Viral Video: కొండచిలువ ఆవులించడం మీరెప్పుడైనా చూశారా..? ఇదిగో వైరల్ వీడియో

పాముల ప్రవర్తన ఒక్కోసారి ఆశ్చర్యపరుస్తుంది. ఒక్కోసారి ఆకలితో పాములు.. ప్లాస్టిక్ డబ్బాలను, గాజు సీసాలను కూడా మింగడం వంటివి చేసి చిక్కుల్లో పడుతూ ఉంటాయి. అయితే పాము ఆవులించడం మీరు ఎప్పుడైనా చూశారా..?

Viral Video: కొండచిలువ ఆవులించడం మీరెప్పుడైనా చూశారా..? ఇదిగో వైరల్ వీడియో
Snake 'yawn'
Follow us

|

Updated on: Aug 20, 2024 | 1:03 PM

పాములు చాలా ప్రమాదకర అన్న జీవులు అన్న విషయం తెలిసిందే. ఒక్క కాటుతో ప్రాణాలను బలి తీసుకుంటాయి. అలా అని అన్ని పాములు ప్రమాదకరం కావు. అవి లేకపోతే జీవవైవిధ్యం కూడ దెబ్బతింటుంటంది. కాగా పాములకు సంబంధించిన వీడియోలు నిత్యం సోషల్ మీడియాలో వైరల్ అవుతూ ఉంటాయి. అవి ఇతర జీవులను వేటాడిన వీడియోలు, ముంగిస, గద్దలు వంటి వాటితో పోరాడిన వీడియోలు తరచుగా మనం ఇంటర్నెట్‌లో చూస్తూ ఉంటాం. చాలా అరుదుగా మాత్రమే వాటికి సంబంధించిన ఆశ్చర్యకర వీడియోలు బయటకు వస్తూ ఉంటాయి. మీరు ఇప్పటివరకు మనుషులు ఆవలించడం చూసి ఉంటారు. పాములు ఆవులించడం ఎప్పుడైనా చూశారా..? లేదు కదా.  మీ కోసం ఈ వీడియో తెచ్చాం. ఇందులో కొండచిలువ ఎలా ఆవులిస్తుందో మీరు చూడవచ్చు. పాము అరుదైన ప్రవర్తన సంబంధించిన వీడియోను  @AMAZlNGNATURE అనే ట్విట్టర్ ఖాతా నుంచి ట్విట్టర్ (ఎక్స్)లో షేర్ చేశారు. ఇప్పటికే దీనికి  11 మిలియన్లకు పైగా వ్యూస్ వచ్చాయి.

వీడియో దిగువన చూడండి…. 

క్లిప్‌లో, పాము నెమ్మదిగా నోరు తెరిచి, మనుషుల వలె ఆవులించడం మీరు చూడవచ్చు. పాముల వంటి జీవులు కూడా ఆవలిస్తాయా అని చాలామంది ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు.  “వావ్, నేను ఇంతకు ముందెన్నడూ ఇలాంటివి చూడలేదు! పాములు ఎప్పుడూ ఆశ్చర్యపరుస్తూనే ఉంటాయి.” అని ఓ నెటిజన్ వ్యాఖ్యానించాడు, ” ఈ వీడియో చూసి.. ఒకే సమయంలో గగుర్పాటు, ఆశ్చర్యానికి గురయ్యాయి. ప్రకృతి ఎంత గొప్పది” అని మరొకరు కామెంట్ పెట్టారు. “ఖచ్చితంగా నమ్మశక్యం కానిది! పాములు ఆవులించగలవని నాకు తెలియదు. ఈ అపూర్వ క్షణాన్ని పంచుకున్నందుకు ధన్యవాదాలు!” అని ఇంకో వ్యక్తి పేర్కొన్నారు.   “ఈ వీడియో చాలా బాగుంది! ఇలాంటి అరుదైన జంతు ప్రవర్తనలను చూడటం నాకు చాలా ఇష్టం. ఇది ప్రకృతి ఎంత వైవిధ్యంగా, అద్భుతంగా ఉందో గుర్తుచేస్తుంది.” అని మరో వ్యక్తి వ్యాఖ్యానించాడు.

మరిన్ని హ్యూమన్ ఇంటరెస్ట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..