సీజనల్ వ్యాధులు రాకుండా ఉండాంటే విటమిన్ సి ఎక్కువగా ఉండే పండ్లను తీసుకోవాలి. ముఖ్యంగా నారింజ, జామకాయ, చెర్రీ, ఆల్ బుకరా, దానిమ్మ, బత్తాయి, బొప్పాయి, స్ట్రా బెర్రీస్, కివీ వంటి వాటిని తీసుకోవాలి.
ప్రతీ రోజూ ఉదయం నిమ్మరసం తీసుకోవడం వల్ల రోగ నిరోధక శక్తి పెరుగుతుంది. ముఖ్యంగా నిమ్మరసంలో తేనె కలుపుకొని తీసుకోవడం వల్ల వ్యాధులు దరిచేరకుండా ఉంటాయని నిపుణులు చెబుతున్నారు.
సీజనల్ వ్యాధుల బారిన పడకుండా ఉండాలంటే అల్లం, వెల్లులిని ఆహారంలో భాగం చేసుకోవాలి. ఇందులోని యాంటీ బ్యాక్టీరియల్, యాంటీ వైరల్, యాంటీ ఇన్ ఫ్లమేటరీ లక్షణాలు వ్యాధులు రాకుండా చేస్తాయి.
ఆకు కూరలను ఆహారంలో భాగం చేసుకోవడం వల్ల కూడా రోగ నిరోధక శక్తిని పెంచుకోవచ్చని నిపుణులు చెబుతున్నారు. ముఖ్యంగా పాలకూరను తీసుకోవడం వల్ల వ్యాధులకు చెక్ పెట్టొచ్చు.
రోగ నిరోధక శక్తిని పెంచడంలో టమాటో కూడా బాగా ఉపయోగపడుతుంది. ఇందులోని లైకోపీన్ శరీర కణాల్ని డ్యామేజ్ చేసే ఫ్రీరాడికల్స్‌తో పోరాడుతుంది. అలాగే ఇందులోని విటమిన్ సి వ్యాధులకు చెక్ పెడుతుంది.
సీజన్ మారిన సమయంలో వచ్చే వ్యాధులకు చెక్ పెట్టడంలో క్యారెట్ ఉపయోగపడుతుంది. క్యారట్‌లో లభించే విటమిన్ సి వ్యాధులకు చెక్ పెట్టడంలో సహాయపడుతుంది.
వాతావరణం చల్లగా ఉంటే పెరుగు తీసుకోకూడదని భావిస్తాం. అయితే పెరుగును క్రమం తప్పకుండా తీసుకుంటే రోగనిరోధక శక్తిని మెరుగుపరచడంలో సహాయపడుతుంది.
పైన తెలిపిన విషయాలు కేవలం ప్రాథమిక సమాచారం మేరకు మాత్రమే. ఆరోగ్యానికి సంబంధించి వైద్యుల సూచనలు పాటించడమే ఉత్తమం.