AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

సమ్మర్‌ లో మీ అందం తగ్గకుండా ఉండాలంటే.. ఈ చిట్కా ఫాలో అవ్వండి..!

వేసవిలో ఎండ తీవ్రత ఎక్కువగా ఉండడం వల్ల ముఖం సహజంగా మెరిసే ప్రకాశాన్ని కోల్పోతుంది. ఎండలో తిరిగినప్పుడు చర్మం డల్ అయిపోవడం, ఎర్రబడటం, దెబ్బతినడం వంటివి జరుగుతుంటాయి. ఈ సమయంలో ముఖానికి సహజ రక్షణ ఇచ్చే ఇంటి చిట్కాలు చాలా ఉపయోగకరంగా ఉంటాయి. వాటిలో ముఖ్యమైనది పచ్చి పాల వాడకం. ఇది తక్కువ ఖర్చుతో ఎక్కువ ఫలితం ఇచ్చే పద్ధతి.

సమ్మర్‌ లో మీ అందం తగ్గకుండా ఉండాలంటే.. ఈ చిట్కా ఫాలో అవ్వండి..!
Anti Aging
Prashanthi V
|

Updated on: May 04, 2025 | 10:25 PM

Share

వేసవిలో చర్మం పొడిబారడం ఒక సాధారణ సమస్య. ఎక్కువ వేడి వల్ల తేమ పోయి చర్మం పొడిగా మారుతుంది. ఈ సమస్యను తగ్గించాలంటే పచ్చి పాలను ముఖానికి రాయడం చాలా మంచిది. ఇది సహజ మాయిశ్చరైజర్ లాగా పని చేస్తుంది. చర్మానికి తేమను అందించి ఫ్రెష్‌గా కనిపించేటట్లు చేస్తుంది. ప్రత్యేకంగా డ్రై స్కిన్ ఉన్నవాళ్లు ఈ పద్ధతిని రెగ్యులర్‌గా పాటిస్తే మంచి ఫలితం కనిపిస్తుంది.

వేడి వల్ల చర్మం గ్లో తగ్గిపోతుంది. దీన్ని తిరిగి పొందాలంటే పచ్చి పాలతో ఫేషియల్ చేయడం చాలా మంచి పరిష్కారం. పాలలో ఉండే లాక్టిక్ యాసిడ్ చర్మాన్ని మృదువుగా మార్చుతుంది. అలాగే ముఖంపై ఉన్న మచ్చలు, డార్క్ స్పాట్స్ తగ్గేందుకు సహాయపడుతుంది. పాలతో ముఖాన్ని తుడవడం ద్వారా చర్మం సహజ మెరుపు తిరిగి వస్తుంది.

వేసవిలో ఎక్కువగా చూసే సమస్యలలో ఒకటి చర్మం అలర్జీలు. ఈ సమస్య నుంచి ఉపశమనం పొందాలంటే కచ్చి పాల వాడకం చాలా సహాయకరంగా ఉంటుంది. పాలను ముఖానికి రాస్తే చర్మానికి చల్లదనాన్ని అందిస్తుంది. దీని వల్ల ఎండలో తిరిగిన తర్వాత వచ్చే ఇర్రిటేషన్ తగ్గుతుంది.

వయస్సు పెరిగే కొద్దీ ముఖంపై ముడతలు కనిపిస్తాయి. ఇవి తగ్గించేందుకు చాలా మంది ఎన్నో రకాల క్రీములు వాడుతుంటారు. కానీ పచ్చి పాలలో సహజంగా వృద్ధాప్య లక్షణాలను నెమ్మదిగా చేసే గుణాలుంటాయి. పాలలో ఉండే పోషకాలు చర్మ కణాలను ఉత్తేజితం చేసి ముఖానికి తాజా రూపం ఇస్తాయి. ఇది చర్మాన్ని యవ్వనంగా ఉంచేందుకు సహాయపడుతుంది.

ఈ పద్ధతిని ఇంట్లో సులభంగా పాటించవచ్చు. కొద్దిపాటి పచ్చి పాలను కాటన్ బాల్స్‌లో తడిపి ముఖానికి, మెడకు నెమ్మదిగా అప్లై చేయాలి. 5 నిమిషాలు ఆ పాలను ముఖంపై ఉండనివ్వాలి. ఆ తర్వాత చల్లటి నీటితో ముఖాన్ని కడగాలి. దీంతో ముఖానికి తక్షణ మెరుపు వస్తుంది.

ఇంకొక పద్ధతి ఫేస్ ప్యాక్ రూపంలో వాడటం. 1 చెంచా బేసన్, చిటికెడు పసుపు, కొద్దిపాటి పచ్చి పాలను కలిపి పేస్ట్‌లా తయారు చేసుకోవాలి. ఈ మిశ్రమాన్ని ముఖానికి అప్లై చేయాలి. 15 నిమిషాలు ఉంచిన తర్వాత చల్లటి నీటితో కడగాలి. ఇది ముఖాన్ని మృదువుగా, తెల్లగా మారుస్తుంది. ఈ చిట్కాను ఉపయోగించే ముందు చిన్న భాగంలో ప్యాచ్ టెస్ట్ చేయండి. చర్మంపై ఎలాంటి అలర్జీ ఉన్నా వెంటనే ఉపయోగించడం ఆపి వైద్యుడిని సంప్రదించండి.