అకస్మాత్తుగా నడుం పట్టేసి.. భరించలేని నొప్పి వేదిస్తుందా?
20 August 2024
TV9 Telugu
TV9 Telugu
అకస్మాత్తుగా రోడ్డుపై ఎక్కడైనా పడిపోతే.. చేతులు, కాళ్లలో, మోకాలికి భరించలేని నొప్పి సంభవిస్తుంది. ఈ నొప్పి రోజుల తరబడి వేధిస్తుంటుంది
TV9 Telugu
ఇలాంటి నొప్పులు ఇంటి నివారణ చిట్కాలతో ఉపశమనం పొందవు. దీంతో ఈ నొప్పుల కారణంగా రోజు వారీ జీవితం ప్రభావితం అవుతుంది. అలా కాకుండా నొప్పుల నుంచి త్వరగా ఉపశమనం పొందాలంటే ఈ చిట్కాలు పాటించండి
TV9 Telugu
నొప్పులు ఎక్కువగా ఉంటే, డాక్టర్ వద్దకు తప్పకుండా వెళ్లాలి. కానీ కొద్దిపాటి నొప్పులకు ఇంట్లో ప్రథమ చికిత్స చేసుకోవచ్చు. ఏదైనా ఆకస్మిక నొప్పి నుండి ఉపశమనం పొందడానికి నొప్పి ఉన్న ప్రదేశంలో ఐస్‌తో మసాజ్ చేయవచ్చు
TV9 Telugu
గాయం కారణంగా రక్తం గడ్డకట్టినట్లయితే, ఐస్ వెంటనే దానిని కరిగిపోయేలా చేస్తుంది. మోకాలి గాయం కారణంగా మంచం నుంచి లేవడం కష్టంగా ఉంటుంది. అలాగే నడుం నొప్పి కూడా ఓ పట్టాన తగ్గదు
TV9 Telugu
ఐస్‌తో ఇలాంటి నొప్పిని తగ్గించవచ్చు. వీలైనంత త్వరగా కాలుని కదిలించ కుండా ఉండటానికి ప్రయత్నించాలి. నొప్పి తగ్గిన తర్వాత అవసరమైతే నెమ్మదిగా కొన్ని తేలికపాటి వ్యాయామాలు చేస్తుండాలి
TV9 Telugu
అయితే ఎక్కువ ఒత్తిడికి గురిచేయకూడదు. మోకాలి నొప్పి నయం కావడానికి సమయం పడుతుంది. నొప్పి పూర్తిగా తగ్గే వరకు బరువైన వస్తువులను ఎత్తకపోవడం మంచిది
TV9 Telugu
అవసరమైతే తగినంత విశ్రాంతి తీసుకోవాలి. నొప్పి తగ్గాక సాధారణ పనులన్నీ చేసుకోవచ్చు. అన్ని చిట్కాలు పాటించినా నొప్పి తగ్గకపోతే, వెంటనే వైద్యుడిని సంప్రదించాలి
TV9 Telugu
ఒక్కోసారి నడుం నొప్పి అనగానే ముందుగా వెన్నెముక సమస్య ఉందేమో, కండరాలేవైనా దెబ్బతిన్నాయేమో అనే డౌట్ వస్తుంది. మానసిక ఒత్తిడితోనూ నడుం నొప్పి, మెడ నొప్పి, తల నొప్పులు వస్తాయట. కాబట్టి ఒత్తిడి అదుపులో ఉంచుకోవాలి