Health Tips: ఆయుర్వేద చిట్కా! స్నానం చేసే నీళ్లలో ఇది కాస్త కలిపారంటే..

వర్షం కురుసినా, చలిగా అనిపించినా చాలా మంది స్నానం చేయరు. స్నానం చేస్తే జలుబు చేస్తుందని భావిస్తారు. కానీ ఇది సరైన పద్ధతి కాదు. క్రమం తప్పకుండా..

Health Tips: ఆయుర్వేద చిట్కా! స్నానం చేసే నీళ్లలో ఇది కాస్త కలిపారంటే..
Salt Water Bath
Follow us

|

Updated on: Aug 24, 2022 | 11:32 AM

Salt Water Bath Benefits in Telugu: ఆరోగ్యంగా, శుభ్రంగా ఉండాలంటే రోజూ స్నానం తప్పనిసరి. ఎంత బిజీగా ఉన్న రోజూ స్నానం చేయకపోతే చిరాగ్గా ఉంటుంది. మైండ్‌ కూడా ఫ్రెష్‌గా అనిపించదు. వర్షం కురుసినా, చలిగా అనిపించినా చాలా మంది స్నానం చేయరు. స్నానం చేస్తే జలుబు చేస్తుందని భావిస్తారు. కానీ ఇది సరైన పద్ధతి కాదు. క్రమం తప్పకుండా గోరువెచ్చని నీటితో స్నానం చేస్తే ఎటువంటి అనారోగ్య సమస్యలు దరిచేరవు. స్నానం చేసే నీటిలో కాస్త ఉప్పు వేస్తే శరీరంపై పేరుకుపోయిన మురికి అంతా శుభ్రంగా వదిలి, తాజాగా అనిపిస్తుంది. ఆయుర్వేద వైద్యుడు శరద్ కులకర్ణి ఉప్పు వేసిన నీటితో స్నానం చేయడం వల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాలు ఏమిటో వివరించారు. అవేంటంటే.. మన శరీరంలోని రంధ్రాల ద్వారా చొచ్చుకుపోయే లక్షణం ఉప్పు కలిగి ఉంటుంది. అందువల్ల ఉప్పు కలిపిన నీటితో స్నానం చేస్తే అనేక వ్యాధుల నుంచి మనకు రక్షణ కల్పిస్తుంది.

స్నానం చేసే నీటిలో ఉప్పు ఎందుకు కలపాలంటే.. ఉప్పు కలిపిన నీటితో స్నానం చేస్తే మానసిక, శారీరక సమస్యలు దూరమవుతాయి. ఇది కొత్తగా చెబుతున్నదేం కాదు. ఎన్నో యేళ్లుగా మన పూర్వికులు ఆచరిస్తున్నదే. ఉప్పులో మెగ్నీషియం సల్ఫేట్ ఉంటుంది. ఇది వేడి నీటిలో సులభంగా కరుగుతుంది. బకెట్ గోరువెచ్చని నీళ్లలో స్పూన్‌ ఉప్పు కలిపి స్నానం చేయడం వల్ల కండరాల నొప్పులు తగ్గుతాయి. దాంతో పాటు శరీరంలో రక్తప్రసరణ కూడా బాగా జరుగుతుంది. అలాగే కమ్మని నిద్ర పడుతుంది. అలాగే రుమాటిజం, మోకాలు, వెన్నునొప్పితో బాధ పడేవారికి ఉప్పునీటి స్నానం ప్రభావవంతంగా పనిచేస్తుంది.

ఇవి కూడా చదవండి

అంతేకాకుండా ఉప్పు నీటిలో యాంటీ ఇన్‌ఫ్లమేటరీ గుణాలు ఉంటాయి. వివిధ బాక్టీరియల్ ఇన్ఫెక్షన్ల నుంచి శరీరాన్ని కాపాడుతుంది. ఫలితంగా శరీరం ఆరోగ్యంగా, శుభ్రంగా ఉంటుంది. అలాగే గోరువెచ్చని నీళ్లలో ఉప్పు కలిపి స్నానం చేయడం వల్ల ఒత్తిడి కూడా దూరమవుతుందని ఆయుర్వేద వైద్యుడు శరద్ కులకర్ణి సూచిస్తున్నారు. రోజంతటి వల్ల కలిగిన అలసట ఒక్క క్షణంలో పోతుంది. కాబట్టి మీరెప్పుడైన స్ట్రెస్‌ లేదా ఒత్తిడికి గురైతే ఉప్పునీటితో స్నానం చేయండి. చిటికెలో మీ ఒత్తిడి దూరం అయ్యి రాత్రంతా హాయిగా నిద్రపడుతుంది.