ్‌ వ్యాధుల ప్రమాదాన్ని తగ్గిస్తుంది.

చెర్రీ జ్యూస్‌ కూడా మెదడు ఆరోగ్యాన్ని సంరక్షిస్తుంది. ఇందులోని యాంటీ ఆక్సిడెంట్లు, యాంటీ ఇన్‌ఫ్లమేటరీ లక్షణాలు జ్ఞాపకశక్తి ని మెరుగుపరచడంలో ఉపయోగపడుతుంది.

గ్రీన్‌ టీ మెదడు ఆరోగ్యాన్ని సంరక్షించడంలో ఉపయోగపడుతుంది. ఇందులోని యాంటీ ఆక్సిడెంట్స్‌ మెదడు ఆరోగ్యాన్ని కాపాడడంలో సహాయపడుతుంది.

పాలు, పసుపు కలుపుకొని తీసుకోవడం వల్ల కూడా మెదడు ఆరోగ్యం మెరుగవువుతందని నిపుణులు చెబుతున్నారు. వీటిలోని ఔషధ గుణాలు మెదడు ఆరోగ్యాన్ని సంరక్షిస్తాయి.

పైన తెలిపిన విషయాలు కేవలం ప్రాథమిక సమాచారం మేరకు మాత్రమే. ఆరోగ్యానికి సంబంధించి వైద్యుల సూచనలు పాటించడమే ఉత్తమం.