ఉద్యోగం నుంచి తీసేశారని.. సీఈవో పాస్‌పోర్ట్ కొట్టేశాడట
లేఆఫ్ ప్రకటించానన్న కోపంతో తన పాస్‌పోర్ట్‌ను మాజీ ఉద్యోగి ఒకరు దొంగలించారంటూ ఏకంగా ఓ కంపెనీ సీఈవో ఆరోపించారు. బెంగళూరుకు చెందిన స్టార్టప్ సార్థి ఏఐ సీఈవో ఈ ఆరోపణలు చేశారు. బెంగళూరుకు చెందిన సార్థి ఏఐను విశ్వనాథ్ ఝా స్థాపించారు. దానికి ఆయనే సీఈవోగా వ్యవహరిస్తున్నారు. గతేడాది నిర్వహించిన మాస్ లేఆఫ్‌లతో ఆ సంస్థ వార్తల్లో నిలిచింది.
లేఆఫ్ ప్రకటించానన్న కోపంతో తన పాస్‌పోర్ట్‌ను మాజీ ఉద్యోగి ఒకరు దొంగలించారంటూ ఏకంగా ఓ కంపెనీ సీఈవో ఆరోపించారు. బెంగళూరుకు చెందిన స్టార్టప్ సార్థి ఏఐ సీఈవో ఈ ఆరోపణలు చేశారు. బెంగళూరుకు చెందిన సార్థి ఏఐను విశ్వనాథ్ ఝా స్థాపించారు. దానికి ఆయనే సీఈవోగా వ్యవహరిస్తున్నారు. గతేడాది నిర్వహించిన మాస్ లేఆఫ్‌లతో ఆ సంస్థ వార్తల్లో నిలిచింది. సంస్థను లాభాల పట్టించేందుకే ఉద్యోగులను తొలగించాల్సి వచ్చిందని గతంలో విశ్వనాథ్ తెలిపారు. ఆ కఠిన నిర్ణయం వెనుక ఇన్వెస్టర్ల ఒత్తిడి ఉందని అన్నారు. తాజాగా మరో విషయం వెలుగులోకి వచ్చింది. ఓ కథనం ప్రకారం.. అమెరికా వీసాతో ఉన్న తన పాస్‌పోర్ట్‌ను ఉద్వాసనకు గురైన ఓ సీనియర్ ఉద్యోగి దొంగలించారని ఝా తెలిపారు. దీంతో స్టార్టప్‌కు నిధులు పొందేందుకు విదేశాలకు వెళ్లే అవకాశం లేకుండా పోయిందని తెలిపారు. అయితే ఇప్పుడు కొత్త పాస్‌పోర్ట్ వచ్చినప్పటికీ.. కొత్త యూఎస్ వీసా కోసం చాలాకాలం వేచి ఉండటం వల్ల సంస్థపై తీవ్ర ప్రభావం చూపిందన్నారు.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
బెంగళూరు ఎయిర్ పోర్టులో పెళ్ళికొడుకు తిప్పలు
అమెరికా నుంచి వచ్చి సర్పంచ్ ఎన్నికల్లో పోటీ!
సర్పంచ్‌గా నా భార్యను గెలిపించండి.. కటింగ్ ఫ్రీగా చేస్తా
రోడ్డు పక్కన గుట్టలు గుట్టలుగా కోడి గుడ్లు.. ఎగబడిన జనం
రోడ్డుపైన అప్పుడే పుట్టిన పసికందు..రాత్రంతా కాపాడిన వీధి శునకాలు
గ్లాస్ బ్రిడ్జ్ కోసం కైలాసగిరికి క్యూ కట్టిన పర్యాటకులు
బ్రహ్మంగారి కాలజ్ఞాన మహిమా..పుడుతూనే నోటిలో పళ్లతో శిశువు జననం

