Viral Video: కొడుకుపై కత్తులతో దాడికి తెగబడ్డ దుండగులు.. ఈ తల్లి ఏం చేసిందో చూడండి
మహారాష్ట్రలో పట్టపగలు కత్తితో దాడి చేసిన ముగ్గురు వ్యక్తులను తరిమికొట్టి ఓ మహిళ తన కుమారుడి ప్రాణాలను కాపాడింది. ఆదివారం మధ్యాహ్నం 1:30 గంటలకు కొల్హాపూర్‌లోని జైసింగ్‌పూర్ ప్రాంతంలో జరిగిన ఈ ఘటన సీసీటీవీ కెమెరాలో రికార్డైంది.

రోడ్డు పక్కన ఓ యువకుడు బైక్‌పై కూర్చుని.. తన తల్లితో మాట్లాడుతుంగా.. నలుగురు సాయుధులైన దుండగులు అతనిపై దాడికి యత్నించారు. వెంటనే అలర్టైన యువకుడి తల్లి.. తన ప్రాణాలను పణంగా పెట్టి కొడుకును కాపాడింది. ఈ ఘటనకు సంబంధించిన వీజువల్స్ మొత్తం సీసీటీవీలో రికార్డవ్వడంతో నెటిజన్లు ఆ తల్లి సాహసానికి ప్రశంసలు కురిపిస్తున్నారు. ఈ ఘటన ఆగస్టు 18వ తేదీ మధ్యాహ్నం 1:30 గంటలకు మహారాష్ట్ర కొల్హాపూర్‌లోని జైసింగ్‌పూర్ ప్రాంతంలో జరిగింది. ఆగస్ట్ 19న @gharkekalesh అనే ఎక్స్ ఖాతాలో షేర్ చేసిన ఈ వీడియోకి ఒక్క రోజులో 1 మిలియన్ కంటే ఎక్కువ వ్యూస్ వచ్చాయి.
వీడియోను దిగువన చూడండి:
A Man attacked the son, the mother ran after him with a stone in her hand, Mother chased away the goon for her son while risking her Own Life🫡, Kolhapur Maharashtra pic.twitter.com/9DPnKNA3gC
— Ghar Ke Kalesh (@gharkekalesh) August 19, 2024
వైరల్‌గా మారిన వీడియోలో, ఒక వ్యక్తి తన స్కూటీపై రోడ్డు పక్కన కూర్చుని తన తల్లితో మాట్లాడుతున్నట్లు చూడవచ్చు. కొంతసేపటికి ముగ్గురు వ్యక్తులు బైక్‌పై అక్కడికి వచ్చి పెద్ద తల్వార్‌తో దాడి చేయడంతో ఆ వ్యక్తి తృటిలో తప్పించుకున్నాడు. అక్కడే ఉన్న యువకుడి తల్లి దాడి చేసిన వారిపైకి విసిరేందుకు వెంటనే రాయిని అందుకోగా, వెంటనే ఆమె కుమారుడు కూడా చేరి దాడికి పాల్పడిన వారిని తరిమికొట్టడం వీడియోలో రికార్డైంది. తన ప్రాణాలను సైతం లెక్క చేయకుండా కొడుకును కాపాడుకునేందుకు ఆ తల్లి చేసిన సాహసాన్ని అందరూ ప్రశంసిస్తున్నారు. బిడ్డను కాపాడుకునేందుక తల్లి ఏ పరిస్థితుల్లోనూ వెనకంజ వేయదని కామెంట్స్ పెడుతున్నారు. వీడియోపై మీ అభిప్రాయాన్ని కూడా తెలియజేయండి.
కాగా దాడికి గురైన వ్యక్తిని సునీల్ రామప్ప లమానిగా గుర్తించారు. అతని ఫిర్యాదు మేరకు పోలీసులు ముగ్గురు నిందితులు వినోద్ కాసు పవార్, అరవింద్ కాసు పవార్, వినోద్ బాబు జాదవ్‌లపై కేసు నమోదు చేశారు.
మరిన్ని హ్యూమన్ ఇంటరెస్ట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..
