APSACS Recruitment 2022: టెన్త్‌ అర్హతతో గుంటూరు జిల్లా ఎయిడ్స్ కంట్రోల్ సొసైటీలో ఉద్యోగాలు.. నేరుగా ఇంటర్వ్యూ..

ఆంధ్రప్రదేశ్‌ వైద్య ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖకు చెందిన ఏపీ స్టేట్ ఎయిడ్స్ కంట్రోల్ సొసైటీ గుంటూరు జిల్లాలో (APSACS Guntur)..  ఒప్పంద ప్రాతిపదికన 41 మెడికల్ ఆఫీసర్, ఐసీటీసీ కౌన్సెలర్ తదితర..

APSACS Recruitment 2022: టెన్త్‌ అర్హతతో గుంటూరు జిల్లా ఎయిడ్స్ కంట్రోల్ సొసైటీలో ఉద్యోగాలు.. నేరుగా ఇంటర్వ్యూ..
Apsacs
Follow us
Srilakshmi C

|

Updated on: Aug 24, 2022 | 8:11 AM

APSACS Guntur Medical Officer Recruitment 2022: ఆంధ్రప్రదేశ్‌ వైద్య ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖకు చెందిన ఏపీ స్టేట్ ఎయిడ్స్ కంట్రోల్ సొసైటీ గుంటూరు జిల్లాలో (APSACS Guntur)..  ఒప్పంద ప్రాతిపదికన 41 మెడికల్ ఆఫీసర్, ఐసీటీసీ కౌన్సెలర్, ల్యాబ్ టెక్నీషియన్, స్టాఫ్ నర్స్, ఫార్మాసిస్ట్ తదితర పోస్టుల భర్తీకి అర్హులైన అభ్యర్ధుల నుంచి దరఖాస్తులు కోరుతూ నోటిఫికేషన్‌ విడుదల చేసింది. పోస్టును బట్టి పదోతరగతి/ఎంబీబీఎస్‌/బీఎస్సీ నర్సింగ్‌/యూజీ/డిప్లొమా లేదా తత్సమాన కోర్సులో ఉత్తీర్ణత సాధించి ఉండాలి. అలాగే సంబంధిత పనిలో అనుభవం కూడా ఉండాలి. దరఖాస్తుదారుల వయసు జులై 31, 2022 నాటికి 42 యేళ్లకు మించకుండా ఉండాలి. ఆసక్తి కలిగినవారు ఆఫ్‌లైన్‌ విధానంలో కింది అడ్రస్‌కు ఆగస్టు 27, 2022వ తేదీలోపు పోస్టు ద్వారా దరఖాస్తులు పంపించాలి. దరఖాస్తు రుసుముగా రూ.250లు తప్పనిసరిగా చెల్లించవల్సి ఉంటుంది. వికలాంగ అభ్యర్ధులకు ఫీజు మినహాయింపు వర్తిస్తుంది. విద్యార్హతలు, అనుభవం, ఇంటర్వ్యూ ఆధారంగా అభ్యర్ధుల ఎంపిక చేయడం జరుగుతుంది. ఎంపికైన వారికి పోస్టును బట్టి నెలకు రూ.18,000ల నుంచి రూ.72,000ల వరకు జీతంగా చెల్లిస్తారు.

అడ్రస్: District Medical and Health Officer, Shigapatalem, Guntur, Guntur District, AP.

పూర్తి సమాచారం కోసం క్లిక్ చేయండి.

ఇవి కూడా చదవండి

మరిన్ని తాజా విద్యా, ఉద్యోగ సమాచారం కోసం క్లిక్‌ చేయండి.