మనం వంటల్లో వాడే ఆయిల్స్ అన్నీ మంచివికావట.. నిపుణులు ఏం చెబుతున్నారో తెలుసా..?
మన రోజు వంటల్లో నూనె తప్పనిసరి. కానీ కొన్ని నూనెలు ఆరోగ్యానికి మేలు చేయకుండా హానికరమవుతాయి. ఇవి శరీరంలో మంటలు, గుండె జబ్బులు, క్యాన్సర్ వంటి సమస్యలకు కారణమవుతాయి. అలాంటి ప్రమాదకరమైన వంట నూనెల గురించి ఇప్పుడు మనం వివరంగా తెలుసుకుందాం.

మనకు రోజువారీ వంటలలో నూనె చాలా అవసరం. అందుకోసం పొద్దుతిరుగుడు, సోయాబీన్, కనోలా వంటి వివిధ రకాల నూనెలు వాడుతున్నారు. కానీ నిపుణుల అభిప్రాయం ప్రకారం ఈ నూనెలు అన్ని ఆరోగ్యానికి మంచివి కావు. వాస్తవానికి కొన్నింటిని వంటకాలలో వాడటం ప్రమాదకరంగా కూడా మారొచ్చు.
శుద్ధి చేసిన పొద్దుతిరుగుడు నూనె.. ఈ నూనెలో ఒలీక్ ఆమ్లం ఎక్కువగా ఉంటే మంచిదే.. కానీ శుద్ధి చేసిన నూనెలో ఒమేగా-6 ఎక్కువగా ఉంటుంది. అధిక ఉష్ణోగ్రత వద్ద వేడి చేస్తే ఇది విషంగా మారుతుంది. అధిక వేడి వల్ల దీనిలో ఫ్రీ రాడికల్స్, ఆల్డిహైడ్లు వంటి హానికరమైన పదార్థాలు తయారవుతాయి. ఇవి గుండె సమస్యలు, క్యాన్సర్‌కి దారితీస్తాయి.
సోయాబీన్ నూనె.. ఇది హెక్సేన్ అనే రసాయనాన్ని ఉపయోగించి తయారు చేస్తారు. ఈ విధానం పోషకాలను పూర్తిగా తగ్గిస్తుంది. దానికితోడు ఇందులో ఒమేగా-6 ఎక్కువగా ఉండటంతో శరీరంలో మంటకు దారి తీస్తుంది. ఎక్కువ వేడి చేస్తే హానికరమైన పదార్థాలు తయారవుతాయి.
కనోలా నూనె.. రాప్సీడ్ విత్తనాల నుంచి తీసే ఈ నూనె జన్యుపరంగా మార్చబడింది. అధిక ఉష్ణోగ్రత వద్ద ప్రాసెస్ చేస్తారు. దీనివల్ల ట్రాన్స్ ఫ్యాట్స్ ఏర్పడి అవి శరీరానికి మేలు చేయవు. ఇందులో ఉండే ఒమేగా-6 అధికంగా ఉండడం వల్ల వాపులు, ఇతర సమస్యలు తలెత్తుతాయి.
పత్తి గింజల నూనె.. పత్తి విత్తనాల నుంచి వచ్చే ఈ నూనెను ఎక్కువగా ప్రాసెస్ చేస్తారు. ఇందులో గోసిపోల్ అనే సహజ విషం ఉంటుంది. ఇది కాలేయానికి, పునరుత్పత్తి వ్యవస్థకు హానికరం. ఈ నూనెను వంటలో వాడటం మంచిది కాదు.
మొక్కజొన్న నూనె.. ఇది కూడా హెక్సేన్ వంటి రసాయనాలతో తయారవుతుంది. ఇందులో ఒమేగా-6 అధికంగా ఉంటుంది. ఇది శరీరంలో మంట పెంచుతుంది. దీని వల్ల గుండె జబ్బులు, ఊబకాయం, మధుమేహం, క్యాన్సర్ వంటి వ్యాధుల అవకాశాలు పెరుగుతాయి. తయారీ సమయంలో పోషకాలు తగ్గిపోయి హానికర పదార్థాలు పెరిగే అవకాశం ఉంటుంది.
కూరగాయల నూనె.. ఇది వివిధ విత్తనాలు, గింజల నుంచి తయారవుతుంది. దీంట్లో చౌకైన పదార్థాలు ఎక్కువగా ఉంటాయి. ఈ నూనె అధికంగా ప్రాసెస్ చేయబడుతుంది. వాడేటప్పుడు ట్రాన్స్ ఫ్యాట్స్, ఫ్రీ రాడికల్స్, ఇతర టాక్సిన్లు ఏర్పడతాయి. ఇవి శరీరానికి మేలు చేయవు.
కుసుమ నూనె.. ఈ నూనెలో పాలీఅన్‌శాచురేటెడ్ కొవ్వులు ఎక్కువ. ఇవి వేడి సమయంలో విచ్ఛిన్నమై హానికరమైన పదార్థాలుగా మారతాయి. ఇందులో లినోలెయిక్ ఆమ్లం ఎక్కువగా ఉంటుంది. ఇది గుండె సమస్యలు, క్యాన్సర్, మధుమేహం వంటి సమస్యలకు దారి తీస్తుంది.
(NOTE: ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. నిపుణులు అందించిన సమాచారం ప్రకారం ఇక్కడ తెలియజేయడమైనది. ఆరోగ్యరీత్యా ఎలాంటి సమస్యలు ఉన్నానేరుగా వైద్య నిపుణులను సంప్రదించడం మంచిది)




