AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Dating Tips: అమ్మాయిని ఇంప్రెస్ చేయాలనుకుంటున్నారా..? ఇలా చేస్తే మిమ్మల్ని అస్సలు వదలరు..

ప్రేమ అనేది ఓ అందమైన అనుభూతి.. ఎవరైనా ఆ మాయలో పడాల్సిందే. అదే సమయంలో మనం ప్రేమించేవారికి కూడా మనం నచ్చాలని కోరుకుంటాం. దీని కోసం మీరు ప్రేమించే వారిని మీ వైపు ఆకర్షించడానికి ఎన్నో ప్రయత్నాలు చేయవచ్చు.

Dating Tips: అమ్మాయిని ఇంప్రెస్ చేయాలనుకుంటున్నారా..? ఇలా చేస్తే మిమ్మల్ని అస్సలు వదలరు..
Love
Shaik Madar Saheb
|

Updated on: Sep 01, 2022 | 9:54 PM

Share

Tips To Impress A Girl: మనందరికీ ఖచ్చితంగా అమ్మాయిలపై ఎంతోకొంత క్రష్ ఉంటుంది. ఏదో ఒక సమయంలో ప్రేమలో పడటం మాత్రం ఖాయం.. ప్రేమకు వయసుతో సంబంధం లేదు.. మంచి గుణం.. ఆకట్టుకునే అందం ఉంటే ఎవరైనా ఇట్టే కనెక్ట్ అవుతారు. ప్రేమ అనేది ఓ అందమైన అనుభూతి.. ఎవరైనా ఆ మాయలో పడాల్సిందే. అదే సమయంలో మనం ప్రేమించేవారికి కూడా మనం నచ్చాలని కోరుకుంటాం. దీని కోసం మీరు ప్రేమించే వారిని మీ వైపు ఆకర్షించడానికి ఎన్నో ప్రయత్నాలు చేయవచ్చు. ఈ విధంగానే మీరు కూడా ఒక అమ్మాయిని ఇంప్రెస్ చేయాలని ఆలోచిస్తున్నట్లయితే.. మీరు కొన్ని విషయాలలో జాగ్రత్త వహించాలి. ఎందుకంటే అమ్మాయిలను ఆకట్టుకోవడం అంత ఈజీ కాదు. మీరు ఒక అమ్మాయిని ఎలా ఇంప్రెస్ చేయవచ్చో ఇప్పుడు తెలుసుకుందాం..

ఈ మార్గాల్లో అమ్మాయిని ఆకట్టుకోండి..

జుట్టు – గడ్డం: అమ్మాయిలు మొదటగా జుట్టు, గడ్డం లాంటి వాటిని పరిశీలిస్తారు. మీ గడ్డాన్ని ఎలా ఉంచుకుంటున్నారు..? అనేది చాలా మంది అబ్బాయిలలో అమ్మాయిలు గమనిస్తారు. అవును, మీకు గడ్డం ఉంటే దానిని బాగా నిర్వహించాలి. మరోవైపు పొడవాటి జుట్టు ఉంటే.. జుట్టును శుభ్రంగా ఉంచాలి. పొరపాటున కూడా జుట్టును దువ్వడం మాత్రం మర్చిపోవద్దు.

ఇవి కూడా చదవండి

చేతులు: ఇది మీకు అసాధారణంగా లేదా వింతగా అనిపించవచ్చు. కానీ అమ్మాయిలు మీ చేతులను కూడా గమనిస్తారు. అవును మీరు మీ గోళ్లను శుభ్రంగా కత్తిరించుకోవాలి. ఇంకా చేతులు పొడిబారకుండా చూసుకోవాలి.

డ్రెస్సింగ్ విధానం: మీ డ్రెస్సింగ్ సెన్స్ అంటే మీరు వేసుకునే విధానం మంచిగా ఉండాలి. ఆకట్టుకునేలా డ్రెస్ సెన్స్ ఉండాలి. ఇది ఏ అమ్మాయినైనా ఇంప్రెస్ చేయగలదు. ఎందుకంటే చాలా మంది అమ్మాయిలు మీ డ్రెస్సింగ్ సెన్స్ ద్వారా మిమ్మల్ని అర్థం చేసుకుంటారు. కావున మీరు ఎవరినైనా ఆకట్టుకోవాలని లేదా ఆకర్షించాలని ఆలోచిస్తుంటే మీ డ్రెస్సింగ్ సెన్స్‌పై శ్రద్ధ వహించండి.

ఫిట్‌నెస్: ఫిట్‌నెస్ చాలా ముఖ్యం ఎందుకంటే అబ్బాయిలో అమ్మాయి మొదటగా గమనించేది మీరు మిమ్మల్ని మీరు ఫిట్‌గా ఉంచుకున్నారా లేదా అనేది. ఇందుకోసం వ్యాయామం చేయడం లేదా జిమ్‌కి వెళ్లడం ద్వారా ఫిట్ బాడీని పొందడంతో పాటు ఆరోగ్యంగా ఉండవచ్చు. ఈ పని ఒక అమ్మాయిని ఆకట్టుకోవడానికి బాగా సహాయం చేస్తుంది.

మరిన్ని లైఫ్ స్టైల్ వార్తల కోసం