Egg Benefits: గుడ్డు వెర్రీ గుడ్డు.. గుండె సంబంధిత సమస్యలు ఫసక్..

ఇటీవల వెల్లడైన ఓ అధ్యయనం ప్రకారం వారానికి రెండు నుంచి మూడు గుడ్లు తింటే గుండె సంబంధిత సమస్యలు అరవై శాతం వరకూ తగ్గాయని వెల్లడైంది. అలాగే నాలుగు నుంచి ఏడు గుడ్లు తిన్నవారు 75 శాతం మేర గుండె సమస్యలు తగ్గించుకోగలిగారు.

Egg Benefits: గుడ్డు వెర్రీ గుడ్డు.. గుండె సంబంధిత సమస్యలు ఫసక్..
Follow us
Srinu

|

Updated on: Feb 28, 2023 | 4:45 PM

చాలా మంది గుడ్డులో ఎక్కువ కొలెస్ట్రాల్ ఉంటుందని దానికి దూరంగా ఉంటారు. ముఖ్యంగా గుండె రోగులైతే గుడ్డును దరిచేరనివ్వరు. అయితే గుడ్డు మంచి ప్రోటీన్ ఫుడ్ అని అందరికీ తెలుసు. అయితే ఓ క్రమ పద్ధతిలో గుడ్డు ఆహారంలో చేర్చుకుంటే మంచి ఫలితాలు ఉంటాయని పోషకాహార నిపుణులు చెబుతున్నారు. ఇటీవల వెల్లడైన ఓ అధ్యయనం ప్రకారం వారానికి రెండు నుంచి మూడు గుడ్లు తింటే గుండె సంబంధిత సమస్యలు అరవై శాతం వరకూ తగ్గాయని వెల్లడైంది. అలాగే నాలుగు నుంచి ఏడు గుడ్లు తిన్నవారు 75 శాతం మేర గుండె సమస్యలు తగ్గించుకోగలిగారు. దాదాపు 3042 మందిపై చేసిన పరిశోధనల్లో ఈ విషయం తేలింది. గుడ్డు వినియోగం, కార్డియోవాస్కులర్ డిసీజ్, కార్డియోమెటబోలిక్ రిస్క్ ఫ్యాక్టర్స్, ది ఇంటరాక్షన్ విత్ సాచురేటెడ్ ఫ్యాటీ యాసిడ్స్ అనే పేరుతో జరిగిన ఈ అధ్యయనానికి గ్రీస్‌లోని పోషకాహార పరిశోధకులు మరియు డేటా శాస్త్రవేత్తల బృందం నాయకత్వం వహించింది. గుండె ఆరోగ్యకరమైన ఆహారంలో గుడ్లకు స్థానం ఉందని, మొత్తం సంతృప్త కొవ్వు తీసుకోవడం ద్వారా గుండె ఆరోగ్యం మెరుగు అవుతుందని నిపుణులు చెబుతున్నారు. 

గుడ్లల్లో విటమిన్ బి2, విటమిన్ బి12, సెలీనియం వంటివి అధికంగా ఉంటాయి. ఒకవేళ ఇవి శరీరంలో లోపిస్తే హోమోసిస్టీన్ అనే అమైనో యాసిడ్ పెరుగుదలకు కారణమవుతుంది. ఇది దమనుల్లో ఫలకం ఏర్పడే ప్రమాదాన్ని పెంచుతుంది. అలాగే సెలీనియం యాంటీఆక్సిడెంట్‌గా కూడా పనిచేస్తుంది. దీంతో గుండె జబ్బులను నివారించడంలో సహాయపడుతుంది. గుండె రోగులు ప్రాసెస్డ్ ఫుడ్‌కు దూరంగా ఉండాలి కాబట్టి కచ్చితంగా గుడ్డు తీసుకుంటే వైద్య నిపుణులు చెబుతున్నారు. అలాగే ఎప్పుడు గుడ్లను ఉడకబెట్టి తీసుకోవడం బోరింగ్‌గా అనిపిస్తే ఇతర ఆహారాలతో కలిపి తీసుకోవాలని సూచిస్తున్నారు. లేకపోతే ఆమ్లెట్‌లా అయినా వేసుకోవాలని సూచిస్తున్నారు. మొత్తానికి శరీరానికి సంతృప్త కొవ్వులను అందించడానికి కచ్చితంగా గుడ్డు వినియోగం ఉండాలని సూచిస్తున్నారు. ఇవి గుడ్లల్లో అధికంగా ఉండడం వల్ల వారానికి 1-3 లేదా 1-7 గుడ్లు కచ్చితంగా తినాలని నిపుణుల సూచన. ఇలా తినడం ద్వారా వారానికి 1.6 గ్రాముల నుంచి 11.6 గ్రాముల సంతృప్త కొవ్వును శరీరానికి అందించవచ్చు. ప్రతిరోజు శరీరానికి 2000 క్యాలరీల ఆహారం అందిస్తే 13 గ్రాముల సంతృప్త కొవ్వు అందుతుంది. అయితే గుడ్లను అధికంగా ఆహారంలో చేర్చినా వ్యక్తి సంబంధించిన ఆరోగ్య పరిస్థితిని బట్టి గుడ్ల వినియోగాన్ని పరిమితం చేయాలని సూచిస్తున్నారు. 

ఇవి కూడా చదవండి

మరిన్ని లైఫ్ స్టైల్ న్యూస్ కోసం