Social Media: రోజంతా సోషల్ మీడియాలో గడుపుతున్నారా?.. ఈ 4 టిప్స్ పాటించండి.. మిమ్మల్ని మీరు కంట్రోల్ చేసుకోండి..
Social Media: కరోనా మహమ్మారి కారణంగా చాలా మంది ప్రజలు పగలు, రాత్రి అని తేడా లేకుండా ఇంటికే పరిమితం అయ్యారు. మనసుకు నచ్చిన పనులు చేయలేక..
Social Media: కరోనా మహమ్మారి కారణంగా చాలా మంది ప్రజలు పగలు, రాత్రి అని తేడా లేకుండా ఇంటికే పరిమితం అయ్యారు. మనసుకు నచ్చిన పనులు చేయలేక.. రోజూ ఇంట్లోనే కూర్చుంటూ విసుగెత్తిపోతున్నారు. దాంతో చాలా మంది రిలాక్స్ అవడం కోసం సెల్‌ఫోన్‌ను ఆశ్రయిస్తున్నారు. తరచుగా ఫోన్ చెక్ చేయడం.. సోషల్ మీడియా యాప్‌లను సెర్చ్ చేయడం పనిగా పెట్టుకుంటున్నారు. అది కాస్తా అలవాటుగా మారి.. రోజంతా సోషల్ మీడియాకే అధిక సమయాన్ని కేటాయిస్తున్నారు. అయితే, ఒకసారి దీనికి అలవాడు పడితే.. మళ్లీ మామూలు స్థితికి రావడం కష్టం.
సోషల్ మీడియాను ఎక్కువగా యూజ్ చేయడం వల ప్రతీకూల పరిస్థితులు ఎదురయ్యే ప్రమాదం ఉందని నిపుణులు చెబుతున్నారు. నిరంతరం సోషల్ మీడియాలో ఉండటం వల్ల వ్యక్తుల్లో అసాధారణ ప్రవర్తన కనిపిస్తుందంటున్నారు. ఇతరుల పట్ల అసూయ భావన కలుగుతుందన్నారు. అలసట, అసూయ, అసమర్థత భావన కలిగే ప్రమాదం ఉందంటున్నారు. అయితే, ఈ వ్యసనం నుంచి బయటపడేందుకు కొన్ని సులభమైన మార్గాలు ఉన్నాయని చెబుతున్నారు. వీటిని పాటించడం ద్వారా రోజంతా సోషల్ మీడియాలో గడపకుండా.. మిమ్మల్ని మీరు కాపాడుకోవచ్చు అని తెలిపారు. మరి టిప్స్ ఏంటో ఇప్పుడు చూద్దాం..
ఖాళీగా ఉంటే ఏదైనా పనులు చేయండి.. ఖాళీగా ఉన్నప్పుడు, పని నుంచి విరామం తీసుకోవాలనుకున్నప్పుడు.. చాలా మంది వెంటనే సోషల్ మీడియా యాప్స్‌ని ఓపెన్ చేస్తారు. అయితే, ఖాళీ సమయాల్లో సోషల్ మీడియాకు బదులుగా ఇతర ఆసక్తికరమైన అంశాలపై దృష్టి మల్లిస్తే చాలా ప్రయోజనం ఉంటుంది. ఇతర పనులపై దృష్టి మళ్లించినట్లయితే.. ఫోన్ వ్యసనం నుంచి బయటపడొచ్చు.
ఈ యాప్‌లను ఉపయోగించండి.. అంతులేని స్క్రోలింగ్‌ను నివారించడం కోసం కొన్ని యాప్‌లు అందుబాటులో ఉన్నాయి. ఈ యాప్‌ల సాయంతో మీరు సోషల్ మీడియాను వినియోగించేందుకు నిర్ధిష్ట సమయాన్ని సెట్ చేసుకోవచ్చు. నిర్ధిష్ట సమయం దాటినప్పుడు.. సదరు యాప్‌లు సోషల్ మీడియాను ఇకపై ఉపయోగించొద్దంటూ మీకు నోటిఫికేషన్స్ ఇస్తుంటాయి.
నోటిఫికేషన్‌లను ఆఫ్ చేయండి.. మీరు పనిలో ఉన్నప్పుడు, ఎవరైనా తమ ప్రొఫైల్‌లో కొత్త చిత్రాన్ని పోస్ట్ చేసినప్పుడు మీ ఫోన్‌కు నోటిఫికేషన్ వస్తుంది. అలా నోటిపికేషన్ వచ్చిన వెంటనే.. చాలామంది తాము చేసే పనిని వదిలిపెట్టి మరీ.. సోషల్ మీడియాను స్క్రోల్ చేస్తుంటారు. అందుకే ఇలా జరుగకుండా ఉండేందుకు సోషల్ మీడియా నోటిఫికేషన్‌లను ఆఫ్ చేయడం ఉత్తమం. ఇలా చేయడం ద్వారా మీ దృష్టి దానిపై ఉండదు.
సోషల్ మీడియా యాప్‌లను దాచండి.. మీ సోషల్ మీడియా యాప్‌లను దాచడం మరొక ప్రభావవంతమైన మార్గం. మీ ఫోన్‌లో కొత్త ఫోడ్డర్లను క్రియేట్ చేసి అందులో సోషల్ మీడియా యాప్‌లను దాచాలి. అలా చేస్తే.. మీ ఫోన్‌లో వెంటనే ఆ యాప్స్ కనిపించకుండా ఉంటాయి. తద్వారా.. సోషల్ మీడియా యాప్స్ ప్రభావం నుంచి బయటపడొచ్చు.
Also read:
Crime News: తల్లిని బెదిరించి ఇద్దరు కూతుళ్లపై అత్యాచారం.. ఆపై పురుగుల మందు తాగించి..
Immunity booster : పిల్లల్లో రోగనిరోధక శక్తిని పెంచడానికి ఈ ఆహారాన్ని తినిపించండి..
Viral Video: హలో బ్రదర్ ఇదేం డ్యాన్స్.. ఇలా కూడా చేస్తారా?.. వీడియో చూడండి.. కడుపుబ్బా నవ్వుకోండి..