AP DSC Recruitment 2022: నేటి నుంచి ప్రారంభమైన ఏపీ డీఎస్సీ ఆన్‌లైన్‌ దరఖాస్తు ప్రక్రియ.. ఈ విషయాలు తెలుసుకోండి..

ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసిన 502 బ్యాక్ లాగ్ టీచర్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసిన సంగతి తెలిసిందే. ఈ పోస్టులకు ఆన్‌లైన్‌..

AP DSC Recruitment 2022: నేటి నుంచి ప్రారంభమైన ఏపీ డీఎస్సీ ఆన్‌లైన్‌ దరఖాస్తు ప్రక్రియ.. ఈ విషయాలు తెలుసుకోండి..
Ap Dsc Jobs
Follow us
Srilakshmi C

|

Updated on: Aug 24, 2022 | 8:48 AM

AP TET Cum TRT Limited Recruitment 2022 Notification: ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసిన 502 బ్యాక్ లాగ్ టీచర్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసిన సంగతి తెలిసిందే. ఈ పోస్టులకు ఆన్‌లైన్‌ ఫీజు చెల్లింపు ప్రక్రియ ఈ రోజు (ఆగస్టు 24, 2022) నుంచి ప్రారంభమవుతుంది. ఆన్‌లైన్‌ దరఖాస్తులు రేపటి (ఆగస్టు 24, 2022) నుంచి ప్రారంభమవుతాయి. గత డీఎస్సీలో వివిధ కేటగిరీల్లో మిగిలిపోయిన పోస్టులను ఈ నోటిఫికేషన్‌ ద్వారా భర్తీ చేయనున్నారు. మోడల్ స్కూల్స్‌లో 207 పోస్టులు, స్కూల్ ఎడ్యుకేషన్‌లో 199 పోస్టులు, మున్సిపల్ స్కూల్స్‌లో 15 పోస్టులు, స్పెషల్ టీచర్స్ 81 పోస్టులను టెట్ కం టీచర్‌ రిక్రూట్‌మెంట్‌ టెస్ట్‌ విధానంలో పరీక్షలను నిర్వహించి ఆయా పోస్టులకు అభ్యర్ధులను ఎంపిక చేయనున్నారు. సెకండరీ గ్రేడ్‌ టీచర్‌, స్కూల్‌ అసిస్టెంట్ ల్యాంగ్వేజెస్‌, స్కూల్‌ అసిస్టెంట్‌ (నాన్‌ ల్యాంగ్వేజెస్‌), స్కూల్‌ అసిస్టెంట్‌ స్పెషల్‌ ఎడ్యుకేషన్‌, టీఆర్టీ (ల్యాంగ్వేజెస్‌), టీఆర్టీ (నాన్‌ ల్యాంగ్వేజెస్‌), టీఆర్టీ (ఇంగ్లిష్‌ ల్యాంగ్వేజెస్‌ ప్రొఫిషియన్సీ టెస్ట్‌), పీఆర్టీ (ల్యాంగ్వేజెస్‌), పీఆర్టీ (నాన్‌ ల్యాంగ్వేజెస్‌), పీఆర్టీ (ఇంగ్లిష్‌ ల్యాంగ్వేజెస్‌ ప్రొఫిషియన్సీ టెస్ట్‌), మ్యూజిక్‌, ఆర్ట్‌ పోస్టులకు అక్టోబర్ 23 నుంచి రోజుకు రెండు సెషన్ల చొప్పున రాత పరీక్ష నిర్వహిస్తారు.

ముఖ్యమైన తేదీలు..

  • ఆన్‌లైన్‌ దరఖాస్తులు ప్రారంభ తేదీ: ఆగస్టు 25, 2022.
  • దరఖాస్తు రుసుము చెల్లింపులకు ప్రారంభ తేదీ: ఆగస్టు 24, 2022.
  • ఆన్‌లైన్‌ మాక్‌టెస్టులు ప్రారంభం: అక్టోబర్‌ 17, 2022 వ తేదీ నుంచి
  • హాల్‌టికెట్లు డౌన్‌లోడ్‌ తేదీ: అక్టోబర్‌ 6, 2022.
  • రాత పరీక్ష తేదీ: అక్టోబర్ 23, 2022 నుంచి ప్రారంభం
  • ప్రాథమిక ఆన్సర్‌ కీ విడుదల తేదీ: అక్టోబర్ 28, 2022.
  • తుది ఆన్సర్‌ కీ విడుదల తేదీ: నవంబర్‌ 2, 2022.
  • ఫలితాల ప్రకటన తేదీ: నవంబర్‌ 4, 2022.

పూర్తి సమాచారం కోసం క్లిక్ చేయండి.

ఇవి కూడా చదవండి

మరిన్ని తాజా విద్యా, ఉద్యోగ సమాచారం కోసం క్లిక్‌ చేయండి.