AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Phone Problems: భార్యాభర్తల మధ్య గొడవలకు కారణమదే.. దీన్ని దూరం పెడితే వెంటనే పరిష్కారం..

ఎక్కువసేపు మొబైల్ ఫోన్‌ని ఉపయోగించడంతో పాటు మన అనుకునే వారిని విస్మరించడం తరచుగా సంబంధాల నాణ్యతపై ప్రతికూల ప్రభావాన్ని చూపుతుంది. ముఖ్యంగా ఎదుటివారికి తనకు ప్రాముఖ్యత ఇవ్వడం లేదనే అనుభూతిని కలిగించవచ్చు.

Phone Problems: భార్యాభర్తల మధ్య గొడవలకు కారణమదే.. దీన్ని దూరం పెడితే వెంటనే పరిష్కారం..
Smartphone In Dark
Nikhil
|

Updated on: Feb 28, 2023 | 3:30 PM

Share

ఒకరిఒకరికి నమ్మకంతో జీవితాంతం తోడు ఉంటామనే భావనతో చాలా మంది పెళ్లి చేసుకుంటారు. అయితే పెరుగుతున్న టెక్నాలజీ కారణంగా ఆ బంధాలు కలకాలం నిలవడం లేదు. ముఖ్యంగా ప్రస్తుత కాలంలో పెరుగుతున్న స్మార్ట్ ఫోన్ వినియోగం కుటుంబ బంధాలపై తీవ్ర ప్రభావం చూపుతుంది. కమ్యూనికేషన్, కనెక్షన్‌ను స్మార్ట్ ఫోన్ సులభతరం చేసినప్పటికీ, అవి మన సంబంధాలకు కూడా ముప్పుగా మారాయి. ఎక్కువసేపు మొబైల్ ఫోన్‌ని ఉపయోగించడంతో పాటు మన అనుకునే వారిని విస్మరించడం తరచుగా సంబంధాల నాణ్యతపై ప్రతికూల ప్రభావాన్ని చూపుతుంది. ముఖ్యంగా ఎదుటివారికి తనకు ప్రాముఖ్యత ఇవ్వడం లేదనే అనుభూతిని కలిగించవచ్చు. ఇటువంటి ప్రతికూల భావోద్వేగాలు క్రమంగా సంబంధాలు నాశనం అవ్వడానికి కారణం అవుతున్నాయి. సెల్ ఫోన్‌లు సంబంధాలను నాశనం చేస్తున్నాయని స్పష్టమైన ఉదాహరణ. సెల్ ఫోన్ మన జీవితంలో ఎలా భాగమయ్యాయో? ఓ సారి చూద్దాం.

నోటిఫికేషన్ల తనిఖీ

మీరు నోటిఫికేషన్‌ల కోసం మీ ఫోన్‌ని నిరంతరం తనిఖీ చేస్తూ ఉంటాం. అది మన దృష్టి మరల్చవచ్చు. ఈ అలవాటు మీ భాగస్వామి నుంచి మీ దృష్టిని కూడా దూరం చేస్తుంది. దీంతో ఇద్దరి మధ్య సంబంధం దెబ్బతింటుంది.

సాన్నిహిత్యం లేకపోవడం

స్మార్ట్‌ఫోన్‌ల ఇద్దరి మధ్య శారీరక సాన్నిహిత్యం లోపిస్తుంది. మీ భాగస్వామితో సన్నిహితంగా ఉండటానికి బదులుగా సోషల్ మీడియా ద్వారా సందేశాలు పంపడం లేదా స్క్రోలింగ్ చేయడం వల్ల ఆప్యాయత తగ్గుతుంది. క్రమేపి మీ సంబంధాన్ని బలహీనపరుస్తుంది.

ఇవి కూడా చదవండి

భాగస్వామిపై నమ్మకం

మీ భాగస్వామి ఫోన్‌ని తనిఖీ చేయడం, అలాగే వారికి నిరంతరం మెసేజ్‌లు పంపడం లేదా కాల్ చేయడం వారిపై మనకున్న నమ్మకంపై ప్రభావం చూపుతుంది. ముఖ్యంగా మన భాగస్వామిపై అసూయ లేదా అపనమ్మకం భావాలకు బాగా పెరుగుతాయి. 

అర్థం చేసుకోవడంలో ఇబ్బందులు

మనకు వేరేవారు పంపే మెసెజ్‌లను మన భాగస్వామి తప్పుగా అర్థం చేసుకోవచ్చు. ఇది ఎక్కువగా అపార్థాలు, దెబ్బలాటలకు, పరస్పర వాదనలకు కారణం అవుతుంది. వ్యంగ్యం లేదా హాస్యానికి సంబంధించిన మెసేజ్‌లు వేరే వారు చాలా సులభంగా తప్పుగా అర్థం చేసుకుంటారు. కాబట్టి ఇలాంటి మెసేజ్‌ల విషయంలో జాగ్రత్తగా ఉండాలి.

సైబర్ మోసాలు, బెదిరింపులు

మీ భాగస్వామి సైబర్ బెదిరింపుకు గురైతే మీరు వారితో వ్యవహరించే తీరు చాలా ముఖ్యం. అది వారి మానసిక ఆరోగ్యాన్ని ప్రభావితం చేస్తుంది. అలాగే మీ సంబంధంలో ఒత్తిడి మరియు ఆందోళనను కలిగిస్తుందని గుర్తుంచుకోవాలి.

టెక్నాలజీపై ఆధారపడడం

మీరు కమ్యూనికేషన్ కోసం సాంకేతికతపై ఎక్కువగా ఆధారపడితే, అది మీ సంబంధంలో దూరాన్ని, భావోద్వేగ బంధంలో లోపాన్ని సృష్టిస్తుంది. వ్యక్తిగతంగా కలవకుండా, నిరంతరం మెసేజ్‌లు పంపడం లేదా ఈ మెయిల్ పంపడం వంటివి చేస్తే మీ జీవిత భాగస్వామికి దూరం అవుతున్నామనే భావన కల్గించవచ్చు. 

మరిన్ని లైఫ్ స్టైల్ న్యూస్ కోసం