Viral Video: ఇలాంటి విన్యాసాలు ఎప్పుడైనా చూశారా.. ఇది చూస్తే షాకవ్వాల్సిందే! వైరలవుతోన్న నీరజ్ చోప్రా వీడియో

నీరజ్‌ చోప్రా.. టోక్యోలో తన ఆటతో అందర్నీ మెప్పించి, స్వర్ణం సాధించిన అథ్లెట్. ప్రస్తుతం ఈ పేరు మార్మోగిపోతోంది. జావెలిన్‌ త్రో ఫైనల్లో తన అద్భుత ఆటతో చరిత్ర సృష్టించాడు.

Viral Video: ఇలాంటి విన్యాసాలు ఎప్పుడైనా చూశారా.. ఇది చూస్తే షాకవ్వాల్సిందే! వైరలవుతోన్న నీరజ్ చోప్రా వీడియో
Neeraj Chopra Viral Video
Follow us
Venkata Chari

|

Updated on: Aug 11, 2021 | 7:00 AM

Neeraj Chopra: నీరజ్‌ చోప్రా.. టోక్యోలో తన ఆటతో అందర్నీ మెప్పించి, స్వర్ణం సాధించిన అథ్లెట్. ప్రస్తుతం ఈ పేరు మార్మోగిపోతోంది. జావెలిన్‌ త్రో ఫైనల్లో తన అద్భుత ఆటతో చరిత్ర సృష్టించాడు. దీంతో ఒలింపిక్స్‌లో అథ్లెటిక్స్‌ విభాగంలో స్వర్ణం అందించిన తొలి వ్యక్తిగా.. వ్యక్తిగత విభాగంలో స్వర్ణం సాధించిన రెండో ఆటగాడిగా నీరజ్‌ చోప్రా నిలిచాడు. నీరజ్ చోప్రా పేరు ప్రస్తుతం ఇండియాలో ట్రెడింగ్‌లో కొనసాగుతోంది. అతనికి సంబంధించిన ఏ విషయమైనా నెట్టింట్లో సందడి చేస్తోంది. తన బయోపిక్ వార్తలు, ప్రేయసి వ్యవహారం, అవార్డులు, బహుమతులు ఇలా అన్ని విషయాలు నెట్టింట్లో సందడి చేస్తున్నాయి. అయితే తాజాగా టీమిండియా మాజీ క్రికెటర్ మహ్మద్ కైఫ్ సోషల్ మీడియాలో పంచుకున్న ఓ వీడియో మాత్రం ఔరా అనిపిస్తోంది. నీరజ్‌ చోప్రా టోక్యోలో స్వర్ణ పతకం సాధించడం వెనుక ఎన్నో ఏళ్ల కఠోర శ్రమ ఉందంటూ ఈ వీడియోలో అతను పడ్డ కష్టం చూస్తే ఇట్టే అర్థమవుతోందని పేర్కొన్నాడు.

ఇక వీడియో విషయానికి వస్తే.. నీరజ్‌ చోప్రా తన ప్రాక్టీస్‌‌లో భాగంగా చేతిలో ఓ బరువైన బాల్‌ను ఉంచుకుని శరీరాన్ని పూర్తిగా విల్లులా వంచాడు. అలా వంచి వెంటనే పైకి లేచి ఆబాల్‌ను విసురుతాడు. ఈ వీడియో చూసిన ఎవరైనా నిజంగా ఇది సాధ్యమేనా అంటూ ఆశ్చర్యపోతున్నారు. తన శరీరాన్ని ఎంత ఫ్లెక్సిబుల్‌గా మార్చుకున్నాడో ఈ వీడియో చూస్తే చాలంటూ మరికొందరు వెల్లడించారు. ఇంత కష్టపడ్డాడు కాబట్టే.. టోక్యోలో స్వర్ణం సాధించాడని ఇంకొందరు కామెంట్లు చేశారు. ఈ వీడియో నెటిజన్లను బాగా ఆకట్టుకుంటోంది. మరోవైపు టోక్యో ఒలింపిక్స్‌లో పురుషుల జావెలిన్‌ త్రో ఫైనల్లో నీరజ్‌ చోప్రా 87.58 మీటర్లు విసిరి సంచలన ప్రదర్శనతో స్వర్ణం సాధించాడు. హర్యానాలోని పానిపట్ ఖండ్రా గ్రామానికి చెందిన నీరజ్ చోప్రా.. అథ్లెటిక్స్‌లో దేశానికి మొదటి ఒలింపిక్ స్వర్ణాన్ని అందించినవాడిగా చరిత్రలో నిలిచాడు.

Also Read: Neeraj Chopra: మీకు ప్రేయసి ఉందా?.. ప్రశ్నించిన యాంకర్.. అదిరిపోయే రిప్లయ్ ఇచ్చిన ‘నీరజ్ చోప్రా’..

Neeraj Chopra: మీ పేరు నీరజ్ ? అయితే మీకు బిర్యాని ఫ్రీ.. బంపర్ ఆఫర్ ప్రకటించిన ‘చిల్లీస్’ రెస్టారెంట్..