ఈ జాతీయ ఉత్తమ నటుడు.. ఒకప్పుడు మినరల్ వాటర్ అమ్మాడు !!
రోజుకు యాభై రూపాయలకు అసిస్టెంట్ డైరెక్టర్‌గా లొకేషన్‌లో ఎడిటర్, లైట్‌బాయ్, టచప్ మ్యాన్ ఇలా ఎవరు రాకపోయినా ఆ పనిని చేసారు. వాటర్ క్యాన్‌ల మార్కెటింగ్‌లో కొన్నాళ్లు పనిచేశాక హోటల్ బిజినెస్ చేసినా కలిసిరాలేదు. అప్పు ఇచ్చిన వారు ఎక్కడ ఎదురవుతారోనని మారువేషంతోనే బయట తిరిగేవారు. ఆయన ఎవరో కాదు తాజాగా ప్రకటించిన 70వ జాతీయ అవార్డుల్లో ఉత్తమ నటుడిగా నిలిచిన కన్నడ నటుడు రిషబ్ శెట్టి.
రోజుకు యాభై రూపాయలకు అసిస్టెంట్ డైరెక్టర్‌గా లొకేషన్‌లో ఎడిటర్, లైట్‌బాయ్, టచప్ మ్యాన్ ఇలా ఎవరు రాకపోయినా ఆ పనిని చేసారు. వాటర్ క్యాన్‌ల మార్కెటింగ్‌లో కొన్నాళ్లు పనిచేశాక హోటల్ బిజినెస్ చేసినా కలిసిరాలేదు. అప్పు ఇచ్చిన వారు ఎక్కడ ఎదురవుతారోనని మారువేషంతోనే బయట తిరిగేవారు. ఆయన ఎవరో కాదు తాజాగా ప్రకటించిన 70వ జాతీయ అవార్డుల్లో ఉత్తమ నటుడిగా నిలిచిన కన్నడ నటుడు రిషబ్ శెట్టి. ఆయన ఒడిదుడుకుల జీవన ప్రయాణంలో స్ఫూర్తిని నింపే అంశాలెన్నో ఉన్నాయి. రిషబ్‌ది కర్ణాటకలోని కెరాడి అనే పల్లెటూరు. మధ్యతరగతి కుటుంబం. అమ్మ హౌస్‌వైఫ్ నాన్న జ్యోతిష్కుడు. ఆయనకు ఓ అక్క, అన్న. అందరిలో చిన్నవాడు కావడంతో రిషబ్‌ని గారాబంగా పెంచారు. చదువులో కంటే అల్లరి, ఆటల్లోనే చురుగ్గా ఉండేవారు. జూడో పోటీల్లో పతకాలు సాధించారు. అది రిషబ్ తండ్రికి నచ్చేది కాదు. అక్కడే ఉంటే కొడుకు జులాయిగా మారతాడన్న భయంతో బెంగళూరుకు పంపించారు. నాన్న కోపంతో పంపించేసినా రిషబ్ మాత్రం ఆనందంలో మునిగిపోయాడు. రిషబ్ బాల్యంలో వారి ఊరు మొత్తంలో కరెంటూ, టీవీ ఉన్న ఇల్లు వాళ్లదే. దూరదర్శన్‌లో వచ్చే.. హీరో రాజ్‌కుమార్ పాటలను ఎక్కువగా చూసే రిషబ్‌కు నటుడు కావాలనే లక్ష్యానికి బీజం పడింది అక్కడే.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
టాక్స్ రీఫండ్ కోసం చూస్తుంటే.. ‘డిఫెక్టివ్ ఐటీఆర్’ నోటీస్ వచ్చిందా ??
సౌదీ యువరాజు సల్మాన్ ఆందోళన !! అలా చేస్తే.. నన్ను బతకనీయరు
Vakkaya: వాక్కాయ ప్రయోజనాలు తెలిస్తే అస్సలు వదలరు..
గజం భూమి ధర రూ.10 లక్షలు !! హైదరాబాద్‌లో భూమి ధర అక్కడే ఎక్కువ